Seethe Ramudi Katnam Today Episode: సీతని రామ్ ఎత్తుకొని తన గదికి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోపెడతాడు. అయినా సీత ఆ రౌడీలను చంపేస్తానంటూ ఆవేశపడుతుంది. దీంతో రామ్ సీతని బతిమాలుతాడు. ఎవరైనా తనని గట్టిగా పట్టుకొని ఆపితే తప్ప ఆగను అని సీత అంటే రామ్ సీతని హగ్ చేసుకుంటాడు. 


రామ్: ఎవరైనా నిన్ను గట్టిగా పట్టుకుంటే ఆగిపోతాను అన్నావు కదా ఆగిపో.
సీత: అయితే ఇలానే పట్టుకో మామ.
మధుతల్లి: మధు కంగారు పడకు నేను ఒక్కదాన్నే వచ్చా మీ నాన్న రాలేదు.
మధుమిత: ఎందుకు వచ్చావ్ అమ్మా..
మధుతల్లి: ఏం లేదు అమ్మా నువ్వు సూర్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు అని మీ ఇరుగు పొరుగు వాళ్ల వల్ల తెలిసింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో ఇది ఇద్దామని వచ్చా. తీసుకో మధు.
మధు: వద్దు అమ్మా.. ఇది నాన్న డబ్బు నాకు వద్దు. నాన్నకి ఇష్టం లేని ప్రేమ చేసుకున్నా కదా. నేను నాన్న దృష్టిలో చచ్చిపోయాను అమ్మా.
మధుతల్లి: నువ్వు నాన్న కోపాన్ని మాత్రమే చూశావు. ఆయన ప్రేమని చూడలేదే. నీ పెళ్లికి ముందు ఆయన నిన్ను ఎంతలా చూసుకున్నారో నీకు గుర్తుంటుంది. 
మధు:ఆ ఇష్టం ఇప్పుడు నేను చంపేశాను కదా అమ్మా.
మధుతల్లి: నీ పెళ్లి అయినప్పటి నుంచి ఆయన కంటి నిండా నిద్రపోలేదు. కడుపు నిండా తినలేదు. ఆయనకు నువ్వు అంటే ఎంత ఇష్టమో ఇప్పటికైనా తెలిసిందా..
మధు: మరి ఎందుకు అమ్మా నేను కనిపించిన ప్రతీ సారి ఓ శత్రువులా చూస్తున్నారు. 
మధుతల్లి: ఆయన నిన్ను అన్న ప్రతీ మాట ఆయన గుండెలను గుచ్చేస్తోంది. ఆయన కోపం నీకు కనిపిస్తోంది. బాధ కనిపించడం లేదు. ఆయన కనీళ్లు కనిపించవు అంతే.. ఈ డబ్బులు తీసుకో మధు నా ద్వారా నాన్నే ఇచ్చారు అనుకో. ఇలా చాటుగా సాయం చేయడం తప్ప నేను నీకు ఇంకేం చేయలేను. 
సూర్య: మధు చేతి నుంచి డబ్బు తీసుకొని.. మాకు సాయం చేయడానికి మీరు ఎవరు.. మా బంధువులా.. చుట్టాలా.. మధు తనకు ఎవరూ లేరు అనాధ అని చెప్పింది. ఈ కొత్త అమ్మ ఎవరు మధు.. నిన్ను దత్తత తీసుకుందా.. 
మధుతల్లి: ఎందుకు బాబు తనని అలా హింసిస్తున్నావు.
సూర్య: మరి మీరు ఎందుకు మమల్ని కనిపించిన ప్రతీ సారి హింసిస్తున్నారు. మీ ఆయన మమల్ని అవమానిస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు కదా.. మీ సహాయం దయ, దానధర్మాల కోసం ఎవరు ఎదురు చూడటం లేదు. 
మధుతల్లి: మా మీద కోపం చూపడం కాదు నీ భార్యను ఎలా సంతోషంగా చూసుకోవాలో అది ముందు చూడు. 
సూర్య: చూశావా.. అఖరికి ఈమె కూడా నన్ను అవమానిస్తుంది. పెళ్లాన్ని పోషించుకోలేని దద్దమ్మనని గుర్తుచేస్తుంది. అయినా మీ దృష్టిలో తను ఎప్పుడో చనిపోయింది కదా.. ఇప్పుడు ఆకలితో చస్తే ఏంటి ఎలా చస్తే మీకు ఏంటి.. 
మధుతల్లి: భగవంతుడా ఎలాంటి వాడిని మధుకు భర్తగా ఇచ్చావు. అది చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. 


