Seethe Ramudi Katnam Today Episode : విద్యాదేవిని పంపించేయాలి అని మహాలక్ష్మీ వాళ్లు అనుకుంటారు. మహా వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు సీత వింటుంది. టీచర్‌ని పంపేస్తారా చెప్తా మీ సంగతి అనుకుంటూ సీత చలపతి దగ్గరకు వెళ్లి చెప్తుంది. చలపతి కూడా డ్యాన్స్ పోటీలు అయిపోయావి కదా ఇంకా ఎందుకు ఉంటుంది అని అంటాడు చలపతి. దానికి సీత తన దగ్గర ఓ ఉపాయం ఉందని చలపతికి చెప్తే రామ్ చెప్తేనే మహా చేస్తుందని చలపతి అంటాడు. రామ్ వస్తే సీత రామ్‌ని తీసుకొని కిందకి వెళ్తుంది. 


విద్యాదేవి టీచర్‌ని రేపు ఇంట్లో నుంచి పంపేస్తారు అంట అని అంటుంది. రామ్ షాకింగ్‌గా నిజమా అని అడుగుతాడు. సీత కూడా రివర్స్‌లో పోటీ అయిపోయిందని అందుకే వెళ్లిపోతారు అని అంటుంది. టీచర్‌ని ఒట్టి చేతిలతో ఎలా పంపిస్తామని అంటుంది. రామ్ డబ్బులు ఇచ్చి పంపిద్దామని అంటాడు. దానికి సీత డబ్బు వద్దు ఆవిడకు ఘనంగా సన్మానించి పంపాలని మహాలక్ష్మీ చెప్పినట్లు రామ్‌కి చెప్పేస్తుంది. రామ్ మంచి నిర్ణయం అని మహాలక్ష్మిని పొగిడేస్తాడు. అందర్నీ తన పిన్ని సమానంగా చూస్తుందని రామ్ అంటాడు. ఇక సీత మహాలక్ష్మినే తన చేతితో సన్మానిస్తుందని చెప్తుంది. అర్చన వాళ్లు సీతని తిట్టుకుంటారు. 


మహాలక్ష్మి: సన్మానం పేరుతో ఆమెను అవమానించి ఆ నింద సీత మీద వేద్దాం.


గిరిధర్: మనల్ని ఇరికించిన సీతని మనం కూడా ఇరికించాలి.


ప్రీతి: అసలు ఆ టీచర్ ఈ ఇంటి వైపు రాకుండా చేయాలి. 


జనార్థన్: అవమానం ఎందుకు ఆ సన్మానం ఏదో చేసి పంపేస్తే ఆవిడ వెళ్లిపోతుంది కదా మహా.


మహాలక్ష్మి: ఆ టీచర్‌కి సన్మానం చేయాలో అవమానం చేయాలో నాకు తెలుసు మీరు నన్ను ఫాలో అవ్వండి చాలు.


సీత మధుకి కాల్ చేస్తే మధు కాల్ కట్ చేస్తుంది. సీత మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది. ఇంతలో జలజ చూసి ఫోన్ వస్తుందని అంటే మధు వేస్ట్ కాల్ అని అంటుంది. జలజ కాల్ లిఫ్ట్ చేసి మధుకి ఇస్తుంది. మధు సీతను తిడుతుంది. నీ చిన్న బుద్ధి చూపించావ్ అని మధు సీతని తిడుతుంది. తాను ఉంటున్న ఇళ్లు నరకం అని నువ్వు పెట్టి పుట్టావ్ అని పుట్టింటిలోనూ అత్తింటిలోనూ నీ మాటే నెగ్గుతుంది అని అంటుంది మధు. నువ్వే నా సమస్య అని సీతతో అంటుంది. నా సంతోషాన్ని నువ్వు తీసుకున్నావ్ అని అంటుంది. ఇంతలో విద్యాదేవి ఫోన్ తీసుకొని సీతతో అలా మాట్లాడటం సరికాదు అంటుంది. మధు విద్యాదేవితో కూడా రూడ్‌గా మారుతుంది. 


విద్యాదేవి: నన్ను మీ మేనత్త అనుకో.


మధు: తప్పంతా మా మేనత్తలోనే ఉంది. ఆ మహా తల్లి వల్లే నా బతుకు ఇలా అయిపోయింది. అప్పుడెప్పుడో ఆవిడగారు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంట. ఆ కోపం మా నాన్న నా మీద చూపిస్తున్నాడు. అయినా మీతో నాకు అనవసరం. సీతతో కలిసి నన్ను గెంటేశారు కదా నాతో మరెప్పడూ మాట్లాడకండి.


మధు ఒకప్పుడు మంచిగా ఉండేది అని మహాలక్ష్మి అత్తయ్య మధుని మార్చేసింది అని చెప్తుంది. ఇక జలజ మధు దగ్గరకు వస్తుంది. సీత మీద జలజ మధుకి లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది. రామ్‌ నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నీకు ఇంకా అవకాశం ఉందని చెప్తుంది.


ప్రీతి, ఉషలు విద్యాదేవి కాలు విరగ్గొట్టాలి అనుకుంటారు. మెట్ల మీద తీగ కట్టి ఆవిడని పిలిచి కిందపడేలా చేసి కాళ్లు విరక్కొట్టాలి అనుకుంటారు. తీగ తెచ్చి కడతారు. తర్వాత ఆమెను పిలుస్తారు. ఇక మెట్ల మీద నుంచి ఉష తల్లి అర్చన రావడంతో ఇద్దరూ టెన్షన్ పడతారు. ఇక అర్చన కరెక్ట్‌గా ఆ తీగ దగ్గరకు వచ్చినప్పుడే మళ్లీ మీదకు వెళ్లిపోతుంది. ఇంతలో విద్యాదేవి బయట నుంచి వస్తుంది. ఇక జనార్థన్ మీద నుంచి వస్తుంటారు. ఉష, ప్రీతిలు కంగారు పడతారు. ఇంతలో జనార్థన్‌కి ఆ తీగ అడ్డంగా తగిలి విద్యాదేవి మీద పడిపోతాడు. అది మహాలక్ష్మితో పాటు మిగతా అందరూ చూసి షాక్ అయిపోతారు. మహా పరుగున వెళ్లి జనార్థన్‌ని పైకి లేపుతుంది. తన మీద ఎందుకు పడ్డావ్ అని మహా జనార్థన్‌ని అడుగుతుంది. కాళ్లకు అడ్డంగా ఏదో తగిలి పడిపోయా అని జనార్థన్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌తో ఫుల్లుగా తాగించేసిన సత్య.. సంధ్యని రాత్రి ఒంటరిగా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టిన కాళీ!