Ammayi garu Serial Today Episode రాజు రాత్రి రూపని బయటకు పిలిచి రూప కోసం పానీపూరీ తీసుకొచ్చి తినిపిస్తాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు. రూప పానీ పూరీ తినడంతో రూపకి ఎక్కిళ్లు వస్తాయి. సౌండ్ ఎవరైనా వింటే బయటకు వస్తారని కంగారు పడతారు. వాటర్ మర్చిపోయానని చెప్పిన రాజు రూపని సడెన్‌గా ముద్దు పెడతాడు. షాక్ అయిన రూప ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఇప్పుడు తగ్గిపోయాయి అమ్మాయి గారు అని ఇద్దరూ చలిపిగా నవ్వుకుంటారు.
బంటీని కూడా తేవాల్సింది అని రూప అంటే తర్వాత తీసుకొస్తానని రాజు అంటాడు. ఇక రూప ఇంట్లోకి బయల్దేరుతుంది. ఇంతలో రాజుకి కూడా ఎక్కిళ్లు వచ్చినట్లు నటిస్తే రూప కూడా రాజుకి ముద్దు పెడుతుంది. రాజు మళ్లీ ముద్దు పెట్టించుకోవడానికి ఎక్కిళ్లు వచ్చినట్లు నటిస్తాడు. రూప ఒక్కటిచ్చి రాజుని పంపుతుంది. ఉదయం అందరూ ఎలక్షన్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు. పార్టీ కార్యకర్తలు సూర్య ప్రతాప్ ఇంటికి చేరుకుంటారు. రూప తల్లి గెలవాలి అని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక రెండు కుటుంబాల వాళ్లు టీవీలకు అతుక్కుంటారు. ఈ సారి ఎన్నికల్లో రసవత్తరంగా జరుగుతున్నాయని టీవిలో చెప్తారు. సూర్యప్రతాప్ తాను పోటీ చేసిన ప్రాంతంలో ఆధిక్యంతో గెలుపొందుతాడు. అందరూ ఎగిరి గంతులేస్తారు. సూర్య ప్రతాప్‌కి కంగ్రాట్స్ చెప్తారు. విరూపాక్షి వాళ్లు కూడా సంతోషం పడతారు. విజయాంబిక విరూపాక్షి మీద ఆధిక్యం ఉండటంతో విరూపాక్షి టెన్షన్ పడుతుంది. విజయాంబిక గెలుపొందితే ఇంటిని నాశనం చేస్తుందని విరూపాక్షి బాధ పడతుంది.
ఇక రెండు ప్రధాన పార్టీలు ఒకేలా ఉన్నాయిని ఈసారి సీఎం సూర్య ప్రతాప్ అవుతారో లేదో అని అందరూ టెన్షన్ పడతారు. ఇక లాస్ట్‌లో విజయాంబిక గెలిస్తే సూర్య సీఎం అవుతాడని స్వంత్ర అభ్యర్థి విరూపాక్షి గెలిస్తే ఆమె ఏ పార్టీకి వెళ్తే వాళ్లు ఒక్క సీట్‌తో సీఎం అవుతారని అనుకుంటారు. జైలులో ఉన్న దీపక్ తనని అరెస్ట్ చేసిన పోలీసులు తల్లి ఎమ్మెల్యే అయితే రాజ మర్యాదలతో తనని బయటకు విడిపిస్తారని అనుకుంటాడు. విజయాంబిక, విరూపాక్షి పోటీ చేసిన ప్రాంతంలో సూర్య ప్రతాప్ కంచుకోటని స్వతంత్ర అభ్యర్థి బద్ధల కొట్టింది అని విజయాంబిక మీద విరూపాక్షి 60 వేల కోట్ల ఆధిక్యంతో గెలుపొందిందని చెప్తారు. సూర్య ప్రతాప్ విజయంబిక, వాళ్ల పార్టీ వాళ్లు షాక్ అయిపోతారు.
విరూపాక్షి ఇంట్లో అందరూ సంతోష పడతారు. విజయాంబిక ఏడుస్తుంది. ఇక రెండు ప్రధాన పార్టీలు 59 చొప్పున స్థానాలు దక్కించుకున్నాయని ఒక్క విరూపాక్షి మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారని ఇప్పుడు తనే సీఎం ఎవరు అని నిరూపిస్తుందని చెప్తారు. ఇదే అవకాశంగా విరూపాక్షి సూర్యలు కలిసి పోతారని అలా జరగకూడదని విజయాంబిక అనుకుంటుంది. రూప తల్లికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తుంది. రాజుకి థ్యాంక్స్ చెప్తుంది. విరూపాక్షి దగ్గరకు మరోపార్టీ వాళ్లు వచ్చి మినిస్టరీ ఇస్తామని తమ పార్టీలో కలవమని అంటారు. ఆలోచించుకుంటానని విరూపాక్షి చెప్తుంది. ఇక సూర్య ఇంట్లో అందరి శ్రమ వృథా అయిపోతుందని విరూపాక్షి సపోర్ట్ తీసుకుందామని అంటారు. దాంతో అవసరం అయితే పార్టీ నుంచి తప్పుకుంటా కానీ ఆమె సపోర్ట్ తీసుకోను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!