మహా: సీత అంత పని చేసిందా.. 
అర్చన: అవును మహా.. ఈసారి అది మా జోలికి రాకుండా నువ్వే దానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. 
ఉష: సీతకు వార్నింగ్ సరిపోదు పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. 
మహా: రామ్ ఎక్కడ. 
రామ్: వస్తున్నా పిన్ని 


ఫొటో గ్రాఫర్ రిసెప్షన్ ఆల్బమ్ తీసుకొని వస్తాడు. అందరూ తీసి చూడాలి అనుకుంటారు. మహా ఆపి ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చూద్దాం అంటుంది. ఇక ఆల్బమ్‌ను ఉష వాళ్లకు జాగ్రత్తగా ఉంచమని చెప్తుంది. 


అర్చన: అంతగా అల్బమ్‌లో ఏముందు మహా.
మహా: వచ్చాక మీరే చూస్తారుగా.
గిరిధర్: అంటే వదినా సీతకు అల్బమ్‌లో ఏదైనా షాక్ ప్లాన్ చేశావా.  
మహా: ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి ఆఫీస్‌లో ముఖ్యమైన వర్క్ ఉంది. రండి.. 
సీత: అది ఇలా ఇవ్వండి.. అది నా రిసెప్షన్ అల్బమ్.. నేను చూడకూడదా.. 
ఉష: ఈ ఆల్బమ్ నీకు ఇవ్వొద్దని మా పిన్ని మాకు ఆర్డర్ వేసింది. సీత ఎంత లాక్కోవాలి అని చూసినా ఉషా వాళ్లు ఇవ్వకుండా తమ గదిలో పెడతారు. సీత చాటుగా వాళ్లు ఎక్కడ పెడతారో చూస్తుంది. ఉష వాళ్లు బీరువాలో పెట్టి కీ వేస్తారు. తాళం వేసినా సీత పిన్నుతో తీసి ఆల్బమ్ పట్టుకొని తన గదికి వెళ్లిపోతుంది. ఆ ఆల్బమ్‌లో మధుమిత, రామ్‌ కలిసి ఉన్న ఫొటోలు ఉంటాయి. వాటిని చూసి సీత షాక్ అవుతుంది. మామ పక్కన అక్క ఉంది ఏంటిని బాధపడుతుంది. రామ్ పక్కన తాను లేను అని ఏడుస్తుంది.  


మరోవైపు ఆఫీస్‌లో మహాలక్ష్మి, రామ్, అర్చన, గిరిధర్ అందరూ మీటింగ్‌లో పాల్గొంటారు. కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో వేరే టెక్స్‌టైల్స్ కంపెనీ హెడ్ మీటింగ్‌ వస్తారు. ఆయన రామ్‌తో రిసెప్షన్ ఫొటోలు చూశామని మీరు మీ భార్య మధుమిత మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉన్నారని అంటాడు. దానికి రామ్ షాక్ అవుతాడు. మహా అర్చన వాళ్ల వైపు చూసి నవ్వుతుంది. ఇక ఆయన రామ్, మధుమితలను డిన్నర్‌కి పిలుస్తాడు. రామ్ నిజం చెప్పాలని ప్రయత్నించి చెప్పడానికి ప్రయత్నించేలోపు మహాలక్ష్మి అర్చనను పిలిచి ప్రకాశ్‌ కంపెనీని తమ పార్టనర్‌గా ఓకే చెప్తుంది. ఇక రామ్ తన భార్య సీత కదా మధుమిత అని ఎలా అనుకుంటారు అని అడుగుతాడు. దానికి వాళ్ల చిన్నాన్న ఈ సిటీలో చాలా మంది మధుమితే తన భార్య అని అనుకుంటున్నారు అని అంటాడు. ఇక రిసెప్షన్‌లో కూడా సీత పక్కన లేదు అని మధుమితే ఉందని అర్చన అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి 20th: నాగ చంద్రకాంత మొక్కతో మోక్షని బతికించిన మేఘన.. షాక్‌లో ఫణేంద్ర!