Amrutham Serial Episode 7 Review: 'అమృతం'.. ఈ పేరు చెప్తేనే అందరి ముఖాలపై చిరునవ్వు వస్తుంది. అప్పట్లో ఈ సీరియల్ అంత సెన్షేషన్ మరి. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో 90sలో వచ్చిన సీరియల్.. ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. తమ కామెడీ టైమింగ్, అదిరే పంచులతో అంజి, అమృతం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి హాస్య రసామృతాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తూ ఆ ఎపిసోడ్స్ మీ కోసం..
పాపం.. అమృతం కన్ఫ్యూజ్ అయ్యాడుగా..
అమృతం, సంజీవని రాత్రి ఇంట్లో టీవీ చూస్తుండగా టైం 9 అయిన విషయాన్ని గమనించి లైట్స్ ఆపేస్తారు. ఇంటి ఓనర్ అప్పాజీ రూల్స్ ఇందుకు కారణం. అప్పాజీ టార్చర్ భరించలేకపోతున్నామని.. ఇల్లు మారిపోదామని అమృతం అంటే ఆఫీసుకు దగ్గర ఇంత తక్కువ రెంట్‌కు ఇల్లు దొరకదని సంజీవని చెబుతుంది. తర్వాత రోజు మార్నింగ్ సంప్రదాయ దుస్తుల్లో అప్పాజీలా అతని తమ్ముడు అంబాజీ వస్తాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన అమృతం ఓనర్ అనుకుని అతనికి రెంట్ తెచ్చిస్తాడు. ఇక నుంచి ఎలాంటి రూల్స్ లేవని అంబాజీ చెబుతాడు. దీంతో అమృతం ఆనందిస్తాడు.
దీంతో ఇంటికి మేకులు కొడుతుండగా అసలైన అప్పాజీ వచ్చి చిందులేస్తాడు. అయితే, మీరే కదా చెప్పారంటే.. అంబాజీని చూసిన అప్పాజీ అతను తన తమ్ముడని చెప్తాడు. గోడ కట్టిన డబ్బులే రెంట్‌గా తీసుకున్నానని అంబాజీ చెప్తాడు. దీంతో మళ్లీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. చివరకు అప్పాజీ.. అంబాజీలా వేషం వేసుకుని అంజి దగ్గర రెంట్ వసూలు చేస్తాడు. అతను అంబాజీ అనుకుని అప్పాజీని తిడతాడు అమృతం. అంజి నుంచి రెట్ తీసుకున్న తర్వాత అప్పాజీ తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపెడతాడు. ఇల్లు ఖాళీ చేసేయాలని బెదిరిస్తాడు. దీంతో అంబాజీ వద్ద అమృతం విషయం చెప్పగా.. అంజినే ఓ రౌడీలా అప్పాజీని బెదిరిస్తాడు. దీంతో అప్పాజీ.. అమృతాన్ని అదే ఇంట్లో ఉండమంటాడు. రూల్స్ కాస్త సడలిస్తానని చెప్పి చివరకు ట్విస్ట్ ఇస్తాడు. ఇంతకూ అదేంటో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసేయండి మరి..