Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఈ సంతకం పెట్టడం వలన మాకు వచ్చే వాటా ఎంత, మాకు మిగిలే భూమి ఎంత అని నిలదీస్తుంది నిషిక.
ధాత్రి: ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా, ఇప్పుడు అదంతా అవసరమా అంటుంది. కావాలంటే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నువ్వు ఏం మాట్లాడినా అభ్యంతరం ఉండదు అంటుంది.
నిషిక : నాకు కావాల్సింది నేను అడిగాను ఇచ్చేస్తే సంతకం పెట్టేస్తాను. అయినా మీకు 70%, మాకు 30%. ఇదెక్కడి న్యాయం అని నిలదీస్తుంది.
సుధాకర్: ఇప్పుడు అదంతా మాట్లాడుకునే సమయం కాదు సంతకం పెట్టు నిషిక అని చెప్తాడు.
నిషిక: నాకు పెట్టడం ఇష్టం లేదు మావయ్య కానీ మీరు చెప్పారు కాబట్టి పెడుతున్నాను అంటూ ఫైల్ తీసుకుని సంతకం పెట్టబోతుంటే పెన్ పట్టుకోలేక పోతుంది.
అందరూ ఏం జరిగింది అని అడుగుతారు. పొద్దున వంట చేస్తుంటే కాలిపోయింది. పెన్ పట్టుకోలేకపోతున్నాను రేపటికి తగ్గిపోతుంది రేపు సంతకం పెట్టొచ్చా అని అడుగుతుంది.
వైజయంతి: వాళ్లని రేపు రమ్మనొచ్చు కదా అమ్మి అని కౌషికి కి చెప్తుంది.
కౌషికి : కుదరదు పిన్ని, వాళ్ళు ఈరోజు సైన్ చేయించుకొని రేపు సింగపూర్ వెళ్ళిపోతారు అయినా ఈ అగ్రిమెంట్ అవ్వకపోతే మార్కెట్లో మన కంపెనీ పరువు పోతుంది అంటుంది.
కంపెనీ వాళ్లు మీరు ఇదంతా మాట్లాడుకుని అప్పుడు అగ్రిమెంట్ కి పిలవ వలసింది. మేము ఒక గంట వెయిట్ చేస్తాము ఈలోగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయిన తర్వాత నిషిక ప్రవర్తనని తిట్టుకుంటారు ధాత్రి దంపతులు.
కౌషికి : సుధాకర్ తో మాట్లాడుతూ మన కుటుంబంలో కొత్తగా ఈ ఆస్తులు, వాటాలు ఏంటి బాబాయ్ నిషిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని బాధపడుతుంది.
సుధాకర్: తను అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. మనమే అప్పటివరకు అడ్జస్ట్ అవ్వాలి అంటాడు.
మరోవైపు రూంలో కూర్చొని నిషిక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. చూశారా వదినని ఒక సంతకంతో ఎలా నిలబెట్టేసానో అంటుంది.
అక్కడున్న వాళ్ళు నిషికని తెగ పొగుడుతారు.
నిషిక : నాకు ఇవ్వవలసింది నాకు ఇవ్వకపోతే నేను ప్రతి బిజినెస్ డీలింగ్ కి ఇలాగే చేస్తాను. ఒక్కొక్కటిగా కౌషికి వదిన సామ్రాజ్యం కూలిపోతుంది అంటుంది.
వైజయంతి: అలా అయితే మనకు కూడా డబ్బులు నష్టం వస్తుంది కదా అంటుంది.
నిషిక : అలా ఏం జరగదు, బిజినెస్ డౌన్ అయిపోతుంటే ఇన్వెస్టర్లు చూస్తూ ఊరుకోరు. వదిన మీద ఒత్తిడి తీసుకు వస్తారు. ఈ ఇంట్లో వదిన కన్నా తెలివైన వ్యక్తి ఒకరు ఉన్నారు అని తెలిస్తే వాళ్లే నన్ను అధికారంలో కూర్చోబెడతారు అంటుంది.
నా కోడలికి ఎన్ని తెలివితేటలో అని మురిసిపోతుంది వైజయంతి.
మరోవైపు దిగులుతో కూర్చున్న కౌషికి దగ్గరికి వస్తారు ధాత్రి దంపతులు. మీరు ఇందాక వెళ్లిన వాళ్ళని పిలిపించండి అని చెప్తుంది ధాత్రి.
కౌషికి: నిషిక సంతకం పెట్టలేదు కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ధాత్రి : నేను పెట్టిస్తాను కదా, మీరు భయపడకుండా వాళ్లకు ఫోన్ చేసి రమ్మనండి అని చెప్పటంతో కౌషికి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటుంది.
ధాత్రి : ఇప్పుడు జరగబోయే తమాషా చూద్దురుగాని నాతోపాటు రండి అని చెప్పి హాల్లోకి తీసుకువెళ్తుంది. నిషిక ని పిలిచి నీకు అమెరికా నుంచి పార్సిల్ వచ్చింది బరువుగా ఉంది చూడు అనడంతో నిషిక గబగబా గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న లాఫింగ్ బుద్ధని చూసి షాక్ అవుతుంది.
నిషిక : ఇదేంటి అంత దూరం నుంచి ఈ లాఫింగ్ బుద్ధని పంపించింది అంటుంది.
కౌషికి: నువ్వు చేసే పిచ్చి పనులకి నవ్వుకోవటానికి ఏమో అంటుంది.
నిషిక: నేనేం పిచ్చి పని చేశాను అంటుంది.
ధాత్రి: ఇందాక పెన్ను కూడా పట్టుకోలేని దానివి ఇప్పుడు గబగబా గిఫ్ట్ ఓపెన్ చేసేసావు అనటంతో ఒక్కసారిగా నిషిక తోపాటు అందరూ షాక్ అవుతారు.
కౌషికి : చేసిన రచ్చ చాలు సంతకం పెట్టు అనడంతో తప్పక ఫైల్ మీద సంతకం చేస్తుంది. అప్పుడే వచ్చిన ఇన్వెస్టర్లకు ఆ ఫైల్ ఇచ్చి పంపించేస్తుంది.
మనసులో ధాత్రి వాళ్ళని పొగుడుతుంది కౌషికి.
తర్వాత ఇల్లంతా డెకరేట్ చేసి ఉండడాన్ని గమనిస్తుంది ధాత్రి నిషిక దగ్గరికి వెళ్లి ఇదంతా ఏంటి అని అడుగుతుంది.
నిషిక: నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా నా ఆఫీసులో వాళ్ళకి పార్టీ ఇస్తున్నాను అంటుంది.
ధాత్రి : వదినకి బాలేదు కదా ఇప్పుడు ఇదంతా అవసరమా, అయినా ఇదంతా చేస్తున్నట్లు వదినకి చెప్పావా అని అడుగుతుంది.
నిషిక: నేనెందుకు చెప్పాలి నేను ఏమైనా హాస్టల్లో ఉంటున్నానా ఆవిడ ఏమైనా హాస్టల్ వార్డెనా అంటూ చిరాకు పడుతుంది. ఇంతలో దివ్యాంక వాళ్ళు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది.
ధాత్రి: దివ్యాంకని లోపలికి వెళ్ళనీకుండా ఒక్క నిమిషం ఆగండి అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.