Seethe Ramudi Katnam Today Episode విక్కీ మాటలకు విద్యాదేవి ఒక్కటి కొట్టి తిడుతుంది. ఇంకొక్క క్షణం ఇంట్లో ఉంటే చంపేస్తాను అని చాకు పట్టుకొని వస్తుంది. విక్కీ భయంతో పారిపోతాడు. విక్కీ వెనకే ప్రీతి వెళ్తాను అంటే విద్యాదేవి ప్రీతిని తిడుతుంది. మహాలక్ష్మి మాత్రం నవ్వుకుంటుంది. అర్చనతో సీన్‌లోకి మనం ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది పద అని తీసుకెళ్తుంది. 


ప్రీతి: నువ్వు ఇలా బెదిరిస్తే నేను భయపడతాను అనుకున్నావా.
విద్యాదేవి: మనిషి అన్నాక భయం, భక్తి ఉండాలి. క్రమశిక్షణ, కట్టుబాట్లు ఉండాలి. నీకు ఇది వరకే చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావ్ అంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. 
మహాలక్ష్మి: ఏం జరిగింది ప్రీతి. ఏం జరిగింది అమ్మ. ఎందుకు ఏడుస్తున్నావ్.
ప్రీతి: చూడు పిన్ని నేను నా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లకూడదు అంట. విక్కీని తిట్టి కొట్టి పంపేసింది. విక్కీ ఎలాంటి వాడో నీకు తెలుసుకదా.
విద్యాదేవి: అలాంటి వాడితో ఫ్రెండ్‌షిప్ ఏంటి. మంచి వాడు ఎవడు మీద చేయి వేయడు. హద్దు మీరిన స్నేహం మంచిది కాదు. అమ్మలాంటి దాన్ని కాబట్టి చెప్తున్నా.
ప్రీతి: నీ లాంటిది నాకు ఎప్పటికీ అమ్మ కాలేదు. నాకు అమ్మ అయినా పిన్ని అయినా అన్నీ పిన్నే. మధ్యలో నీ జోక్యం అనవసరం.
విద్యాదేవి: ప్రీతి మిమల్ని అమ్మ అనుకుంటుంది. తనకు సరైన న్యాయం చేయండి. సరైన దారిలో పెట్టండి. సక్రమంగా పెంచండి.
ప్రీతి: చేశావా పిన్ని తను నీకు కూడా వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నన్ను సరిగా పెంచడం లేదు అంట. 
అర్చన: మనసులో.. సరిగ్గా పెరిగితే నువ్వు ఎందుకు ఇలా తయారవుతావే.. ఆవిడ నీకు మంచే కదా చెప్తుంది. కానీ ఈ మహా మాయ ఏంటో నాకు అర్థం కావడం లేదు.
ప్రీతి: ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు. వెంటనే పంపించేయాలి. 
మహాలక్ష్మి: అయితే నువ్వు ఓ పని చేయాలి. అని చెవిలో ఏదో చెప్తుంది. ప్రీతి మేడ మీదకు వెళ్తుంది. 


మహాలక్ష్మి ఏడుస్తుంది. అందరూ వస్తారు. ఏమైంది అని అడిగితే ప్రీతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్లిందని అంటుంది. జనార్థన్, గిరిధర్‌లు వస్తే విద్యాదేవి విక్కీని తిట్టి కొట్టడంతో ప్రీతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్లిందని చెప్తుంది.  ప్రీతి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి చీర కట్టి బెడ్‌ మీద హాయిగా కూర్చొని చాక్లెట్ తింటుంది. అందరూ ప్రీతి గదికి వెళ్లి డోర్ కొడతారు. విద్యాదేవి కూడా వస్తుంది. అందరూ ప్రీతిని పిలుస్తారు. విద్యాదేవిని తిడతారు.


జనార్థన్: అసలు ప్రీతి జోలికి మీరు ఎందుకు వెళ్లారు. 
విద్యాదేవి: ప్రీతి దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. వాడు ప్రీతితో అసభ్యంగా ప్రవర్తించాడు. 
మహాలక్ష్మి: అది నువ్వు చూశావా. వాడిని తిట్టి కొట్టి అవమానించి వాడిని పంపేశావు. 
అర్చన: ప్రీతికి ఏమైనా అయితే నీదే బాధ్యత. నువ్వే కాపాడు ప్రీతిని. ప్రీతిని చావకుండా బయటకు రప్పించు కారణం.
విద్యాదేవి: ప్రీతి బయటకు రా అమ్మ.
ప్రీతి: నువ్వు నన్ను హర్ట్ చేశావ్ నేను రాను. నాకు బతకాలి అని లేదు నేను చచ్చిపోతా. నువ్వేంటే నేను ఆనందంగా ఉండలేను. మా డాడీ, బాబాయ్ పిన్నిల కంటే ఎక్కువ జోక్యం చేసుకుంటున్నావ్. నీ వల్ల నాకు మనస్శాంతి లేదు. 
విద్యాదేవి: ఇక నుంచి నీ విషయంలో జోక్యం చేసుకోను రామ్మా. ప్లీజ్ ప్రీతి రామ్మా.. కావాలి అంటే నీకు సారీ చెప్తాను.నువ్వు ఏం చేయమంటే అది చేస్తా.
ప్రీతి: అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి. మళ్లీ నాకు కనిపించకూడదు. అప్పుడే నేను బయటకు వస్తాను.
మహాలక్ష్మి: ప్రీతి చెప్పింది విన్నావు కదా నువ్వు మా ఇంటి నుంచి వెళ్లిపోతేనే తను ప్రాణాలతో ఉంటుంది. 
అర్చన: ఇంకా ఈ ఇంట్లోనే ఉండి దాన్ని చంపేస్తావా. వెళ్లిపోయి బతికిస్తావా. 
జనార్థన్: వెంటనే వెళ్లిపోతా అని ప్రీతితో చెప్పండి. తన ప్రాణాలు కాపాడండి.
గిరిధర్: ఈవిడను బతిమాలడం ఏంటి అన్నయ్య మనమే గెంటేద్దాం.
ప్రీతి: ఆ టీచర్ వెళ్లిపోయిందా లేదంటే నన్ను చావమంటారు.
విద్యాదేవి: నేను వెళ్లిపోతాను బయటకు రామ్మా. 


ప్రీతి డోర్ తీసి విద్యాదేవిని పక్కకు తోసేసి మహాలక్ష్మి, జనార్థన్‌లను హగ్ చేసుకుంటుంది. అందరూ విద్యాదేవిని వెళ్లిపోమంటారు. ఇక జనార్థన్‌ కూడా నీ వల్ల నా పిల్లల్ని చంపుకోలేను వెళ్లిపో అంటాడు. అందరూ విద్యాదేవిని అవమానించి ఇంటి నుంచి పొమ్మంటారు. 


రామ్ కారు దగ్గర ఫోన్ మాట్లాడుతుంటే సీత షాపింగ్ చేసి వస్తుంటుంది. కొంత మంది ఆకతాయిలు సీతని కామెంట్స్ చేస్తారు. ఇక సీత రామ్ దగ్గరకు వచ్చి తనని ఎత్తికెళ్లిపోతారని అంటున్నారని చెప్తుంది. రామ్ తింగరిగా మాట్లాడుతాడు. ఇక సీత రామ్‌ని తన బెల్ట్ తీసి కొట్టమని అంటుంది. సీత రామ్‌ని రెచ్చగొట్ట రౌడీలను కొట్టేలా చేస్తుంది. సీత కూడా రౌడీలను పట్టుకొని కొడుతుంది. తర్వాత వాళ్లు పారిపోతారు. సీత రామ్‌ని ముద్దు పెడుతుంది. ఇద్దరూ ఇంటికి బయల్దేరుతారు.  మరోవైపు విద్యాదేవి తన బ్యాగ్ తీసుకొని బయల్దేరుతుంది. కింద అందరూ ఉంటే వస్తుంది.


విద్యాదేవి: నా వంక చూడటం కూడా మీకు ఇష్టం లేదు అని అర్థమైంది. కానీ వెళ్లే ముందు మీకు నాలుగు విషయాలు చెప్పి వెళ్లాలని అనుకుంటున్నాను.
మహాలక్ష్మి: ఇంకా నువ్వు చెప్పేది ఏంటి మేం వినేది ఏంటి. 
విద్యాదేవి: నేను చెప్పాలి అనుకున్నది మీకు కాదు మహాలక్ష్మి గారు. అంటూ జనార్థన్‌ దగ్గరకు వెళ్తుంది. చూడండి ఆడ పిల్ల తల్లితో కంటే తండ్రితో ఎక్కువ కనెక్ట్ అవుతారు. కానీ ప్రీతిని చూస్తే మీతో కనెక్ట్ అయినట్లు నాకు అనిపించడం లేదు. మీరు అసలు ప్రీతిని పట్టించుకుంటున్నారో లేదో తెలీడం లేదు. 
మహాలక్ష్మి: ప్రీతి తల్లిని నేను ప్రీతికి సంబంధించి ప్రతీ విషయం నేను పట్టించుకుంటాను.
విద్యాదేవి: నేను మాట్లాడుతున్నది. ప్రీతి కన్న తండ్రితో. 
అర్చన: మహా ప్రీతికి కన్నతల్లి కంటే ఎక్కువ.
విద్యాదేవి: మీరు కాసేపు కామ్‌గా ఉండండి. నేను చెప్పాలి అనుకున్నది చెప్పి వెళ్లా. తల్లి పిల్లలకు ప్రేమను నేర్పిస్తే తండ్రి బాధ్యత నేర్పించాలి. పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యమే చెల్లించుకోవాలి. ముఖ్యంగా వయసులోకి వస్తున్న ఆడపిల్లకు అదుపు ఆజ్ఞల్లో పెట్టకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్ అవుతుంది. రామ్, ప్రీతిలు మీ మొదటి భార్య పిల్లలని విన్నాను. తన ఫ్రెండ్ అయిన ఈ మహాలక్ష్మి చేతిలో పెట్టి వెళ్లిందని తెలిసింది. సుమతి ఏ నమ్మకంతో పిల్లల్ని ఈ మహాలక్ష్మి చేతిలో పెట్టి వెళ్లిందో ఆ నమ్మకం ఒమ్ము అయినట్లు నాకు అనిపిస్తుంది.మహాలక్ష్మి ఆ బాధ్యతల్ని సరిగ్గా నెరవేర్చడం లేదు అని తెలుస్తుంది. 
మహాలక్ష్మి: విద్యాదేవి ఇది నన్‌ ఆఫ్ యువర్ బిజినెస్. చెప్పిన అబద్ధాలు చాడీలు చాలు. 
విద్యాదేవి: సుమతి ఉంటే ఇలా జరిగేది కాదు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: హాసినికి తిలోత్తమ వింత కానుక.. హారం వేసుకుంటే గాయత్రీదేవే ఆ పాప అని చెప్తేస్తుందా!