Seethe Ramudi Katnam Today Episode ఇంట్లో వాళ్లకి చెప్పకుండా మహాలక్ష్మి బయటకు వెళ్లి సూట్ కేసు తీసుకొని వస్తుంది. అందరూ షాక్ అయి చూస్తారు. మాతో చెప్పుంటే మేం కూడా వచ్చేవాళ్లం అని తన భర్త అంటే ఒక్క పనికి అందరు ఎందుకు అని అంటుంది. దీంతో చలపతి వీళ్లతో కూడా చెప్పకుండా అంట సీక్రెట్‌గా ఎక్కడికో వెళ్లి వచ్చిందంటే ఏదో పెద్ద ప్లానే వేసిందని అనుకుంటాడు. 


మహాలక్ష్మి: రామ్.. రామ్..
రేవతి: ఈ రోజు మహాలక్ష్మి వింతగా ప్రవర్తిస్తుంది ఏంటో..
రామ్: వస్తున్నా పిన్ని.. 
మహాలక్ష్మి: సీతపై నుంచి చూస్తూ ఉంటుంది. ఈ పది లక్షలు నీ దగ్గరే ఉంచు రామ్ రేపు ఆఫీస్‌లో ఒకరికి ఇవ్వాలి. ఇదిగో.. 
రామ్: నా దగ్గర ఎందుకు పిన్ని మీ దగ్గరే ఉంచండి.
మహాలక్ష్మి: ఇది ఆఫీస్ డబ్బు రామ్ నీ దగ్గరే ఉంచు..
రామ్: ఏంటి పిన్ని కొత్తగా నాకు చెప్తున్నారు. అన్నీ మీరే చూసుకుంటారు కదా.. 
మహాలక్ష్మి: ఇప్పటి వరకు అలాగే జరిగింది ఇకనుంచి అన్నీ నీ చేతుల మీదగానే జరుగుతాయి. 
చలపతి: ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..
రేవతి: మహాలక్ష్మి రామ్‌కి డబ్బులు అప్పగిస్తుంది అంటే ఏదో చేయబోతుంది. 
గరిధర్: సంతకాలు పెట్టడం తప్ప రామ్‌కి వేరే పని ఉండకూడదు అని చెప్పారు కదా వదినా.
మహాలక్ష్మి: రామ్‌కి ఒత్తిడి ఉండకూడదు అని అలా చెప్పాను. ఇది వరకు అంటే అంతా మనమే ఉండేవాళ్లం. ఇప్పుడు కొత్తగా కొందరు వచ్చారు. మనం రామ్‌కి ఏదో అన్యాయం చేస్తున్నాం అని ఆరోపిస్తున్నారు. 
చలపతి: సీతని టార్గెట్ చేయడానికి ఇలా ప్లాన్ చేశావా..
మహాలక్ష్మి: నా మీద ఆరోపణలు చేస్తున్నావారికి  నేను సమాధానం చెప్పాలి కదా. అలాంటి వారికి నా మీద ఎలాంటి అనుమానాలు లేకుండా కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు రామ్ చెప్పి రామ్‌కి తెలిసేలా చేద్దాం అనుకుంటున్నా అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా.. 
రామ్: మీరు ఎందుకు ఇలా అంటున్నారో అర్థమైంది పిన్ని. ఇలా చేయాల్సిన అవసరం లేదు. 
మహాలక్ష్మి: నేను ఫెయిర్‌గానే ఉన్నాను రామ్. ఆ విషయం మీ అందరికీ తెలుసు కొత్తగా వచ్చిన వాళ్లకి కూడా తెలియాలి. నిన్న సీత మాట్లాడింది రేపు ఇంకెవరైనా మాట్లాడొచ్చు. ప్రతి సారి నేను సమాధానం చెప్పలేను కదా. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచు రేపు నిన్ను అడిగి తీసుకుంటాను. 
చలపతి: ఈ రోజు ఇచ్చి రేపు తీసుకోవడానికి ఇవ్వడం ఎందుకో.
రేవతి:  మీ పిన్ని నీకు అధికారం ఇచ్చినప్పుడు తీసుకో రామ్. 
రామ్: ప్లీజ్ అత్త.. ఇప్పటికే పిన్ని హర్ట్ అయింది. మీరు మీ మాటలతో ఇంకా హర్ట్ చేయకండి.
మహాలక్ష్మి: నేను చెప్పింది చేయ్ రామ్.. ఇంతకు మించి నన్ను ఏం అడగకు. 
రామ్: సరే పిన్ని. 


