Seethe Ramudi Katnam Today Episode ప్రీతి, ఉషలు చేసిన పనికి జనార్థన్‌ విద్యాదేవి  మీద పడిపోతాడు. ఏదో ఆలోచించి పడిపోయింటావ్ అని గిరిధర్‌ అంటే అంతలా ఏం ఆలోచిస్తున్నావ్ అని మహాలక్ష్మీ అడుగుతుంది. ఇక రామ్ మెట్ల మీదకు వెళ్లి చూస్తాడు. అక్కడ వైరు ఉడటం చూస్తాడు. ఎవరు కట్టారు అని నిలదీస్తాడు. ఇక ప్రీతి ఉషలు అక్కడి నుంచి జారుకోవాలి అని చూస్తే సీత ఆగమని అంటుంది.


విద్యాదేవి: వీళ్లే చేసి ఉంటారు. ఇందాక నుంచి టెన్షన్ టెన్షన్‌గా ఉంటున్నారు. 
మహాలక్ష్మి: కళ్లు నెత్తికెక్కి నడుస్తున్నావా చూసుకోవాలి కదా.
సీత: బాగుంది అత్తయ్య. కట్టింది వాళ్లు.. పడింది మామయ్య మీరు మాత్రం మా టీచర్‌ని అంటున్నారు.  
రామ్: డాడీకి ఏం కాకుండా టీచర్‌ని కాపాడారు కదా మరి టీచర్‌ని ఎందుకు అంటున్నారు పిన్ని. దారికి అడ్డంగా వైరు కట్టారు డాడీకి ఏమైనా అయ్యింటే.. బుద్ధి ఉందా లేదా..
మహాలక్ష్మి: ప్రీతి, ఉష నాతో రండి.. ఇద్దరినీ మహా కొడుకుతుంది. ఆ వైరు మీరే కట్టారు అని నాకు అర్థమైంది. ఎందుకు చేశారు ఈ పని.
ఉష: అది ఆ విద్యాదేవి టీచర్‌ని కిందపడేయాలి అనుకున్నాం.
ప్రీతి: కింద పడితే మళ్లీ డ్యాన్స్ చేయలేదు కదా అని అలా అనుకున్నాం. 
మహాలక్ష్మి: మీరు చేసిన పని వల్ల మీ డాడీ కింద పడ్డారు. అది ఆ టీచర్ మీద పడ్డారు.
సీత: అత్తయ్య.. దెబ్బలు తగిలినా మా టీచర్‌కి కదా మామయ్యని జాగ్రత్తగా చూసుకుంది కదా. మరి ఏంటి ప్రాబ్లమ్.
మహాలక్ష్మి: ఆయన ఆవిడ మీద పడటమే ప్రాబ్లమ్. 
సీత: టీచర్‌కి ప్రాబ్లమ్ అవ్వాలి కానీ మీకు ప్రాబ్లమ్ ఏంటి.
మహాలక్ష్మి: ఆ మధ్య మధుమిత రామ్ మీద పడితే మీరు నువ్వు ఫీల్ అవ్వలేదా. మధుని నిందించలేదా.
సీత: ఓహో మీరు అలా వచ్చారా అర్థమైంది. అంటే మీరు మా టీచర్ మీద అసూయ పడుతున్నారు అన్నమాట.  
మహాలక్ష్మి: అది తప్పు అయితే ఇది తప్పే.
సీత: మా టీచర్ అలాంటిది కాదు నాకు తెలిసి మామయ్య కూడా అలాంటి వారు కాదు. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మై డియర్ మరదల్స్ ఇంకోసారి మీరు ఇలా చేస్తే మీకాలు చేయి విరిగేలా నేను ప్లాన్ చేయాల్సి వస్తుంది. 
అర్చన: అంతా మీ వల్లే ఏదైనా ప్లాన్ చేస్తే ఫరెఫెక్ట్‌గా ఉండాలి. 
మహాలక్ష్మి: ఇంకెప్పుడూ ఇలా చేయకండి వెళ్లండి.


