Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇంటి మీద లోన్ తీసుకుంటున్నాడని తెలిసి శివనారాయణ, జ్యోత్స్న అక్కడికి వస్తారు. శివనారాయణ కార్తీక్‌తో నీ భార్య దీప పేరు మీద రెస్టారెంట్ పెట్టడానికి తాను ఏం తాకట్టు పెట్టి నీకు డబ్బు ఇచ్చిందని అడుగుతాడు. దానికి కార్తీక్ నా ఇళ్లు తాకట్టు పెట్టి రెస్టారెంట్ పెడతానని చెప్తాడు. 


శివనారాయణ: నీ ఇళ్లా నీ కష్టంతో కట్టావా లేక నీ భార్య కష్టంతో కట్టావా.
కార్తీక్: ఇది మా అమ్మ ఇళ్లు.
శివనారాయణ: మీ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందిరా. మీ తాత శివనారాయణ తన యవ్వనాన్ని జీవితాన్ని ధారపోసి రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన ఆస్తులురా ఇవి. నువ్వు ఎవరో ఇంటి పేరు కూడా తెలీని అనాముఖురాలిని పెళ్లి చేసుకొని నాకు పోటీగా ఆమెను నిలబెట్టడానికి నా కష్టార్జితాన్ని వాడుకుంటాను అనగానే చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రి వెంగలయ్యని కాదురా. ఇదంతా వీడు వీడి బాబు సంపాదించిన సొంత ఆస్తి అయినట్లు నా ముందు ఎందుకు తల ఎగరేయడం. నన్నే కాదనుకున్నప్పుడు నా ఆస్తులపై నీ పెత్తనం ఏంటి. అంటే తాత వద్దు కానీ తేరగా అనుభవించడానికి తాత ఆస్తులు కావాలి. నీకు అంత పౌరుషమే ఉంటే నువ్వు నా మీద గెలవాలి అనుకుంటే నాదీ అనేది ఏదీ నువ్వు ముట్టుకోకుండా గెలిచి చూపించరా. ఇప్పటికైనా అర్థమైందా ఈ తాత పేరు చెప్పకపోతే మీకు బతుకు లేదని. 
కార్తీక్: తాత చేతిలో పేపర్ తీసుకొచి చింపేసి ఇది నువ్వు సంపాదించిన ఆస్తి కదా ఇది నాకు వద్దు. 
శివనారాయణ: పేపర్లు చింపే అంత ఈజీ కాదురా వద్దు అనుకోవడం. ఆ మాటకి వస్తే మీరు వాడే కార్లు, బంగ్లాలు, మీ వంటి మీద బంగారం, బట్టలు, చివరికి మీరు వాడే ఫర్నీచర్, డోర్ కర్టెన్లు  అన్నీ అన్నీ నేను కొనిచ్చినవే. నా డబ్బుతో కొన్నవే. వద్దు అనుకుంటున్నాడు కదా ఎన్ని వదులుకుంటావో చూస్తా.
కార్తీక్: వదులు కుంటా అన్నీ వదులు కుంటా ఈ రోజు తారీఖు గుర్తు పెట్టుకో తాత సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో రెస్టారెంట్ పెట్టి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే అలా అడుగు.
శివనారాయణ: ఎవరిని చూసిరా నీకు ఈ పొగరు.
కార్తీక్: నా భార్యని చూసి. నువ్వు ఇచ్చే నీడ నాకు వద్దు. ఎవరో సంపాదించింది నాకు ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. మిస్టర్ శివనారాయణ గారు నేను ఈ క్షణమే నా కుటుంబాన్ని తీసుకొని ఈ ఇళ్లు వదిలిపోతున్నా కట్టు బట్టలతో. 


