Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో అనుమానంగా అటు ఇటు తిరుగుతున్న నీలని చూసి అనుమాన పడుతుంది అరుంధతి. ఈమె ప్రవర్తన చూస్తుంటే ఇదే దొంగతనం చేసి ఉంటుంది అనుకొని ఆమెని ఫాలో అవుతుంది.


నీల : మళ్లీ మనోహరి గదిలోకి వచ్చి బయట ఎవరూ లేరమ్మ అని చెప్తుంది.


మనోహరి: ఎవరు లేరు కదా సరిగ్గా చూసావు కదా అంటూ బీరువాలోంచి డబ్బు తీస్తూ ఉంటుంది.


ఇదంతా అరుంధతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. డబ్బు నువ్వు తీసావా, తప్పు మీద తప్పు చేస్తున్నావ్ మను అని బాధపడుతుంది.


నీల: జాగ్రత్తగా వెళ్ళండమ్మ లేకపోతే మిస్సమ్మ ని బయటికి పంపించేయడం కాదు మిమ్మల్ని బయటకు పంపించేస్తారు అని హెచ్చరిస్తుంది.


మనోహరి డబ్బుతో బయటికి వస్తుంది.


అరుంధతి: ఇంట్లో ఎవరైనా ఉన్నారా త్వరగా రండి మను డబ్బుతో పారిపోతుంది అని అరుస్తుంది. కానీ ఆ మాటలు ఎవరికీ వినిపించవు.


మనోహరి బయటికి వెళ్ళింది కాస్తా కంగారుగా మళ్ళీ తన గదిలోకి వచ్చేస్తుంది.


నీల : కంగారుగా ఏమైంది అని అడుగుతుంది.


మనోహరి: నువ్వే నన్ను వాళ్లకి పట్టించే లాగా ఉన్నావు బయట ఎవరూ లేరని చెప్పావు రాథోడ్ వస్తున్నాడు అని చెప్తుంది. అమర్ కి విషయం తెలిసేలోగా డబ్బు ఎలాగైనా బయటికి దాటించేయాలి అనుకుంటుంది.


ఇదంతా చూస్తున్న అరుంధతి నిన్ను డబ్బులతో బయటకు వెళ్ళనివ్వను ఆ మిస్సమ్మ మీద అపవాదు పడనివ్వను అనుకొని చిత్రగుప్తుడు దగ్గరికి వెళుతుంది.


అదే సమయంలో రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్తాడు.


రాథోడ్: సార్ మిస్సమ్మ ఏడుస్తుంది, తను ఆ డబ్బు తీసి ఉండదు సార్ అందుకు నేను గ్యారెంటీ తను అలాంటిది కాదు అని చెప్తాడు. మళ్లీ మనకి అలాంటి కేర్ టేకర్ దొరకకపోవచ్చు.


అమర్: మరొకరు ఎందుకు మిస్సమ్మ ఉంది కదా అంటాడు.


రాథోడ్: తన పరిస్థితి చూస్తే ఇంట్లో ఉండేలాగా లేదు సార్ అని అంటాడు.


మరోవైపు అమర్ తల్లిదండ్రులు కూడా మిస్సమ్మ గురించి బాధపడతారు.


పిల్లలు కూడా మిస్సమ్మ గురించి బాధపడుతూ ఉంటారు.


అంజు : మిస్సమ్మ ని చూస్తే బాధగా ఉంది.తను ఇలా ఇంట్లోంచి వెళ్లిపోవడానికి వీల్లేదు అంటుంది.


అమ్ము : ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటికి పంపించేద్దామా అని ఎదురు చూశావు అలాంటి నువ్వేనా మిస్సమ్మ ఇంట్లో ఉండాలనుకుంటున్నావా అంటుంది.


అంజు: తను వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇలా అపనిందలతో కాదు మిస్సమ్మని ఎలాగైనా సేవ్ చేయాలి అంటుంది.


మరోవైపు అరుంధతి చిత్రగుప్తుడి దగ్గరికి వెళుతుంది.


అరుంధతి: గుప్తా గారు ఆ డబ్బు మనోహరి తీసింది మిస్సమ్మ ని ఇంట్లోంచి బయటకు పంపించడానికి ఈ ప్లాన్ అంతా వేసింది. ఈ విషయం నేను మిస్సమ్మ కి చెప్తాను అంటుంది.


చిత్రగుప్తుడు: వద్దు ప్రకృతికి ఎదురెళ్లొద్దు ప్రకృతి కోపానికి బలి అవ్వాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. అయినా వినకుండా నిజం చెప్పడం కోసం మిస్సమ్మ దగ్గరికి వెళుతుంది అరుంధతి.


అప్పుడే మిస్సమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోవటానికి సూట్ కేస్ తో సహా బయటికి వస్తుంది. అరుంధతి ఆమె దగ్గరికి వచ్చి నిజం చెప్పాలనుకుంటుంది కానీ నిజం చెప్పే సమయానికి మిస్సమ్మకి కనిపించకుండా, వినిపించకుండా పోతుంది.


అరుంధతి: కంగారుగా చిత్రగుప్తుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెబుతుంది.


చిత్రగుప్తుడు : నిన్ను ముందే హెచ్చరించాను ప్రకృతికి ఎదురు వెళ్లొద్దని. ఎలా రాసి ఉందో అలాగే జరగాలి అలాకాకుండా ప్రకృతికి ఎదురెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మరి ఎప్పుడు ఇలాంటి పని చేయకు అని హెచ్చరిస్తాడు. 


అదే సమయంలో పిల్లలు మిస్సమ్మ దగ్గరికి వెళ్తారు. ఇలా అపనిందలతోనే బయటికి వెళ్ళిపోతావా, ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకుంటావా అని ఆమెని మోటివేట్ చేస్తారు.


మిస్సమ్మ : నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోలేను అంటుంది.


అంజు: నువ్వు తప్పు చేయలేదు అంటే ఇంకెవరో ఆ తప్పు చేసి ఉంటారు. ఆ తప్పు ఎవరు చేశారో నిరూపిస్తే నీ మీద పడిన నింద చెరిగిపోతుంది అంటుంది.


అప్పుడు మిస్సమ్మ ఇప్పుడు నాకేం చేయాలో అర్థమైంది అనుకొని రాథోడ్ కి చెప్పి సిసి ఫుటేజ్ తెప్పిస్తుంది అప్పుడు తను ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు సార్ చూడండి నా రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి కనీసం పర్సు కూడా లేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు రాలేదు బయట వాళ్ళు ఎవరు ఇంట్లో కూడా రాలేదు అని అంటుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.