Seethe Ramudi Katnam Today Episode: సుమతి ఫొటో దగ్గర కేక్ కటింగ్ ఏర్పాట్లు చేస్తుంది సీత. రామ్‌కి కేక్ కట్ చేయమని చెప్పడంతో రామ్ తన తల్లి పుట్టిన రోజును గుర్తుంచుకున్న సీతకే ఆ క్రెడిట్ ఇచ్చి కేక్ కట్ చేయమని చెప్తాడు. దీంతో మహాలక్ష్మి అక్క పుట్టినరోజు నాకు గుర్తింది రామ్ కానీ చెప్తే నువ్వు ఎక్కడ అమ్మని తలచుకొని బాధపడతావో అని గుర్తు చేయలేదు అంటుంది.
చలపతి: అడ్డంగా బుక్ అయ్యా అని చెప్పి భలే కవర్ చేస్తున్నావ్ చెల్లి. సుమతి అక్క నీకు ఎప్పుడు గుర్తుంది.
మహాలక్ష్మి: ప్రతీ ఇయర్ సుమతి అక్క పుట్టినరోజు చేయాలి అనుకుంటాను కానీ
నువ్వు బాధ పడతాను అని చేయడం లేదు రామ్.
సీత: గుర్తు చేసినా ఆయనేం బాధపడరు అత్తయ్య. అమ్మని గుర్తుచేసుకొని బాధ పడటానికి ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా. చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో.
రామ్: అవును నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. కేక్ కట్ చేయ్ సీత.
సీత: నేను కాదు అండీ అత్తమ్మ తర్వాత అంతటి వారు అత్తయ్య కేక్ కట్ చేస్తారు. కేకు కట్ చేసి మీ అబ్బాయికి తినిపించండి అత్తయ్య. మహా కేక్ కట్ చేసి రామ్‌కి తినిపిస్తుంది. తర్వాత సీతకి తినిపించమని రామ్ అంటాడు. ఇక అందరూ కేక్ తినిపించుకుంటారు.
రేవతి: నిజంగా నువ్వు గ్రేట్ సీత. మా పెద్ద వదిన పుట్టినరోజు చేశావ్ అని కాదు. ఎవరైతే నీ చేత కాళ్లు పట్టించుకున్నారో ఆ మహాలక్ష్మినే నిన్ను పొగిడించుకున్నావ్.
చలపతి: నువ్వు సూపర్ సీతమ్మ.
రేవతి: అసలు నీకు వదిన పుట్టిన రోజు ఎలా తెలుసు.
సీత: అత్తమ్మే చెప్పింది.
రేవతి: అదెలా..
శివకృష్ణ ఇంట్లో మధు వచ్చిందని భోజనం ఏర్పాట్లు చేస్తుంది లలిత. ఇంతలో శివ తల్లి గుడికి వెళ్లి వస్తుంది. అందరికీ ప్రసాదం ఇస్తుంది. ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్లావని మధు అడిగితే. మీ అత్తయ్య పేరు మీద అర్చన చేయించడానికి వెళ్లానని చెప్తుంది. అందరూ షాక్ అవడమే కాకుండా శివకృష్ణ కోపంతో ప్రసాదం నేల విసిరి కొడతాడు.
శివకృష్ణ: ఈ ఇంట్లో దాని పేరు తేవొద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మ. ఆ చచ్చినదాని పుట్టిన రోజు అని పిండాకూడు తెచ్చి నాకు ఇస్తావా.
శివతల్లి: సుమతి చనిపోలేదురా ఎక్కడో ఒక చోట బతికే ఉంటుంది.
శివకృష్ణ: అది బతికున్నా నాకు చచ్చినదానితో సమానం.
శివతల్లి: బతికున్న వాళ్లని అలా అనడం నీకు అలవాటా ఏంట్రా అప్పుడు సుమతిని అలాగే అన్నావ్. తర్వాత మధుని అలానే అన్నావ్. ఎందుకురా అలా ఆడపిల్లల ఉసురు తీసుకుంటున్నావ్. సుమతి తప్పు చేసింది అదే తప్పు చేసిన నీ కూతుర్ని తిరిగి తెచ్చుకున్నావ్ కదా. మనసు మార్చుకొని మధుమితతో మాట్లాడుతున్నావ్ కదరా. నువ్వు నీ కూతురు గురించి ఆలోచించినప్పుడు నేను నా కూతురు గురించి ఆలోచించకూడదా..
మధుమిత: మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఆవిడకు పోలిక ఏంటి.
లలిత: సుమతి నీ మేనత్త మధు. నానమ్మ కూతురు. మీ నాన్నకు చెప్పకుండా ఎవర్నో ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆ కోపంతో మీ నాన్న సుమతిని దూరం పెట్టారు. అప్పటి నుంచి మీ నాన్నకు ప్రేమ పెళ్లిళ్లు ఇష్టం లేదు.
శివతల్లి: మీకు ఉన్న మమకారం నాకు ఉండదా.. నేను కన్ను మూసేలోపు నా కన్నకూతుర్ని ఒక్కసారి చూడాలి అని నా ఆశ. ఇప్పటికీ నాకు తెలీదు గానీ దాని ఫొటో నీకు చూపిస్తా ఉండు. మధు ఇదిగోనే ఇదిగో మీ అత్తయ్య. మీ నాన్నకు నువ్వు, సీత పుట్టారు. మీ అత్తయ్యకు మగపిల్లాడు పుట్టుంటే నిన్నో సీతనో ఇచ్చి చేసేవాళ్లం మేనరికం వదులుకునేవాళ్లం కాదే.
శివకృష్ణ: లేచిపోయిన దాని కొడుకుతో నా కూతురు పెళ్లి ఏంటి. దాని పోలికలే దీనికి వచ్చి మానిపోయిన గాయం మళ్లీ రేపింది. దీన్ని క్షమించినా దాన్ని క్షమించను. ఇప్పటికే నా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయిపోయాయి. అవ్వకున్నా దాని ఇంటికి మాత్రం పంపేవాడిని కాదు.
మహాలక్ష్మి: ఓసేయ్ సీత అన్నంత పని చేశావ్ కదే..
సీత: నా మీద కోపంతో రగిలిపోతున్నారా.. మీతో నేను చేసిన ఛాలెంజ్ గుర్తుందా అత్తయ్య. నేను చెప్పింది చెప్పినట్లు చేశాను కదా అత్తయ్య. మా ఆయనే కాదు అందరూ నన్ను పొగిడారు మీతో సహా. మీ మీద గెలిచాను. ఏంటి అత్తయ్య మీరు చెప్పాల్సింది ఏదైనా ఉందా..
మహాలక్ష్మి: అప్పుడే అంతా అయిపోయింది అని అనుకోకు. ముందు ముందు మహాలక్ష్మితో పెట్టుకోలేవు. అసలు ఈ రోజు తన పుట్టిన రోజు అని నీకు ఎవరు చెప్పారే.
సీత: మా అత్తమ్మ చెప్పింది. నా కలలో వచ్చి చెప్పింది. త్వరలోనే అత్తమ్మ గురించి అన్నీ తెలుసుకుంటాను. అత్తమ్మ ఎలా చనిపోయింది. ఆ స్థానంలోకి మీరు ఎలా వచ్చారు అన్నీ తెలుసుకుంటాను.
మహాలక్ష్మి: అందరూ మర్చిపోయిన ఆ సుమతిని ఇది మళ్లీ ఎందుకు గుర్తు చేస్తుంది. ఆ సుమతి గురించి దీనికి ఎవరు చెప్పారు. దాని గురించి నాకే పూర్తిగా తెలీదు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.