Seethe Ramudi Katnam Today Episode శివకృష్ణ వాళ్లు ఇంటికి వచ్చి మధుని చూసి షాక్ అయిపోతారు. ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తారు. మధుకి అత్తింటిలో ప్రాబ్లమ్ అయిందని అందుకే వచ్చిందని రామ్ అంటే.. మీ ఇంటిలో సమస్య ఉంటే అక్కడే చూసుకోవాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని శివకృష్ణ ప్రశ్నిస్తాడు. దానికి మధు ఆడపిల్లకి అత్తింటిలో సమస్య వస్తే పుట్టింటికే కదా వస్తుందని అంటుంది. 


మధు: ఇందుకే నాకు ఈ ఇంటికి రావాలి అంటే చిరాకు వేస్తుంది. నీకు ఇప్పటికైనా అర్థమైందా సీత వీళ్లు నిన్ను ఒకలా నన్ను ఒకలా చూస్తున్నారని. ఈ ఇంటికి మళ్లీ ఎప్పుడు రాకూడదని బాగా అర్థమైంది. ఇంకెప్పుడూ రానులే.. అంటూ వెళ్లిపోతుంది. 
విద్యాదేవి: పాపం ఇంటికి వచ్చిన మధుని పంపేశారు ఏంటి అన్నయ్య.
రామ్: నేను సీత మధు వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడి వస్తాం. ఈలోపు మీరు రెడీ అవ్వండి టీచర్.
లలిత: టీచర్‌ని మీ అంకుల్ సొంత చెల్లి అనుకుంటున్నారు. తన చెల్లి తన దగ్గర లేని లోటు టీచర్ ద్వారా పూడ్చుకోవాలి అనుకుంటున్నారు. 
సీత: టీచర్ గారు మా ఇంట్లో ఉండటం మాకు చాలా అవసరం. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూడండి.
రామ్: అవును అంకుల్ మీ చెల్లి మా ఇంట్లో ఉంటుంది. మా అమ్మని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. రావొచ్చు. 
సూర్య: మధు రావడంతో.. రాత్రంతా ఎక్కడికి వెళ్లావ్.. ఎక్కడున్నావ్.. ఏం చేసి వస్తున్నావ్.
జలజ: అలా చెప్పా పెట్టకుండా వెళ్తే మేం ఏం అనుకోవాలి మధు. 
మధు: నేను ఏం తప్పు చేయడానికి వెళ్లలేదు. ఏదో తప్పు చేసి వెళ్లినట్లు అలా అడుగుతున్నావ్. ఇంట్లో జరిగిన గొడవల వల్ల నా మనసు ఏం బాలేదు. అందుకే సీత వాళ్లు వచ్చారని తెలిసి మా నాన్న వాళ్ల ఇంటికి వెళ్లి రాత్రంతా అక్కడే ఉండి వచ్చా.
జలజ: ఏంటి రామ్ గారు వచ్చారా.
సూర్య: సీత వచ్చిందని వెళ్లావా లేక రామ్ వచ్చాడని వెళ్లావా. మనసు బాలేక వెళ్లిందా. లేదా మనసుకు నచ్చిన వాళ్లు వచ్చారని వెళ్లిందా. ఇక్కడే తేలాలి.
మధు: ఏం తేలాలి నీకు..
సూర్య: కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చేసినా ఎత్తలేదు. అక్కడ అంత బిజీగా ఏం చేసింది.


రామ్, సీతలు రావడంతో సూర్యని తన అన్నయ్య ఇంతటితో ఈ గొడవ ఆపమని అంటాడు. సీత రాగానే సూర్య మనస్శాంతి లేకుండా చేస్తుందని అంటాడు. మధు సూర్యతో మనసు బాలేక పుట్టింటికి వెళ్తే వీధిలో పెట్టి నిలదీస్తున్నావ్ అని అడుగుతుంది. సీత మధుని అలా మాట్లాడకు అక్క అని పక్కకు తీసుకెళ్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని సీతని మధు అడిగితే నీకు బుద్ధి తేవాలని వచ్చానని అంటుంది. 


సీత: నాకు అంతా అర్థమైంది అక్క. నీ లాంటి వాళ్లు ఆ మహా లక్ష్మి లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా నన్ను మామని విడదీయలేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నీ జీవితం. సూర్య బావే నీ భర్త. నువ్వూ ఆ మహాలక్ష్మి తలకిందులుగా తపస్సు చేసినా నా భర్తని నా నుంచి వేరు చేయలేరు. రామ్ మధుని బాగా చూసుకోమని మీ ఇద్దరికి పెళ్లి చేసింది నేనే కదా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటాడు. సీత కూడా తన అక్కని బాగా చూసుకోమని అంటుంది. సీత రామ్‌లు విద్యాదేవిని తీసుకొని బయల్దేరుతారు. మహాలక్ష్మి తన కుడికన్ను అదురు తుందని అంటుంది. చలపతి, రేవతిలు  ఏం అనర్థం జరుగుతుందో అని సెటైర్లు వేస్తారు.  సీత, రామ్‌లు విద్యాదేవిని తీసుకొని లోపలికి వెళ్తారు. మహాలక్ష్మి విద్యాదేవిని చూసి షాక్ అయిపోతుంది. అర్చన మహాతో ఏకంగా పెద్ద ప్రమాదమే వచ్చిందని అంటుంది. 


మహాలక్ష్మి: ఆగు.. మళ్లీ ఎందుకు వచ్చావ్. ఏ ధైర్యంతో వచ్చావ్ ఎవరు రమ్మన్నారు నిన్ను.
సీత: మేమే రమ్మన్నామ్ అత్తయ్య.
మహాలక్ష్మి: రమ్మనడానికి నువ్వు ఎవరు రావడానికి తాను ఎవరు.
సీత: టీచర్ ఇక్కడే ఉండాలి. 
మహాలక్ష్మి: ఎందుకు ఉండాలి.
రామ్: ఉండాలి పిన్ని.
మహాలక్ష్మి: ఏంటి రామ్.. మళ్లీ చెప్పు.
రామ్: విద్యాదేవి అమ్మ ఇక్కడే ఉండాలి పిన్ని. 
మహాలక్ష్మి: నామాటకే ఎదురు చెప్తున్నావ్ రామ్.
రామ్: మీకు అసలు విషయం తెలీదు పిన్ని. ఈ విద్యాదేవి అమ్మ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను. ఆ రోజు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఈ విద్యాదేవి అమ్మే.  ఈ అమ్మ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నాతో ఒక్క మాట చెప్పకుండా వెళ్లిపోయింది. సీత వల్ల ఇప్పుడు నాకు నిజం తెలిసింది. నేను అమ్మకి రుణపడి ఉన్నాను. ఆ రుణం నేను తీర్చుకోవాలి అంటే అమ్మ ఇక్కడ ఉండాలి ఈ విషయంలో నాకు ఎవరు ఎదురు చెప్పకు.
సీత: భలే వాడివి మామ ఇందాక అంటే నిజం తెలీక వెళ్లిపోమన్నారు ఇప్పుడు ఎందుకు అంటారు చెప్పు. అంటూ సీత మహాలక్ష్మిని లాక్ చేసేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read:    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి - సంతాపం ప్రకటించిన సీఎం