Seethe Ramudi Katnam Today Episode రామ్ ఆస్తి తన పేరు మీద రాయించుకున్న పేపర్ల చింపేసిని సీత తనకు మహా ప్లాన్ ఎలా తెలిసిందో చెప్తుంది. తాను నిద్రపోయినట్లు నటించాను అని అప్పుడే మరదళ్లు ఇద్దరూ తన దగ్గరకు వచ్చి చూసి ప్లాన్ సక్సెస్ అని అత్తయ్యకి చెప్పడం విన్నానని అంటుంది. అప్పుడే మీ నిద్రమాత్రల ప్లాన్ మహాలక్ష్మి అత్తయ్యదే అని నాకు తెలిసిపోయింది. అప్పుడే అనుకున్నా ఆ ప్లాన్ వెనుక అసలు ప్లాన్ ఏదో ఉంది అని అర్థమైంది అని సీత అంటుంది. 


సీత: నేను నిద్రపోయాను అనుకొని మహా అత్తయ్య, అర్చన అత్తయ్య ఇద్దరూ నన్ను లేపడానికి చాలా ట్రై చేశారు నాకు చాలా నవ్వు వచ్చింది. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఆఫీస్‌లో మీరు చేసిన సీక్రెట్ తెలుసుకున్నాను. మీ అత్యాశను చింపి పోగులు పెట్టాను. నా మామ ఆస్తి మీ పేరు మీద రాసుకోవడం ఒక్కటే మీ కుట్రనా లేక దాని వెనక మరో కుట్ర ఉందా అని తెలుసుకుంటాను. నన్ను మోసం చేయడం అంత ఈజీ కాదు. తర్వాత సీత తన అత్త ఫొటో దగ్గర బాధపడుతుంది. తన భర్త పిన్ని మాయలో ఉన్నాడని మార్చే అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది.
రేవతి: నువ్వు సూపర్ సీత బలే చేశావ్. నువ్వు పిచ్చిదానివి అన్న వాళ్ల వేలుతోనే వాళ్ల కన్ను పొడిచేసి నీ భర్త ఆస్తి కాపాడుకున్నావ్.
చలపతి: అవును సీతమ్మ. ఎంత ధైర్యంతో మహాని మట్టికరిపించావ్. నీ దెబ్బతో వాళ్ల మైండ్ బ్లాంక్‌ అయిపోయింది.
సీత: మీరు రేవతి పిన్ని నాకు ఎంతో సాయం చేశారు. మీరిద్దరి సహకారం వల్లే ఇది చేయగలిగాను.
రేవతి: మేం ఎప్పుడూ నీకు మంచి చేయాలి అని కోరుకుంటాం. నాలా నీ జీవితం  అవ్వకూడదు అనే నీకు సాయం చేస్తున్నా.
చలపతి: నా చేతుల మీద మీ పెళ్లి చేశాను. నా కూతురు అనుకొని నీకు సాయం చేస్తాను. 
సీత: అత్తమ్మ పుట్టిళ్లు ఎక్కడ, తన వాళ్లు ఎవరైనా ఉన్నారా మీకు తెలిస్తే చెప్పండి..
రేవతి: అవి నాకు తెలీవు సీత మా అన్నయ్య నాకు వదిన గురించి ఎప్పుడూ చెప్పలేదు. 


మహాలక్ష్మి: సీత డాక్యుమెంట్లు చింపిన సీన్ గుర్తుచేసుకుంటూ.. మళ్లీ లాయర్‌తో డాక్యుమెంట్లు రెడీ చేయిద్దాం అన్న తన భర్తతో.. వద్దు అలా చేస్తే ఈ సారి రామ్ కచ్చితంగా రీజన్ అడుగుతాడు. ఆల్రెడీ సంతకం పెట్టాను కదా మళ్లీ ఎందుకు అని అడుగుతాడు.
అర్చన: అదీ నిజమే మహా రామ్‌కి సమాధానం చెప్పలేక మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. 
గరిధర్: మరేం చేస్తాం వదినా ఆస్తి ట్రాన్షఫర్ కొన్ని రోజులు ఆపేద్దామా..
మహాలక్ష్మి: కాసేపు ఆ విషయం పక్కన పెట్టండి. నేను ఆలోచిస్తుంది అది కాదు. ఈవినింగ్ రామ్ ఇంటికి వస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి ఎవరో ఒకరు రామ్‌కి చెప్తారు. అప్పుడు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడు. మనకి ఫేవర్‌గా ఉంటాడా లేక ఆ సీతకి సపోర్ట్ చేస్తాడా అన్నది తేల్చుకోవాలి. 
మహాభర్త: కచ్చితంగా మనవైపే ఉంటాడు మహా.
అర్చన: అంటే మహా తన ఆస్తిని తీసుకోవాలి అనుకుంది అని ఆ సీత రామ్‌కి చెప్తే రామ్‌ కచ్చితంగా ఆలోచనలో పడతాడు. 
గిరిధర్: సీతతో పాటు రేవతి చలపతి రామ్‌కి చెప్తే రామ్ మనకి రివర్స్ అవుతాడు. మొదటి సారి మనం రామ్‌, సీతల ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో వదినా.
మహాలక్ష్మి: ఆ పరిస్థితే వస్తే నా తల తీసుకుంటాను తప్ప ఆ సీతకు తల వంచను. మీరు ఒక పనిచేయండి. రామ్ ఇంటికి రాకముందే ఇంట్లో జరిగింది మనకు ఫేవర్‌గా రామ్‌కి చెప్పండి. అప్పుడు రామ్ ఏం చేస్తాడో చూద్దాం. 


మధుమిత మార్కెట్‌కి నుంచి వస్తుంటే తన తల్లిదండ్రులు ఎదురు పడతారు. మధు సంతోషంతో చూస్తే శివకృష్ణ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఎందుకు మాట్లాడటం లేదు అని మధు తన తండ్రిని అడిగితే ఎదురుపడిన ప్రతీవాళ్లతో మాట్లాడే అవసరం లేదు అని శివ మధుతో చెప్తాడు. మధు తనని తిట్టమని చెప్తుంది. కనీసం తిట్టినట్లయినా మాట్లాడండి అని అడుగుతుంది. అయినా పట్టించుకోకుండా శివ వెళ్లిపోతాడు. తన భార్య మధుని చేరదీద్దాం అంటే వద్దు అని వెళ్లిపోతాడు. మధు తన పరువు తీసేసింది అని బాధపడతాను. తనకు తానే శిక్ష వేసుకున్నాను అని అంటాడు. తన మనసు ఇక మారదు అని అంటాడు. మధు తండ్రి మాటలకు ఏడుస్తుంది. మరోవైపు రామ్‌ సీతని ఉదయం జరిగిన గొడవ గురించి తిడతాడు. డాక్యుమెంట్స్ ఎందుకు చింపావని తిట్టి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. నీ ఆస్తిని తన పేరుమీద రాసుకుంది కాబట్టే చింపేశాను అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: పుష్ప 3: 'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే