Seethe Ramudi Katnam Serial Today Episode జనార్థన్ తన పక్కన వ్రతంలో విద్యాదేవి అలియాస్ సుమతే కూర్చొంటుంది ఎవరూ ఈ విషయంలో మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తాడు. జనార్థన్, విద్యాదేవి, రామ్, సీతలు వ్రతంలో కూర్చొంటారు. జనార్థన్ ఇలా ఎందుకు చేశాడని మహాలక్ష్మీ చాలా ఫీలవుతుంది. రెండు జంటలు వ్రతం చేస్తుంటే జనార్థన్ సైట్ కోసం విద్యాదేవితో సంతకాలు పెట్టించిన రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇద్దరు అధికారులు వస్తారు. వాళ్లతో రేవతి అన్నావదిన వాళ్ల కొడుకు కోడలు వ్రతం చేసుకుంటున్నామ్ అని అంటారు.
సైట్ కోసం సుమతితో సంతకాలు పెట్టించారు ఈమె ఫేక్ లేడీ అని కంప్లైంట్ రావడంతో తనిఖీకి వచ్చామని ఈ వ్రతం చూశాక మీరే భార్యభర్తలు అని నమ్ముతున్నాం అని చెప్పి వెళ్లిపోతారు. ఇక జనార్థన్ వ్రతానికి ముందు ఒకరు ఫోన్ చేసి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వస్తున్నారని చెప్పారని అందుకే ఈ టీచర్‌తో వ్రతం చేశానని చెప్తాడు. నీకు ఎవరు ఫోన్ చేసింది ఎవరు తను సుమతి కాదని రిజిస్టర్ ఆఫీస్‌లో చెప్పింది ఎవరు అని మహాలక్ష్మీ అడుతుంది. దానికి చలపతి ఎవరో చెప్పుంటారులే చెల్లి అని అంటాడు.
గిరిధర్: ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్ చేసుంటారు. అన్నయ్య పక్కన ఈ విద్యాదేవిని కూర్చొపెట్టాలని ఇలా చేసుకుంటారు.
రామ్: ప్లానో ఇంకోటో నాన్న అయితే ప్రాబ్లమ్ నుంచి బయట పడ్డారు కదా.
ప్రీతి: నాన్న ప్రాబ్లమ్‌లో ఉండి వ్రతంలో కూర్చొమంటే ఈవిడ ఎలా కూర్చొంది అన్నయ్యా.
మహాలక్ష్మీ: ఆవిడ తనే సుమతి అని చెప్పుకుంటుంది కదా అవకాశం వచ్చిందని ఇలా కూర్చొంది.
గిరిధర్: ఎప్పుడెప్పుడు అన్నయ్యకి భార్యని అవ్వాలా అని ఆశపడుతుంది.
జనార్థన్: విద్యాదేవి గారి తప్పు ఏం లేదు ఆవిడ వ్రతంలో కూర్చొనని అన్నారు నేనే బతిమాలి కూర్చొమన్నా.
మహాలక్ష్మీ: ఈ మధ్య ఈవిడకు నీ సపోర్ట్ ఏంటి జనా ఆవిడ ఎంత ప్రమాదమో నీకు తెలీదా.
గిరిధర్: దీన్ని అలుసుగా తీసుకొని ఆవిడే సుమతి అని క్లైమ్ చేస్తే ఏం చేస్తారు అన్నయ్య భార్యగా అంగీకరిస్తారా.
అర్చన: ఆవిడ అలా చేసినా చేస్తుంది ఆస్తి కోసం ఎందరు ఎన్ని చేయడం లేదు.
విద్యాదేవి: నేను వ్రతంలో కూర్చొంది ఆస్తి కోసమే ఇంకా దేనికోసమే కాదు జనార్థన్ గారు అరెస్ట్ అవ్వకూడదని కూర్చొన్నా. ఇందులో నాకు కొత్తగా కలిసి వచ్చిందేమీ లేదు. మీ కుటుంబానికే వందల కోట్ల ఆస్తి కలిసొచ్చింది. అది నా బాధ్యత అని చేశాను.
సీత: ఎంతైనా మీరు సూపర్ అత్తమ్మా.
మహాలక్ష్మీ: ఆ రోజు జనా అనవసరంగా ఈవిడను సుమతి అని రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లాడు అందుకే ఈ ప్రాబ్లమ్ వచ్చింది.
జనార్థన్: దాని వల్ల మనకే కలిసొచ్చింది కదా మహా. మన ఆస్తి పోలేదు పరువు పోలేదు.
మహాలక్ష్మీ: కానీ నా పరువు పోయింది జనా నీతో వ్రతం చేసుకోవాలి అనుకున్న నా ఆశ పోయింది. అందరి ముందు నాకు అవమానం మిగిలింది. అని వెళ్లిపోతుంది.
సీత మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి నా ప్లాన్ అదిరిపోయింది కదా అని అంటుంది. మీరు నెంబరు 2 అని మీకు ఆ విషయం గుర్తు చేయడానికే ఇలా చేశానని అంటుంది. విద్యాదేవి సుమతి అని నిరూపించకుండా చేస్తానని మహాలక్ష్మీ అంటే నిరూపిస్తా అని సీత అంటుంది. ఇంతలో రామ్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడితే మీ పిన్నిని ఓదార్చుతున్నానని సీత అంటుంది. ఇక రామ్ సీతతో నీకు సర్‌ఫ్రైజ్ ఇస్తా అన్నా కదా అందరి ముందు ఇస్తా పూజ దగ్గరకు రా అని పిలుస్తాడు. రామ్ సీతకి అందరి ముందు ఓ చీరని సీతకి గిఫ్ట్‌గా ఇస్తాడు. సీత చాలా సంతోషిస్తుంది. చలపతి జనార్థన్ బావ కూడా విద్యాదేవి టీచర్‌కి ఇస్తే బాగున్ను అని అంటాడు. దానికి మహాలక్ష్మీ చలపతిని తిడుతుంది. రామ్ సీతకి దేవుడి బొట్టు పెట్టి సీతకి చీర ఇస్తాడు. అయితే ఆ చీర దేవుడి ముందు ఉన్న దీపానికి అతుక్కొని కాలిపోతుంది. అందరూ చాలా బాధ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.