శివకృష్ణ, తన భార్య మధు దగ్గరకు బయల్దేరుతారు. ఇక సూర్యని తన అన్న వదినలు జాబ్ గురించి అడిగి ప్రశ్నిస్తారు. ఇక మధు తన తల్లిని చూస్తుంది. మధు అమ్మా అంటూ వెళ్లి ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. 


జలజ: ఎన్నడూ లేనిది ఈవిడ ఇంటికి వచ్చిందేంటి. 
సూర్యఅన్న: సూర్య మీ అత్తగారిని లోపలికి పిలువు.
మధు: నాకోసం వచ్చావా అమ్మ నన్ను చూడటానికే వచ్చావా..
మధుతల్లి: అవును నేనే కాదు మీ నాన్న కూడా వచ్చారు. ఇంట్లోకి రావడానికి మనసు ఒప్పుకోక బయటే ఉన్నారు.
మధు: ఏంటమ్మా నాన్న మా ఇంటికి వచ్చారా. 
మధుతల్లి: అవును అమ్మా నువ్వు అల్లుడు గారు పిలిస్తే ఇంట్లోకి కూడా వస్తారు ఏమో..
మధు: సూర్య మా నాన్న వచ్చారు అంట ఇద్దరం వెళ్లి లోపలికి తీసుకొద్దాం పద. నాన్న ఏంటి నాన్న పరాయి వాళ్ల లాగే బయట నిల్చొన్నారు. రండి నాన్న. ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తారా. ఏవండి మా నాన్నని పిలవండి.
సూర్య: లోపలికి రండి మామయ్య. శివకృష్ణ లోపలికి వస్తాడు. మామయ్య లోపలికి వెళ్దాం పదండి.. 


ఇక సూర్య అన్న సూర్యకు జాబ్ వచ్చిందని చెప్తుంది. సూర్య తన అత్తామామలకు స్వీట్స్ ఇస్తాడు. శివకృష్ణ వాళ్లు తీసుకుంటారు. మధు కాఫీ ఇస్తుంది. ఇక మళ్లీ వస్తాం అని మధు, సూర్యలను తన తల్లి ఇంటికి పిలుస్తుంది. తన భర్త ఏమీ అనరు అని చెప్పి బయల్దేరుతారు. ఇక మధు జలజకు కుంకుమ పెట్టి తన తల్లికి పెట్టి వాయినం ఇస్తుంది. తన తండ్రికి అక్షింతలు ఇచ్చి మధు, సూర్యలు ఆశీర్వాదం తీసుకుంటారు. 


జలజ: వీళ్లు మళ్లీ ఒక్కటిగా కలిశారు అంటే మళ్లీ మహాలక్ష్మి గారి ప్లాన్ వేస్ట్ అవుతుంది. మధు ఆ ఇంటి కోడలు అవ్వదు. నాకు రావాల్సిన నగలు, డబ్బులు రావు. వెంటనే ఈ విషయం మేడంతో చెప్పాలి. 
రామ్: ఏ రోజు నేను నా చేతితో ఆఫీస్ డబ్బు పట్టుకోలేదు. ఫస్ట్ టైం మా పిన్ని నా చేతికి ఇచ్చింది.
సీత: మీ డబ్బు మీరు పట్టుకున్నారు దానికి ఎందుకు పాము పట్టుకున్నట్లు అలా అవుతున్నారు. 
రామ్: ఫీలైంది నేను కాదు మా పిన్ని. మొన్న నువ్వు వేసిన నిందకు మా పిన్ని చాలా ఫీలైంది. అందుకే ఎప్పుడూ లేనిది కొత్తగా నా చేతికి ఈ డబ్బు ఇచ్చింది.  
 సీత: మీ పిన్నిలో సడెన్‌గా ఇంత మార్పు నేను నమ్మలేను. మళ్లీ ఏదో కుట్ర చేయబోతుంది అని అనిపిస్తుంది. 
రామ్: నోటి కొచ్చినట్లు మాట్లాడకు. ఈ డబ్బు నుంచి మనం రూపాయి కూడా టచ్ చేయకూడదు. అని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read:  ఆ సినిమా చూసి ఏడ్చేశాను, ఆ అమ్మాయి ఎవరా అని సెర్చ్ చేశాను - వర్షా బొల్లామా