Seethe Ramudi Katnam Today Episode  మహాలక్ష్మి ఒంటరిగా బాల్యానీలో కూర్చొని సీత గురించి ఆలోచిస్తుంటుంది. కావాలనే పేపర్‌లో మధుమిత, రామ్‌ల ఫొటో యాడ్ ఇచ్చానని.. ఆ ఫొటో మీ ఊరిలో భూకంపం తెస్తుంది అని అనుకుంటుంది. ఈ విషయంలో తాను అనుకున్నట్లే సీత రియాక్షన్ ఉందని.. మధుమిత రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుంటానని మధుకి కాల్ చేస్తుంది.


మధు: మీరా.. ఈ రోజు పేపర్ చూశారా..
మహాలక్ష్మి: ఆఫీస్ బిజీలో ఉండి మార్నింగ్ చూడలేదు. ఇప్పుడే చూశా.. 
మధు: పేపర్‌లో నా ఫొటో రామ్ గారి ఫొటో పడింది అండీ. మా నాన్న చాలా సీరియస్ అయ్యారు. పెద్ద గొడవ అయింది. మా ఆయన, మా నాన్న చాలా పెద్ద గొడవ చేశారు. సమయానికి సీత ఇక్కడికి రావడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.
మహాలక్ష్మి: సారీ మధుమిత నిజంగా ఆ ఫొటోల గురించి నాకు తెలీదు. రిసెప్షన్‌ దగ్గరకు మీడియా వచ్చింది కదా మీరిద్దరూ పక్కపక్కనే ఉండడంతో మీరే జంట అనుకొని పొరపాటున ఇలా ఫొటోలు పేపర్‌లో వేసేశారు.
మధు: నేను అదే అనుకున్నాను మీకు తెలిసి ఉంటే ఇలాంటి తప్పు జరిగేది కాదు కదా..
మహాలక్ష్మి: జరిగిందేదో జరిగిపోయింది మధు.. కానీ ఒక్క విషయం మధు పేపర్‌లో నిన్ను రామ్‌ని పక్కపక్కన చూసి ఒక్కనిమిషం అది నిజం అయితే ఎంత బాగున్నో అనిపించింది. రామ్ భార్య నువ్వేనేమో.. నా కోడలు నువ్వేనేమో అని ఆ ఒక్క క్షణం ఎంత సంతోషంగా ఉందో.. అంతే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఈ మధుమితను తప్పించి సీతను నా కోడల్ని చేసుకుంటా.. 


రామ్: ఎక్కడికి వెళ్లావ్ సీత.
సీత: మా ఇంటికి వెళ్లాను. రేవతి పిన్నికి చెప్పే వెళ్లాను.
అర్చన: ఈ ఇంటికి పెద్ద రేవతినా.. లేక మహానా.. 
సీత: సడెన్‌గా ఊరు వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో పిన్ని కనిపించింది చెప్పి వెళ్లాను. 
మహాలక్ష్మి: నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావ్.. నీ ఇష్టమొచ్చినట్లు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి వస్తున్నావ్.. 
సీత: నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేదు అత్తయ్య. మా ఇంటికి వెళ్లి వస్తున్నాను. అందరూ మా అక్కే మా ఆయన భార్య అనుకుంటున్నారు. అందరికి నిజం తెలియాలి కదా అందుకే మా ఊరు వెళ్లి మా పెళ్లి ఫొటోలు తీసుకొచ్చాను. ఈ ఫొటోలు చూస్తే చాలా క్లియర్‌గా నేను ఆయన భార్యభర్తలం అని అందరికీ అర్థమవుతుంది. చూడండి.. రేపు ఈ ఫొటోలు పేపర్‌లో వేయిస్తే అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. 
రేవతి: అంటే రేపు మీ ఈ ఫొటోలు పేపర్‌లో వేయిస్తావా సీత.
సీత: అదే అనుకుంటున్నాను పిన్ని. పైగా అత్తయ్య గారిని ఒక మాట అడగాలి కదా.. ఈ ఊరి అందరికీ మేమే భార్యభర్తలం అని తెలిసేలా చేసేయాలి అంటారా..
చలపతి: ఆలస్యం అమృతం విషం అంటారు సీత.. ఆ పని ఏదో తొందరగా చేసేయ్..
రేవతి: అవును సీత మీ పెళ్లి ఫొటోలు వేస్తే మీ అత్తయ్య మామయ్య వద్దు అంటారా ఏంటి.. 
రామ్: వద్దు సీత.. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు.
సీత: మీరు ఎందుకు ఆ మాట అంటున్నారు అండీ.  మన ఫొటోలు వేస్తే ఈ ఇంటి పరువు పోతుంది. ఆ ఫొటోలు చూస్తే అందరూ రామ్ భార్యగా నిన్న ఒకరి ఫొటో ఈరోజు ఒక ఫొటో వేశారు అని మీ ఇద్దర్ని ప్రశ్నిస్తారు. అందుకే ఈ ఫొటోలు నా దగ్గరే దాచుకుంటాను. మా మధ్యకి మరో మనిషిని తీసుకురాలేరు. నా భర్త మీద నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. నా భర్తకు చెందిన ప్రతీది నాకు చెందుతుంది. ఆయన నా సొంతం. ఇది గుర్తు పెట్టుకోండి. 
అర్చన: సీతకి కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు మహా.. ఎందుకు సైలెంట్ అయ్యావ్.
మహాలక్ష్మి: జస్ట్ లీవ్ మీ ఎలోన్.. 
రామ్: ఏయ్ ఏంటి కింద ఏదేదో వాగి వచ్చావ్.. మన ఇద్దర్ని ఎవరూ విడదీయలేరు అని చెప్పావ్. నాతో ఒక్క మాట చెప్పకుండా మీ ఊరు వెళ్లి వచ్చావ్. ఇదేనా మన మధ్య అండర్‌స్టాండింగ్ అంటే.. మా పిన్నిని బ్లాక్ మెయిల్ చేస్తావా.. నీ చేష్టలకు మా పిన్ని ఎంత కంగారు పడిందో తెలుసా.. 
సీత: మామ నేను మా ఊరి వెళ్లింది మన పెళ్లి ఫొటోలు తీసుకొచ్చింది మీ పిన్నిని బయపెట్టడానికి కాదు మామ. పేపర్‌లో పడిన ఫొటో వల్ల అక్కకు చాలా ప్రాబ్లమ్ అయింది. నాన్న అక్కని బాగా తిట్టారు. అక్క ఏడుస్తూ నాకు ఫొన్ చేసింది. ఆ టైంలో అక్క ఏమైనా చేసుకుంటుంది అని వెళ్లాను. ఈ ఫొటో తీరిపోయే సమస్య కాదు. 


ఇక రామ్ సీతని తన పిన్ని గురించి నెగిటివ్‌గా మాట్లాడితే ఊరుకోను అని అంటాడు. మా పిన్నిని చెడ్డడి అని చెప్తే నమ్మని అని అంటాడు. ఇకపై ఎప్పుడూ తనతో చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అని సీరియస్‌గా చెప్పి బయటకు వెళ్లిపోతాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: జగద్ధాత్రి సీరియల్ జనవరి 30th: కౌషికి పరువు తీసేసిన నిషిక.. తెలివిగా ప్లాన్ తిప్పి కొట్టిన ధాత్రి!