దశరథ్, సుమిత్ర, పారిజాతం అక్కడేం జరుగుతుందో అని కంగారు పడతారు. సుమిత్ర అక్కడికి వెళ్దామని ఏడుస్తుంది. దాంతో దశరథ్ నేనే వెళ్తానని అంటాడు. ఇక దీప కార్తీక్‌ని నచ్చచెప్పబోతుంది. శివనారాయణని దీప ఎదురిస్తుంది. మీ అల్లుడు తప్పు చేస్తే కూతుర్ని వదిలేశాను అండగా ఉండాల్సింది పోయి ఇలా చేస్తారా అని అడుగుతుంది. మా తాతకు అడిగే అంత సీన్ నీకు లేదని జ్యోత్స్న అంటుంది. నాకు సమాధానం చెప్పు అని కాంచన అడిగితే దానికి శివనారాయణ తండ్రిని మోసం చేసిన కూతురివి నువ్వు అని అంటాడు. ఇక జ్యోత్స్న అత్త బావ ఈ దీపని పెళ్లి చేసుకుంటే నా మేనకోడలి పరిస్థితి ఏంటి అని అడిగావా అని నిలదీస్తుంది.


కాంచన నోరెత్తకుండా ఏడుస్తుంది. మీ తాతకి భయపడను అని కార్తీక్ అంటే బరితెగించి మాట్లాడుతావని అంటాడు. దానికి కాంచన నన్ను అంటే సరే కానీ నా కొడుకుని ఏమైనా అంటే తండ్రివనీ చూడనని అంటుంది. శివనారాయణ షాక్ అయిపోతాడు. నాకు ఏం చేయాలో తెలీడం లేదని ఏడుస్తుంది. మా నాన్న నాకు అన్నీ దూరం చేస్తున్నాడని ఏడుస్తుంది. నువ్వు మమల్ని క్షమించాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. దానికి శివనారాయణ ఇప్పుటి వరకు మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇప్పుడు నేను మిమల్ని క్షమించాలి అంటే ఆఫీస్‌లో నీ కొడుకు అందరి ముందు నన్ను క్షమాపణ చెప్పి నేను ఇచ్చిన ఉద్యోగం చేయాలని అంటాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది తెలియాలి అన్నీంటి కంటే ముఖ్యంగా దీప పేరుతో రెస్టారెంట్ పెట్టాలి అన్న ఆలోచన ఆగిపోవాలని దీప ఆఫీస్‌కి నా ఇంటికి రాకూడదని అంటాడు. వీటిని నేను ఒప్పుకోనని కార్తీక్ అంటే దీప ఒప్పుకుంటానని అంటుంది. 


కార్తీక్: దీప ఈ పెద్ద మనిషి మన జీవితాలను తన కాళ్ల దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నాడు నీకు అర్థమవుతుందా. నా ఆత్మాభిమానం పక్కన పెట్టి నేను అవన్నీ చేయను దీప.
దీప: నేను చేస్తాను కార్తీక్ బాబు. తాతయ్య గారు ఆఫీస్‌లో అందరి ముందు నేను క్షమాపణ చెప్తా మీ ఇంటికి ఆఫీస్‌కి రాను.
కార్తీక్: ఇంక చాలు ఆపు దీప నా పేరు చెప్పుకోకపోతే నువ్వు బతకలేవు అని నా ముఖం మీదే అన్నాడు ఈ పెద్ద మనిషి. దాన్ని నువ్వు నిజం చేయాలి అనుకుంటున్నావా. నేను చేతకాని వాడిని అని నువ్వు అనుకుంటున్నావా. 
దీప: మిమల్ని తక్కువ చేయాలి అని కాదు బాబు ఎక్కడ ఈ కుటుంబాలు విడిపోతాయో అని ఒప్పుకుంటున్నా.
కార్తీక్: అవసరం లేదు ఎవరి డబ్బుతో నేను బతకాలి అనుకుంటున్నా. నువ్వు నాకు తోడు ఉంటే ఏమైనా సాధించగలను అని సవాల్ చేశా ఈ సవాలు నీ భర్త ఆత్మ గౌరవానికి సంబంధించింది. నువ్వు తల దించితే నన్ను చంపినట్లే. నన్ను చావ మంటావా.
దీప: మీ గౌరవం నాకు ప్రాణంతో సమానం కార్తీక్ బాబు. దాన్ని ఎవరి ముందు తక్కువ చేయలేను.
కార్తీక్: ఇదిభార్య లక్షణం అంటే నా భార్య ఏం చెప్పిందో విన్నారు కదా శివన్నారాయణ గారు. నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదు. నేను ఈ క్షణమే కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లిపోతా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల బిడ్డని పురిటిలోనే చంపేసిన విజయాంబిక.. ఏళ్లు దాటేసిన కథ, ఎన్నో మలుపులు!