Satyabhama Today Episode : క్రిష్ గదికి వచ్చేసరికి టేబుల్ మీద మందు బాటిల్.. రెండు గ్లాస్‌లు వాటి చుట్టూ పువ్వులతో డిజైన్ చేసి ఉంటుంది. అది చూసిన క్రిష్ అది తన గదేనా వేరే ఎవరి రూమ్‌కి అయినా వచ్చేశానా అనుకుంటాడు. ఇక అక్కడ గీత చూసి ఈ పనికి మాలిని గీత ఉంది అంటే ఇది నా రూమే అనుకుంటాడు. సత్య వస్తే ఆ బాటిల్ తీసుకుంటుందని ముందే తాగేయాలి అనుకుంటాడు. ఇక ఎక్కడి నుంచో మంచి చికెన్ వాసన వస్తుందని అనుకుంటాడు. ఇంతలో సత్య ఇక్కడి నుంచి అని ఎంట్రీ ఇస్తుంది.
సత్య తన ప్లాన్ వర్కౌట్ అయిన వరకు క్రిష్ ఏం మాట్లాడినా మౌనంగా ఉండాలి అని సత్య అనుకుంటుంది. కావాలి అనే ప్రేమగా మాట్లాడుతుంది. క్రిష్ సత్యతో నువ్వు ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావ్ అని అంటాడు. దానికి సత్య తాను మారిపోయా అని నీకు నచ్చినట్లే ఉందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. క్రిష్ అది కలా నిజమా అని సత్యని గిల్లమని అంటాడు. సత్య గట్టిగా గిల్లేస్తుంది.
క్రిష్: సడెన్ గా ఈ ప్రోగ్రాం ఏంటి.
సత్య: ఏం లేదు రాజా..
క్రిష్: ఏమన్నావ్..
సత్య: రాజా అన్నాను. ఎలాగూ మనం ఐదు నెలలే కలిసి ఉంటాం కదా. అందుకే ఈ కొద్ది రోజులు అయినా మంచిగా ఉందామని. ఇక నుంచి ఈ నాలుగు నెలల పాటు మనద్దరం ఫ్రెండ్స్.
క్రిష్: నిజంగానా.. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. క్రిష్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. చేయి వదలకుండా ఊపుతూనే ఉంటాడు.
సత్య ఇక క్రిష్‌కి మందు తాగమని చెప్తుంది. క్రిష్‌కు సత్యనే మందు కలిపి ఇస్తుంది. సత్య క్రిష్‌తో ఫుల్లుగా తాగిస్తుంది. సత్య లోలోపల తిట్టుకుంటుంది. మరోవైపు సంధ్య ఒంటరిగా బస్సు కోసం ఎదురు చూస్తుంటుంది. ఇక బస్సులు, ఆటోలు రాకపోవడంతో బైక్ బుక్ చేస్తుంది. కాళీ అదంతా గమనించి ఆ బైక్ బుకింగ్ వచ్చినట్లు హెల్మట్ పెట్టుకొని సంధ్య దగ్గరకు వస్తాడు. ఓటీపీ చెప్పమని సంధ్యని తన బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. మరోవైపు నిజంగా బైక్ వాడు వచ్చి సంధ్యకు కాల్ చేస్తాడు. సంధ్య మాట్లాడి నిజం తెలుసుకుంటుంది. బండి ఆపమని చెప్తుంది. ఆపకపోతే దూకేస్తా అని హోల్ప్ అని అరుస్తుంది. దీంతో కాళీని చూసి సంధ్య షాక్ అయిపోతుంది. సంధ్య వెళ్లి పోతా అంటే కాళీ చేయి పట్టుకొంటాడు. వదలడు. కాసేపు మాట్లాడటానికి తీసుకెళ్తున్నా అని మనం కాబోయే మొగుడు పెళ్లాలం అని అంటాడు. మీ నాన్న చెప్పలేదా నా కాళ్లు కడుగుతాను అని చెప్పాడని అంటాడు. ఇక సంధ్యకు ముద్దు ఇవ్వమని అడుగుతాడు. సంధ్య కాళీని తోసేసి పారిపోతుంది.
ఇక సత్య మత్తులో ఉన్న క్రిష్‌తో నిజం చెప్పించాలి అనుకుంటుంది. ఇక తనకు డ్యాన్స్ చేయాలి అని ఉందని క్రిష్ చెప్తే సత్య పాట పెడుతుంది. సత్యతో కలిసి క్రిష్ డ్యాన్స్ చేస్తాడు. ఇక సత్య క్రిష్‌ని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. క్రిష్ మెలికలు తిరుగుతాడు. వివరంగా చెప్పమని సత్య అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.