Seethe Ramudi Katnam Serial Today Episode సీత వ్యాన్‌లో చీరలు అమ్మడానికి మహాలక్ష్మీ, అర్చనలు వస్తారు. రోడ్డు మీద చీరలు అమ్మతున్నారు పర్మిషన్ లేదని పోలీసులు వచ్చి మహాలక్ష్మీతో చెప్తారు. నేను ఎవరో తెలీదా అని తిట్టి వాళ్లని మహాలక్ష్మీ పంపేస్తుంది. ఇక ఆ లేడీ కానిస్టేబుల్స్ త్రిలోక్‌కి విషయం చెప్తారు. దాంతో త్రిలోక్ అది సీత అయ్యుంటుందని అనుకొని వాళ్లని చితక్కొట్టమని కానిస్టేబుల్స్‌తో చెప్తారు. దాంతో వాళ్లు వెళ్లి మహాలక్ష్మీని చితక్కొడతారు. 


త్రిలోక్ వచ్చి మహాలక్ష్మీని చూసి షాక్ అయిపోతాడు. మీరేంటి చీప్ రోడ్డు మీద చీరలు అమ్ముతున్నారని అంటాడు. సీతతో ఛాలెంజ్ చేయి ఇలా రోడ్డున పడ్డానని అంటుంది మహాలక్ష్మీ. ఇక మహాలక్ష్మీ అర్చనతో నన్ను వాళ్లు కొడుతుంటే నువ్వేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. భయంతో దాక్కున్నానని అర్చన అని చీరల బోనీ కాలేదు కాని దెబ్బలు తగిలాయని అంటుంది.  మరోవైపు సీత మీటింగ్ పెడుతుంది. కంపెనీ పెండింగ్ విషయాలు చెప్పమని అంటుంది. మహాలక్ష్మీ మేనేజర్‌కి చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని ఉక్కిరిబిక్కిరి అయినట్లు చాలా పనులు చెప్తాడు. సీత పని అయిపోయిందని రామ్ అనుకుంటాడు. ఇక సీత కంపెనీకి సంబంధించిన డిటైల్స్ అరగంటలో ఇవ్వమని అంటుంది. రామ్, మేనేజర్‌కి ఆ పని చెప్తుంది. కష్టమని ఇద్దరూ అంటే రిజైన్ చేసి వెళ్లిపోండి అంటుంది. అందరినీ వెళ్లిపోమని రామ్‌ని కూడా మిస్టర్ రామ్ మీరు వెళ్లిపోండి అంటుంది. ఇక మహాలక్ష్మీ వ్యాన్‌ దగ్గర చీరలు వేసుకొని కుర్చీలో కూర్చొంటే అర్చన గొడుగు పట్టుకొని నిల్చొంటుంది. ఒక్కరు కూడా చీరలు కొనడానికి రాకపోవడంతో అర్చన సీతలా పిలిస్తే వస్తారని చెప్తుంది.



మహాలక్ష్మీ అలా కుదరదని తన స్టైల్‌లో ఎక్స్కూజ్ మీ చీరలు తీసుకోండి అంటే దానికి వాళ్లు మేం చీప్‌గా ఇక్కడ కొనమని వెళ్లిపోతారు. ఇక మ్యానేజర్ మహాలక్ష్మీకి కాల్ చేసి సీత అందరికి చుక్కలు చూపిస్తుందని అంటాడు. సీత కంటే ముందే మేం పారిపోయేలా ఉన్నామని అంటాడు. మహాలక్ష్మీకి అన్ని తెలివి తేటలు ఎక్కడివి అని మహాలక్ష్మీ అనుకుంటుంది. ఇక సీత తర్వాత తన క్యాబిన్‌లో కూర్చొని విద్యాదేవితో మాట్లాడుతుంది. మేనేజర్ చెప్పినవి మీరు వినేలా చేసి మీరు నాకు చెప్పినవే తిరిగి చెప్పాను  అని థ్యాంక్స్ చెప్తుంది. ఇక సుశీల సాయం వల్లే ఇలా జైలులో ఫోన్, ల్యాప్‌టాప్ వాడే అవకాశం దొరికిందని విద్యాదేవి ఆమెకు థ్యాంక్స్ చెప్తుంది.


మహాలక్ష్మీ వాళ్లు చీరలు అమ్మలేక ఇంటికి బయల్దేరుతారు. ఇక సీత లాయర్‌కి కాల్ చేసి విద్యాదేవిని విడిపించే ప్రయత్నాలు చేయమని అంటుంది. లాయర్ ఏం దారి లేదని చేతులెత్తేస్తాడు. కేసు పెట్టిన వాళ్ల వల్లే ఏమైనా సాధ్యమవుతుందని వాళ్లు తలచుకుంటేనే బెయిల్ అయినా వస్తుందని అంటాడు. రామ్ ఇంట్లో అందరికీ సీత హంగామా గురించి చెప్తాడు. ఇంతలో మహాలక్ష్మీ వాళ్లు ఇంటికి వస్తారు. ఇక మహాలక్ష్మీ మొదటి రోజు లక్ష రూపాయలు సంపాదించామని చాలా చీరలు అమ్మామని చెప్తుంది. అర్చన కూడా మేమే అమ్మేశామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అయ్యే సీన్ ఇదే.. మిస్ ఇండియా అంటూ ఫ్లర్ట్ చేసిన రాకేశ్!