Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 12th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఐసీయూలో జాను.. మిత్రకు మత్తు ఇంజెక్షన్ వేసిన సరయు.. తాళితో మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రను పెళ్లి చేసుకోవడానికి మనీషా జానుకి నిజం తెలిసేలా చేసి మిత్రకు మత్తు ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ ఫ్యామిలీ మొత్తం హోళీ వేడుకల్లో ఉంటారు. మనీషా లక్ష్మీ దగ్గరకు బొకే తీసుకొచ్చి అందులో నుంచి తాళి బొట్టును బయటకు తీస్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. బొకే నీకు తాళి నాకు అని మనీషా అనడంతో లక్ష్మీ బొకేని విసరబోతే మనీషా ఆపి పది నిమిషాల్లో నాకు మిత్రకు పెళ్లి అది అయిన తర్వాత నువ్వు నాకు, మిత్రకు బొకే ఇవ్వాలని అంటుంది.
పిచ్చి పిచ్చిగా ఉందా అని లక్ష్మీ మనీషా మీద అరుస్తుంది. పెళ్లి ఆపాలి అనుకుంటే దేవయాని ఆంటీతో విషయం చెప్తానని అంటుంది. ఎంజాయ్ చేసుకుంటున్న జాను, వివేక్‌లను చూపించి చెప్పాలా అంటుంది. దాంతో లక్ష్మీ మనీషాని ఆపుతుంది. ఏం చేయలేక లక్ష్మీ ఏడుస్తుంది. సరయు మనీషాతో నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. నీ వెపన్ ఏంటి అంటే జానుని చూపిస్తుంది. ఇక తన ఐడియా సరయుకి చెప్తుంది. సరయు ఓకే అంటుంది. మిత్ర దగ్గరకు కొంత మంది బిజినెస్ వాళ్లు వచ్చి నీ భార్య ఓవర్ చేసింది ఏంటిని మిత్రతో గొడవ పడతారు. లక్ష్మీ, మనీషా, జయదేవ్ అందరూ మిత్రని ఆపుతారు. నన్ను అనవసరంగా తీసుకొచ్చావని మిత్ర లక్ష్మీని తిడతాడు. ఇక వెంట వెంట నువ్వు తిరుగుతుంటే నన్ను అందరూ కామెంట్స్ చేస్తున్నారు నువ్వు నా వెంట తిరగడం మానేయ్ అని తిడతాడు. లక్ష్మీని జయదేవ్ కూడా అదే ప్రశ్న వేస్తాడు. దాంతో లక్ష్మీ నాకు మనీషా మీద అనుమానం ఉందని అంటుంది.
సరయు జంటలకు పోటీ పెడుతుంది. తాము సీక్రెట్‌గా పెట్టిన కలర్స్ ఎవరివి మ్యాచ్ అయితే వాళ్లు విన్ అయినట్లని చెప్తుంది. జాను, వివేక్ అందరూ తీసుకుంటారు. జాను, వివేక్ కలర్స్ సేమ్ కావడంతో ఇద్దరూ ఎగిరి గంతులేస్తారు. అయితే జానుకి కలర్ వచ్చి పేపర్‌లో జానుకి ఉన్న ప్రాబ్లమ్ కనిపిస్తుంది. అది చూసి జాను షాక్ అయిపోతుంది. ఇది నిజమేనా అని వివేక్‌ని అడిగి ఏడుస్తుంది. వివేక్ ఆ పేపరు తీసుకొని చూసి షాక్ అయిపోతాడు. అది నీ రిపోర్ట్ కాదని వివేక్ అంటే నా పేరు ఉంది వైఫ్ ఆఫ్ వివేక్ నందన్ అని ఉంది అని తన దగ్గర నిజం ఎందుకు దాచారు అని లోపం నాలో ఉంటే మీ మీద నింద ఎందుకు వేసుకున్నారు.. నాకు పిల్లలు పుట్టరా అని జాను రిపోర్ట్ చూస్తూ ముక్కలో నుంచి రక్తం వచ్చి ఫిట్స్ వచ్చినట్లు కింద పడిపోతుంది. లక్ష్మీ, జయదేవ్‌లకు విషయం తెలియడంతో అక్కడికి వెళ్తారు. వివేక్, లక్ష్మీలు జానుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. మనీషా దేవయానికి జాను పడిపోయిందని చెప్పి దేవయానిని పంపేస్తుంది.
మిత్ర మందు తాగుతుంటే మనీషా ఆపుతుంది. నాకు తాగాలి అని ఉందని మిత్ర అంటే మనీషా కూల్‌గా మాట్లాడుతుంది. లక్ష్మీ కావాలనే మనల్ని పంపించిందని అంటుంది. మనీషా మిత్రతో జ్యూస్ తాగించబోతే జయదేవ్ వచ్చి జాను ముక్కు నుంచి రక్తం వస్తుంది చెప్పి హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. మనీషా తన ప్లాన్ ఫెయిల్ అయిపోతుందేమో అని షాక్ అయిపోతుంది. జానుని ఐసీయూలోకి తీసుకెళ్తారు. మనీషా సరయుతో మిత్ర వెళ్లిపోతున్నాడు అని చెప్తే ప్లాన్ బీ అమలు చేద్దామని అంటుంది. జయదేవ్ కంట్లో కలర్ వేసేస్తారు. మిత్రకు సరయు మత్తు ఇంజక్షన్ వేస్తుంది. జాను గురించి లక్ష్మీ, వివేక్ బాధ పడతారు. జానుకి ఏం కాదని లక్ష్మీ అంటుంది. జానుకి సడెన్‌గా ఇలా ఎందుకు అయిందని దేవయాని లక్ష్మీ మీద అరుస్తుంది. రోగిష్టి దాన్ని నా కొడుకుకి ఇచ్చి కట్టబెట్టారా అని అరుస్తుంది. వివేక్ తల్లి మీద సీరియస్ అయిఇంటికి వెళ్లి పోమంటాడు. దేవయానికి మనీషా కాల్ చేస్తుంది. ఇంకాసేపట్లో నా పని పూర్తి అవుతుందని అందుకే మీకు ఓ విషయం చెప్తానని ప్రాబ్లమ్ వివేక్‌లో లేదు జానులో ఉందని చెప్తుంది. దేవయాని షాక్ అయిపోతుంది. జానుకి ఇప్పుడే ఆ విషయం తెలిసిందని అందుకే షాక్ అయిపడిపోయిందని లక్ష్మీకి కూడా ఈ విషయం తెలుసు అని అంటుంది. దేవయాని నోట మాట రాకుండా అయిపోతుంది. మనీషా చేతికి సరయు తాళి ఇచ్చి కట్టించుకోమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఏసీపీ విజయ్ ఎంట్రీ అదుర్స్.. ఆపరేషన్ కావేరి 'గేమ్ స్టార్ట్స్ నౌ'..!