Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్యని చూడాలని దీప రోడ్డు మీద పరుగులు తీస్తుంది. కార్తీక్ దీపని ఆపి పాపకి తన ఆరోగ్య సమస్య తెలీదని.. నువ్వు తన ముందు ఏడ్చి నిజం తెలిసేలా చేయకు అని అంటాడు. నా వల్ల కాదని దీప అంటే శౌర్య ముందు నువ్వు ఏడిస్తే నా మీద ఒట్టు అని కార్తీక్ తన మీద ఒట్టు వేసుకుంటాడు. దాంతో దీప ఇప్పటికే ప్రాణం లేని శవంలా నిల్చొన్నా మీ మాటలతో నన్ను నిలువునా సమాధి కట్టేయొద్దని దీప ఏడుస్తుంది. దానికి కార్తీక్ నువ్వు ఏడ్వను అని మాటిస్తేనే శౌర్య దగ్గరకు తీసుకెళ్తానని అంటాడు. దీప మాటిచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్లమని చెప్తుంది. కార్తీక్ దీప ఇద్దరూ ఆటోలో హాస్పిటల్‌కి బయల్దేరుతారు.


దశరథ్: నాన్న నీకు కార్తీక్ మీద దీప మీద కోపం ఉండొచ్చు కానీ కాంచన నా రక్తం పంచుకుపుట్టిన చెల్లి నాన్న. శౌర్య అనారోగ్యం నిజమైనా అబద్ధమైనా దానికి దీపే రావాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వచ్చింది కాంచన మనం సాయం చేయాల్సిందే. 
సుమిత్ర: మామయ్య మనం ఈ ఇంటి బిడ్డని బాధ పెట్టడం అంత మంచిది కాదు.
శివనారాయణ: దీప పేరు ఎత్తగానే వాళ్లు వెళ్లిపోవడంతో అర్థమైంది వాళ్ల ఉద్దేశం.
దశరథ్: ఇదే మాట ఎన్ని సార్లు చెప్తావు నాన్న. చెల్లి బాధ అర్థం చేసుకోవా. ఆస్తులు కాదు అనుకున్న మనిషి అప్పు కోసం గుమ్మం తొక్కింది అంటే ఎంత మనసు చంపుకొని వచ్చుంటుందో అర్థం చేసుకోవా. ఇది నేను కోపంతో కాదు బాధతో చెప్తున్నా.
జ్యోత్స్న: మనసులో బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. శౌర్య వ్యాధి నిజమే అంటే అందరూ ఈ వంకతో కలిసిపోతారు. ఎలా అయినా వీళ్లకి అడ్డు పడాలి. 
దశరథ్: ఆ చంటి దాని గురించి అయినా మనం ఆలోచించాలి నాన్న.
జ్యోత్స్న: అవసరం లేదు డాడీ. అత్త చెప్పింది నిజమో కాదో అని దీప దగ్గరకు వెళ్లాను. శౌర్య ఎవరో బావ వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లిందంట కావాలంటే కాల్ చేసి అడగండి. ఇదంతా దీప డబ్బు కోసం ఆడించిన నాటకం.
సుమిత్ర: దీప అలాంటిది కాదు జ్యోత్స్న.
శివనారాయణ: వెళ్లి వచ్చిన కూతుర్ని నమ్ముతావా. మనకు ద్రోహం చేసిన దీపని నమ్ముతావా.
దశరథ్‌: అసలు నువ్వు ఎందుకు దీప దగ్గరకు వెళ్లావు.
జ్యోత్స్న: నిజాలు తెలుసుకోవడానికి డాడీ. ఇక్కడ అత్త, బావ శోకాలు పెడితే అక్కడ దీప తాపీగా పిండి కలుపుకుంటుంది. డబ్బు కోసం ఎందుకు అత్తని బావని పంపావని అడిగితే ఏ ఆస్తి మీద నా భర్తకి అత్తకి హక్కులేదా అని ముఖం మీద తలుపు వేసింది.
శివనారాయణ: నిజం తెలుసుకొని మంచి పని చేశావ్ జ్యోత్స్న. లేదంటే మీ నాన్న దృష్టిలో నన్ను చెడ్డవాడిని చేసేది మీ అమ్మ. 
పారిజాతం: ఇంకా చేయడం ఏంటి ఆల్రెడీ చేసేసింది. రెచ్చగొట్టి పంపడం ఆల్రెడీ చేసేసింది. ఇక పారుతో జ్యోత్స్న ఆట ఇప్పుడే మొదలు పెట్టానని అంటుంది. 


మరోవైపు కావేరి తన నగలు తాకట్టు పెట్టి శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు ఇస్తానని అంటుంది. దానికి శ్రీధర్ తన జీవితం, తన కొడుకు, భార్యల జీవితం ఆ దీప వల్లే నాశనం అయిందని అంటాడు. దీప వల్ల అందరి జీవితం బాగుపడిందని కావేరి అంటుంది. తనకి ఇష్టం లేని వాళ్లకి సాయం చేయను అంటాడు. ఆ ఇంటి నుంచి ఎవరైనా వచ్చి అడిగితే డబ్బు ఇస్తానని అంటాడు. మరోవైపు శౌర్య తల్లిదండ్రుల ఫొటో పట్టుకొని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నాన్న అని బాధపడుతుంటుంది. దీప, కార్తీక్‌లు హాస్పిటల్‌కి వస్తారు. కార్తీక్ దీపని ఏడవొద్దని చెప్తాడు. దీప పాపని పట్టుకొని ఏడుస్తుంది. పాప చూడకుండా కన్నీరు తుడుచుకుంటుంది.


పాప తనకు ఏం తెలీయకపోవడంతో తను మాట్లాడే మాటలకు దీప కార్తీక్ బాధ పడతారు. దీప ఏడుపు ఆపుకుంటుంది. ఒంటరిగా నీకు పడుకోవడం భయం కదా అంటే కాశీ మామయ్య ఉంటాడు. కథలు చెప్తాడని అంటుంది. దాంతో దీప నాకు తప్ప శౌర్య గురించి అందరికీ తెలుసు కదా అని ఏడుస్తుంది. దాంతో పాప నాకేమైంది అని అడుగుతుంది. కార్తీక్ కవర్ చేస్తాడు. కూతురి పరిస్థితికి దీప వెక్కి వెక్కి ఏడుస్తుంది. శౌర్య తల్లితో అమ్మ మన ముగ్గురం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామా అని అంటే కార్తీక్ మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని అంటాడు. దీపని తీసుకొని బయటకు వెళ్తాడు. దీప బయటకు వెళ్లి చాలా ఏడుస్తుంది. శౌర్య గురించి నీకు ఎవరు చెప్పారని కార్తీక అడిగితే జ్యోత్స్న అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!