Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో తనని పట్టుకొని ఏడుస్తున్న కూతురితో ఏదో చెప్పాలనుకుంటాడు రామ్మూర్తి.


మంగళ: అది గమనించి తండ్రి కూతుర్లు మాట్లాడుకోకుండా ఉండటం కోసం భర్త దగ్గరికి వెళ్లి దొంగ ఏడుపు ప్రారంభిస్తుంది. భాగీ కి పెళ్లి చేయాలి అని బాధపడేవాడు. అదే ఆయన ఆఖరి కోరిక నన్ను నీతో చెప్పమని చెప్పేవాడు అని ఏడుస్తుంది.


మిస్సమ్మ: అవునా నాన్న.. నా పెళ్లి కోసమే బెంగ పెట్టుకున్నావా అని అంటుంది.


రామ్మూర్తి కూతురితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.


అది గమనించిన మంగళ మరింత డోస్ పెంచాలని నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలి అనేవాడు అని ఏడుస్తుంటే ఆమెకి ధైర్యం చెప్తాడు కాళీ.


మంగళ: రేపు మీ బావ ఇంటికి వచ్చి నా మనసులో మాట నా కూతురికి ఎందుకు చెప్పలేదు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అంటూ నెత్తి నోరు బాదుకుంటుంది.


సిస్టర్ అక్కడికి వచ్చి ఇక్కడ ఎలాంటి గొడవ పెట్టకండి అని చెప్పి అందర్నీ బయటకు పంపించేస్తుంది.


మంగళ: మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి బయటనుంచి సంబంధం తెచ్చే స్తోమత మనకి లేదు, మన కాళీ కి పిచ్చి పెళ్లి చేస్తే మన కళ్ళేదురుగుంటానే  ఉంచుకుందాము అనేవాడు. పంతులుగారు చెప్పిన నాలుగు రోజుల్లో ఇంకా రెండు రోజులు ఇక్కడ ఉంది ఏం చేయడమో ఏంటో అని మిస్సమ్మ దగ్గరికి వచ్చి పెద్దగా ఏడుస్తుంది.


దిక్కుతోచని స్థితిలో మిస్సమ్మ ఏడుస్తూ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ మాటలు విన్న కాళీ ఆనందం పట్టలేక గంతులు వేస్తాడు.


మనోహరి : మంగళ ఫోన్ చేయటంతో ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ న్యూస్ చెప్పడానికే కదా ఫోన్ చేశావు అంటుంది.


మంగళ: అవును భాగి పెళ్ళికి ఒప్పుకుంది అంటుంది రెండు మూడు రోజుల్లో పెళ్లి అంటుంది.


మనోహరి : ఎంత మంచి వార్త చెప్పావు అని ఆనందపడుతుంది.


మంగళ: డబ్బులు సంగతి మరిచి పోవద్దు అంటుంది.


మనోహరి: పెళ్లినాటికి డబ్బులు నీ చేతిలో ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.


అటు మంగళ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు మనోహరీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.


మనోహరి : ఈ విషయం అమర్ కి చెప్పాలి అనుకొని అమర్ దగ్గరికి వచ్చి విషయం చెప్తుంది.


అమర్: రాత్రి ఈ విషయమే చెప్పాలని నా దగ్గరికి వచ్చి ఉంటుంది అంటాడు అమర్.


మనోహరి హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పటంతో అందరూ హాస్పిటల్ కి బయలుదేరుతారు అరుంధతి నేను కూడా వెళ్తాను ఆమెకు ధైర్యం చెప్తాను అనుకొని ఆమె కూడా బయలుదేరుతుంది.


మరోవైపు స్కూల్లో పిల్లలకి రామ్మూర్తికి బాగోలేదు అని తెలుస్తుంది. బాగా ఏడుస్తారు పిల్లలు.


అంజు: మనకి అమ్మ దూరమైపోయింది, తాతయ్య కూడా దూరమైపోతున్నారు అంటుంది.


అమ్ము : అలా అనకు తాతయ్యకి ఏమీ కాదు పదా మనం స్కూల్లో పర్మిషన్ అడిగి చూసి వద్దాము అని చెప్పి పిల్లలు నలుగురు పర్మిషన్ అడగటానికి వెళ్తారు.


మరోవైపు హాస్పిటల్ కి వస్తారు అమర్ వాళ్ళు.


మనోహరి: ఇప్పుడు మిస్సమ్మని ఇరికించేస్తాను నీ మీద ఉన్న నమ్మకాన్ని తుంచేస్తాను అని మిస్సమ్మ  గురించి అనుకుంటుంది. వెంటనే మంగళకి సైగ చేస్తుంది.


మంగళ : అమర్ కి నమస్తే చెప్పి, మీరు చూడటానికి వచ్చింది మా ఆయననే బాబు అంటుంది.


షాక్ అవుతాడు అమర్. కాళీ ని చూసి ఆరోజు మా ఇంటికి వచ్చింది నువ్వే కదా అంటాడు.


అవును అంటుంది మంగళ.


అమర్: మిస్సమ్మ మీకు తెలుసని గాని, మీకు మిస్సమ్మ తెలుసని గాని నాకెందుకు చెప్పలేదు అంటాడు.


మంగళ: నాకు తెలియదు బాబు మీరు తననే అడగండి అని చెప్పి  భాగిని తీసుకురా అని చెప్పి తమ్ముడికి చెప్తుంది.


కాళీ ఐసీయూ లోకి వెళ్లి విషయం చెప్పి  మిస్సమ్మని తీసుకు వస్తాడు. అమర్ ని చూసి  షాక్ అవుతుంది మిస్సమ్మ.


అమర్: వీళ్ళిద్దరూ మీ పిన్ని మావయ్య అని నాకు ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు.


మిస్సమ్మ ఏమీ మాట్లాడకపోవడంతో తప్పు చేసిన వాళ్లే మౌనంగా ఉంటారు ఇది మాట్లాడవలసింది సమయం నిజం చెప్పు అంటాడు. మిస్సమ్మ ఏదో మాట్లాడాలని ప్రయత్నించే లోపు ఆమె ని మాట్లాడనివ్వకుండా వీళ్ళిద్దరూ నీ బంధువులను చెప్పుకోవటానికి నీకు ఎందుకు అంత సిగ్గు అని అడుగుతుంది మనోహరి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.