మహాలక్ష్మి అర్చనకు తన ప్లాన్ గురించి చెప్తుంది. విద్యాదేవిని ఇంటి నుంచి పంపేయాలి అని అంటుంది. మధు తల్లిదండ్రులు మధు ఇంటికి వస్తే గుమ్మం బయటే మధు ఆపేస్తుంది. మీరు అరెస్ట్ చేసిన ఖైది జైలు నుంచి వచ్చాడని మళ్లీ అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి వచ్చారా అని అడుగుతుంది. దీంతో లలిత ఆయన పోలీస్ అధికారిలా రాలేదు అని నీ తండ్రిలా వచ్చారని అంటుంది.


మధు: నా కన్న తండ్రి ఇంకా బతికే ఉన్నాడా.. ఓ సారీ.. ఆయన దృష్టిలో చనిపోయింది నేనే కదా. మీకు ఉన్నది ఒక్కర్తే కూతురు కదా. మరి ఈ ఇంటికి వచ్చారెందుకండి. మీ ఇంటికి నేను రాకూడదు అని చెప్పారు కదా. నేను చచ్చాను అని మైల స్నానం చేశారు కదా. 
లలిత: అదంతా ఒకప్పుడే ఆ తర్వాత నిన్ను కలుపుకున్నాం కదా. మీ నాన్న కోపం తగ్గించుకుని రాకపోకలు చేస్తున్నాం కదా.
మధు: ఈయన ఆఖరి సారి మా ఇంటికి ఎప్పుడు వచ్చారు నా భర్తని అరెస్ట్ చేయడానికి కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా. ఆఖరి సారి మీ ఇంటికి నేను ఎప్పుడు వచ్చాను నా భర్తని విడిపించమని వేడుకోవడానికి కదా. ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి రావాలి మీరు నా గొంతు పట్టుకుంటే నేను మీ కాలు పట్టుకోవాలా.


లలిత మధుని కొట్టి సీత వెళ్లమంటే వచ్చామని అంటుంది. దాంతో మధు వెటకారంగా నవ్వుతూ..  సీత చెప్తే వచ్చారా నా మీద ప్రేమతో కాదా అని అంటుంది. శివకృష్ణ కూడా మధుతో ప్రేమగా మాట్లాడితే ఇంతకు ముందు ఎందుకు ప్రేమగా చూసుకోలేదు అని అంటుంది.  అయినా మధుమితని శివకృష్ణ వాళ్లు ఇంటికి రమ్మని మధుని పిలుస్తారు. జలజ మనసులో మధుని ఎలా అయినా వాళ్లతో పంపించి సూర్యని రెచ్చగొట్టొచ్చని అనుకుంటుంది. మధు వెళ్లను అని ఎంత చెప్పినా వినకుండా శివకృష్ణ వాళ్లతో మధుని పంపుతుంది. ఇంతలో సూర్య వస్తాడు. మధుని బ్యాగ్‌తో చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. సూర్యని కూడా లలిత వాళ్లు పిలుస్తారు. దానికి సూర్య దొంగ పోలీసులు ఒక ఇంట్లో ఉండకూడదు అని అంటాడు. మధుని తీసుకెళ్లద్దని చెప్తాడు. అడుక్కొని అయినా తింటాం కానీ మీ ఇంటికి రాము అని చెప్తాడు. మధుని లోపలికి వెళ్లమని సూర్య అంటాడు. లలిత, శివకృష్ణలు వెళ్లిపోతారు. మరోవైపు సీత, రామ్‌లు విద్యాదేవి దగ్గరకు వచ్చి సన్మానం గురించి చెప్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సంధ్య పరిస్థితి చూసి ఫ్యామిలీ షాక్.. రేణుక ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న సత్య.. భార్యని ముద్దాడిన క్రిష్!