Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి విద్యాదేవిని పని మనిషి మీద పెట్టి తిడుతుంది. అది గమనించిన సీత చెవిలో బ్లూటూత్ పెట్టుకొని మహాలక్ష్మిని తిడుతుంది. ఇంట్లో అందరూ సీత ఫోన్‌లో మాట్లాడుతుందని మహాలక్ష్మితో చెప్తారు. ఇక విద్యాదేవి మహాలక్ష్మిని చూసి నవ్వుతూ పాట పాడుతుంది. మహాలక్ష్మి రగిలిపోతుంది. అర్చనతో మహాలక్ష్మి ముందు విద్యాదేవిని ఇంట్లో నుంచి పంపించి తర్వాత సీత పని పడదామని అంటుంది. ఇక విద్యాదేవి సీతని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది.
విద్యాదేవి: సీత.. మీ ఇద్దరు అత్తలు మాటలతో నన్ను హింసించి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలి అని ప్రయత్నించారు. నువ్వు నీ ఫ్రెండ్ వంక పెట్టుకొని నన్ను కాపాడావు. నీకు అబద్ధం ఆడటం రాదు సీత.. నువ్వు తిట్టింది నీ ఫ్రెండ్‌ని కాదు వాళ్లని అని నాకు తెలుసు. వాళ్లకి అర్థమైపోయింది.
సీత: నేను దొరికిపోయానా టీచర్.
విద్యాదేవి: రామ్‌కి తెలీలేదు. రామ్‌కి తెలిస్తే నిన్ను అసహ్యించుకుంటాడు అని తెలిసి కూడా ఇంత పెద్ద సాహసం చేసి నా గౌరవం కాపాడావు. నాకు ఇంత చేసిన నీకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.
సీత: మీ గౌరవం కాపాడటం నా బాధ్యత టీచర్. మీ లాంటి మంచి అత్తయ్య ఉంటే ప్రపంచంలో ఏ అత్తాకోడళ్లు గొడవపడరు టీచర్.
విద్యాదేవి: మనసులో.. నువ్వు నా కోడలిగా రావడం నా అదృష్టం సీత. నేనే నీ అత్తయ్యని అని చెప్పుకోలేకపోవడం నా దురదృష్టం సీత. సీత నువ్వు రామ్ ఒక్కటి అవ్వాలి. భార్యభర్తలుగా సంపూర్ణంగా కలిసిపోవాలి. ఈ రోజు రాత్రికి మీ ఇద్దరు అత్తయ్యలు మామయ్యలు ఏదో ఫంక్షన్‌కి వెళ్తున్నారని తెలిసింది. ఈ రాత్రి ఉండరు కాబట్టి నువ్వు రామ్ ఒక్కటి అయ్యేందుకు ఇదే మంచి సమయం. నేను చెప్పింది అర్థమైందా.
సీత: కానీ మామ ఆ విషయంలో నా మాట వినరు టీచర్. వాళ్ల పిన్ని మాటే వింటారు.
విద్యాదేవి: మేం చెప్పినట్లు చేస్తే రామ్ మీ మాట వింటాడు. మీరు ఒక్కటి అవుతారు.
సీత: సరే టీచర్.
విద్యాదేవి రాత్రి రామ్‌కి కాల్ చేసి.. మహాలక్ష్మి వాళ్లు ఫంక్షన్‌కి వెళ్తారు అని ప్రీతి ఉషలు కూడా బయటకు వెళ్తారు అని సీత ఒంటరిగా ఉంటుందని ఇంటికి తొందరగా రమ్మని చెప్తుంది. రామ్‌కి ఇన్‌డైరెక్ట్‌గా తొలి రాత్రి గురించి విద్యాదేవి చెప్తుంది. రామ్ ఇంటి బయల్దేరుతాను అని చెప్తాడు. ఇక ఇంట్లో ఉన్న ప్రీతి ఉషలను బయటకు పంపాలి అని విద్యాదేవి వచ్చి ప్రీతి, ఉషల దగ్గరకు వెళ్లి సినిమా టికెట్లు ఇస్తానని వెళ్లమని చెప్తుంది. ఇద్దరూ బయల్దేరుతారు. మరోవైపు రేవతి సీతని మొదటి రాత్రి కోసం రెడీ చేస్తుంది. రామ్‌ని దగ్గర చేసుకోమని సీతకు చెప్తుంది. రేవతి, విద్యాదేవి సీతని ఆటపట్టిస్తారు. రామ్ మల్లెపూలు కొంటాడు. ఇక విద్యాదేవి సడెన్‌గా సినిమాకు పంపిస్తుందని అంటే ఏదో ప్లాన్ చేస్తుందని ప్రీతి, ఉషలు అనుకుంటారు. పైకి వెళ్లి చూడాలి అనుకుంటారు. సీతని అందంగా రెడీ చేసి చేతిలో పాల గ్లాస్ ఉంది ఏమైందా అని చూస్తారు. సీతకి ఫస్ట్ నైట్ అని ప్రీతి, ఉషలకు తెలిసిపోతుంది. విద్యాదేవి ఇంత పెద్ద కుట్ర చేస్తుందని ఆ విషయం మహాలక్ష్మికి చెప్పాలి అని అనుకుంటారు. ప్రీతి, ఉషలు మహాలక్ష్మికి కాల్ చేసి సీత, రామ్‌ల ఫస్ట్‌నైట్ గురించి చెప్తుంది. మహాలక్ష్మిని తొందరగా ఇంటికి రమ్మని మొత్తం చెప్తారు. మహాలక్ష్మి వెంటనే ఇంటికి వెళ్లాలి అని జనార్థన్‌తో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: గాయత్రీదేవి ఆత్మని బంధించిడానికి వచ్చిన గంటలమ్మ, హర్షని చూసి ఆత్మ అని బిత్తరపోయిన తిలోత్తమ!