Seethe Ramudi Katnam Serial Today Episode సీత క్షేమం కోసం విద్యాదేవి అమ్మవారి ఆలయంలో పంతులు చెప్పినట్లు చల్లని నీటిలో తల స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇక నాగు సీత చనిపోయిందని గోయ్యి తీసి పాతేద్దామని అందుకు గొయ్యి తీయమని అంటాడు. ఇంతలో సీతలో కదలికలు వస్తాయి. సీత చావలేదని కొన ఊరితో ఉందని అనుకుంటారు. ఎవరి కోసమో దీని గుండె ఇంకా కొట్టుకుంటుందని నాగు అంటాడు.
సీతని అలా వదిలేసి వెళ్లిపోకూడదని అనుకుంటారు. ఇక ఓ రౌడీ సీత ఫోన్ చూస్తాడు. సీత ఫోన్ అమ్ముకోవాలని అనుకొని ఎవరీకీ తెలీకుండా ఫోన్ నొక్కేస్తాడు. ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. మరోవైపు విద్యాదేవి ప్రదక్షిణలు చేస్తుంటుంది. రామ్ గదిలో సీత గురించి ఆలోస్తూ టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో రామ్‌కి సీత ఫోన్ ఆన్ అయినట్లు మెసేజ్ వస్తుంది. మరోవైపు సీత ఫోన్ ఆన్ అయిందని సిగ్నల్ ట్రేస్ చేసిన పోలీస్ గుర్తు పడతాడు. లొకేషన్ ట్రేస్ చేస్తారు. పోలీసులు అందరూ అలర్ట్ అయిపోతారు. మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. రామ్ కూడా పరుగున వచ్చి సీత సెల్ అన్ అయిందని చెప్తాడు. దాంతో త్రిలోక్ లొకేషన్ ట్రేస్ చేస్తున్నామని చెప్తాడు. సీత ఫోన్ ఓ కన్‌స్ట్రక్షన్ లొకేషన్ చూపిస్తుందని చెప్తారు. త్రిలోక్ ఆ ఏరియా పోలీస్‌కి కాల్ చేసి విషయం చెప్తాడు. ఆయనకు లొకేషన్ పంపిస్తారు. రామ్ ఆ లొకేషన్ తనకు పంపమని తాను వెళ్తానని అంటాడు. దాంతో రామ్‌కి లొకేషన్ షేర్ చేస్తారు. రామ్, చలపతి ఇద్దరూ లొకేషన్‌కి బయల్దేరుతారు. సీత కాసేపట్లో దొరుకుతుందని అందరి పని అయిపోతుందని రేవతి అంటుంది.
మరోవైపు సీతని నాగు సిటీ చివరకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేద్దామని అంటాడు. ఇలా తీసుకెళ్లి దొరికిపోతామని రౌడీలు అంటే దానికి నాగు సీతని ఓ పెద్ద డ్రమ్‌లో పెడదామని అంటాడు. ఇక మరో రౌడీ మళ్లీ ఫోన్ ఆన్ చేయడం నాగు చూస్తాడు. సీత నోటికి ప్లాస్టర్ వేసి డ్రమ్‌లో పెడతారు. డ్రమ్ తీసుకెళ్తుండగా రామ్, చలపతి ఆ లొకేషన్‌కి రావడం నాగు చూస్తాడు. షాక్ అయిపోతాడు. దాంతో డ్రమ్‌ని వదిలేసి వాళ్లు పారిపోతారు. సీత ఉన్న డ్రమ్‌ని మెట్ల మీద నుంచి కిందకి వదిలేయడంతో సీత చీర కొంగు బయటకు వచ్చేస్తుంది. రామ్ సీత నెంబర్కి కాల్ చేసి అటు వైపు పరుగులు తీస్తారు. నాగు వాళ్లు బిల్డింగ్ వర్కర్స్‌లా బస్తాలు చేత పట్టి వెళ్లిపోతారు. రామ్‌కి సీత పోన్ దొరుకుతుంది.
సీత కోసం మొత్తం వెతుకుతారు. ఈ లోపు రామ్ నాగు వాళ్లని చూసి ఆపుతాడు. మీరు ఎవరు అని అడిగితే కూలీలం అని చెప్తారు. రామ్‌కి అనుమానం వచ్చి ముసుగులు తీయమని అంటాడు. దగ్గరకు వెళ్లి ముసుగు తీయబోతే రౌడీలు రామ్ వాళ్లు మీద బస్తాలు విసిరేసి పారిపోతారు. రౌడీల వెంట పోలీసులు పరుగులు తీస్తారు. ఇక సీత ఉన్న డ్రమ్ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రామ్ సీత చెప్పులు చూసి చాలా టెన్షన్తో సీత సీత అని పిలుస్తూ అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.