Seethe Ramudi Katnam Today Episode: సీత చెప్పిన మాటలకు పెళ్లికొడుకు తల్లి కరిగిపోయి పెళ్లికూతురిని తన కోడలిగా ఒప్పుకుంటుంది. దీంతో పెళ్లి కూతురు తల్లి సీతకు కృతజ్ఞతలు చెప్తుంది. ఇందతా చూసిన రామ్ చాలా సంతోషపడతాడు. ఇక పెళ్లికొడుకు తల్లి సీతతో నువ్వు ఏ ఇంటి కోడలివో నీ భర్త ఎవరో కానీ వాళ్లు చాలా అదృష్టవంతులు అని పొగుడుతుంది. ఆ మాటలు విన్న రామ్‌ ఆనందంగా ఇంటికి వెళ్లిపోతాడు.


ప్రీతి: సీతను తీసుకొస్తా అని వెళ్లిన అన్నయ్య ఇంకా రాలేదు ఏంటి. 
గిరిధర్: అసలు సీత పక్కింటికే వెళ్లిందా, లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్లిందా..
చలపతి: ఇందాక అనుకున్నట్లు రామ్ సీత తన భార్య అని పక్కింట్లో చెప్పేశాడేమో. అందరూ రామ్ సీతలను కూర్చొపెట్టుకొని కబుర్లు చెప్పుకుంటున్నారేమో.
మహాలక్ష్మి: ఆపుతావా అన్నయ్య. ప్రీతి, ఉష మీరు వెళ్లి రామ్, సీతలను తీసుకొని రండి..ఇంతలో రామ్ ఒక్కడే రావడం అందరూ చూస్తారు. 
రామ్‌తండ్రి: ఆగు రామ్ నువ్వు ఒక్కడివే వచ్చావేంటి సీత ఎక్కడ. 
ప్రీతి: సీత రాను అందా అన్నయ్య అక్కడ ఏదైనా గొడవ చేసిందా..
మహాలక్ష్మి: అక్కడ ఏం జరిగింది రామ్. ఆ ఇంట్లో సీత మన పరువు పోయిన పని ఏమైనా చేసిందా.. చెప్పు రామ్.. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఆ పెళ్లి సంబంధం చెడిపోయినట్లు చేసింది కదూ.. నువ్వు చెప్పినా ఆగలేదు కదూ.. 
రామ్: ఒక మంచి అమ్మాయి భార్యగా దొరకడం మగాడి అదృష్టం డాడ్. అలాంటి అమ్మాయి ఏ ఇంట్లో అడుగుపెడుతుందో ఆ ఇల్లు ఆనంద నిలయం. అసలు భార్య అంటేనే గొప్పది. అర్చన పిన్ని లేకపోతే మీరు లేరు. పిన్ని లేకపోతే మీరు లేరు డాడ్. అసలు ఆడవాళ్లు లేకపోతే మగవారే లేరు. భార్యని భర్త గొప్పగా చూడాలి. 
గిరిధర్: ఏమైందిరా నీకు మేం ఏం మాట్లాడుతున్నాం? నువ్వేం మాట్లాడుతున్నావ్?
చలపతి: రామ్ పక్కింట్లో ఏదో చూసినట్లున్నాడు.
రామ్: లక్ష్మీ విష్ణువు కట్నం.. సీతే రాముడి కట్నం.. భార్యే భర్తకు అన్నీ.. కోడలే కుటుంబానికి అన్నీ.. అంటూ వెళ్లిపోతాడు. 
మహాలక్ష్మి: రామ్‌ సీత గురించి అడిగితే ఏదేదో చెప్పి వెళ్లిపోతున్నావ్ ఏంటి ఏమైంది నీకు..
గిరిధర్: రామ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. పక్కింట్లో ఏం జరిగింది. 
రేవతి: మీరు ఊహించనిది ఏదో జరిగినట్లు ఉంది. సీత ఏదో అద్భుతం జరిగింది. 
మహాలక్ష్మి:  ఎక్కడ ఎక్కడ ఆ సీత.. పక్కింట్లో ఏం చేసి వస్తున్నావ్..
సీత: పెళ్లి చూపులు జరుగుతుంటే వెళ్లి వస్తున్నా.. నా వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇందాక మీ అబ్బాయి అలా ఎందుకు మాట్లాడారో మీకు తెలీదు కదా.. నా కోసం మీరు ఆయన్ను పక్కింటికి పంపించారు అని నాకు అర్థమైంది. నేనేంటో పక్కింట్లో నన్ను చూశాక ఆయనకు అర్థమైంది. మీకు కూడా అర్థంకావాలి అంటే సైలెంట్‌గా ఉంటూ నేను చేసే పనులు చూస్తూ ఉండండి. అర్థమైందా అత్తయ్య గారు.
గిరిధర్: అర్థమైనట్లు కానట్లు మాట్లాడి వెళ్లిపోయింది ఏంటి. అసలు పక్కింట్లో ఏం జరిగింది.
మహాలక్ష్మి:  ఇది అక్కడ ఏదో మాయ చేసి వచ్చినట్లు ఉంది. అందుకే రామ్ కూడా ట్రాన్స్ లోకి వెళ్లాడు. 


సీత: భార్య గురించి మీ పిన్నికి భలే గొప్పగా చెప్పావు మామ. 
రామ్: నేను చెప్పానా.. 
సీత: ఆ మాటలు నీ మనసు నుంచి వచ్చాయా లేక ఎవరైనా మాట్లాడుతుంటే విని అన్నావా.. 
రామ్: నేను ఎవరి దగ్గర వినలేదు. అలా అనిపించి చెప్పాను..
సీత: అబద్ధం చెప్పకు మామ నువ్వు ఇందాక అన్న మాటలు అన్నీ నేను పక్కింట్లో అన్న మాటలు. నాకోసం అక్కడికి వచ్చిన నువ్వు ఆ మాటలు విన్నావని నాకు అర్థమైంది. 
రామ్: నిన్ను కాఫీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు.  
సీత: నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావ్ మామ కానీ మీ పిన్నికి బయపడి బయటపడటం లేదు.
రామ్: అదిగో మళ్లీ మా పిన్ని టాపిక్ మాట్లాడకు. మధ్యలో మా పిన్ని ఏం చేసింది. మా పిన్నితో గొడవలు పడుతుంది నువ్వు. మా పిన్ని ఏం చేసినా మంచే చేస్తుంది. నాకు పని ఉంది నేను వెళ్లాలి.
సీత: మామ తప్పించుకుంటున్నావ్ కదా.. ఏదో ఒక రోజు నా మంచి తనం గురించి నువ్వే మీ పిన్నికి చెప్పేలా చేస్తా.


రామ్ మాటలను మహాలక్ష్మి తలచుకొని రగిలిపోతుంది. ఇక మహా గ్యాంగ్ సీత గురించి తలా ఓ మాట అంటారు. ఇంతలో సీత అక్కడికి వస్తుంది. తనకు తన భర్త అంటే ప్రేమ అని తన మామ తనంటే ప్రేమ అని ఒకరికి ఒకరం ఐలవ్యూ చెప్పుకుంటామని సీత అంటుంది. ఈ ఇంట్లో అలాంటివి కుదరదు అని మహాలక్ష్మి అంటే రామ్‌ని తీసుకొని బయటకు వెళ్తాను అని సీత ఛాలెంజ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 14th: సుమనకు బుద్ధి చెప్పేందుకు ఉలూచిలా మారిన విశాలాక్షి.. ఆఫీస్‌కు తీసుకొచ్చిన విక్రాంత్‌!