Brahmamudi Serial Today Episode:    అప్పు తనను చూడటానికి ఒక్కసారైన రమ్మని కళ్యాణ్‌ను అడుగుతుంది. దీంతో ఇక్కడ నేను చేసే ఇంపార్టెంట్‌ పని ఒకటి ఉందని అది అయిపోయాక వస్తానని చెప్తాడు కళ్యాణ్‌. నాకన్నా నీకు ఇంపార్టెంట్‌ పని ఉందా అని అప్పు అడగ్గానే అది కాదు పొట్టి అర్థం చేసుకో అంటాడు కళ్యాణ్‌. దీంతో సరేలే అంటుంది అప్పు. మరోవైపు కిచెన్‌లోకి వెళ్తాడు రాజ్‌.


రాజ్‌: ఏం చేస్తున్నావు కళావతి


కావ్య: ఈ భూమ్మీద కాకుండా మరెక్కడైనా మనుషులు ఉన్నారేమోనని సెర్చ్‌ చేస్తున్నాను


రాజ్:  నీకు ఈ సెన్సాఫ్‌ వ్యూమర్‌ చిన్నప్పటి నుంచి ఉందా..?


కావ్య: లేదు అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెగ కామెడీ చేసేదాన్ని అంటా అందుకే నా బతుకు ఇప్పుడు కామేడీ అయిపోయింది.


రాజ్‌: అవును నువ్విలా కామెడీగా మాట్లాడితే చాలా బాగుంటుంది


కావ్య: అవును బలవంతంగా నవ్వేంత కామెడీ చేస్తున్నారని నాకు అర్థమైంది కానీ మీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పండి


రాజ్: నాకా నాకేం అక్కరలేదు. జస్ట్‌ ఊరికే నువ్వు ఏం చేస్తున్నావోనని వచ్చాను.


కావ్య: అసలు కిచెన్‌లోకి అడుగుపెట్టడానికే ఇష్టపడని మీరు ఎందుకు వచ్చారో చెప్పండి.. మీ ఇంట్లో మీకు మొహమాటం ఏంటండి చెప్పండి.


రాజ్‌: ఏయ్‌ కళావతి నా ఇల్లు కాదు మన ఇల్లు.. నాకు  టీ కావాలి


అని రాజ్‌ అడగ్గానే కొద్దిసేపయ్యాక ఇస్తాను అంటుంది కావ్య. సరేలే అయితే నేనే టీ పెట్టుకుంటాను అని రాజ్‌ ట్రై చేస్తుంటే అపర్ణ వచ్చి నేను పెట్టిస్తాను అనగానే వద్దులే మమ్మీ అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య రూం క్లీన్‌ చేస్తూ కిందపడబోతుంటే రాజ్ వెళ్లి పట్టుకుంటాడు. ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇంతలో రుద్రాణి, ధాన్యలక్ష్మీ వచ్చి చూసి తిట్టుకంటూ వెళ్లిపోతారు. అంతగా ఆ మొగుడు పెళ్లాలు సరసాలు ఆడాలనుకుంటే తలుపు వేసుకోవచ్చు కదా అంటూ ధాన్యలక్ష్మీ తిడుతుంది. అపర్ణ కాఫీ తీసుకొచ్చి సుభాష్‌కు ఇస్తుంది.


సుభాష్‌: అడక్కుండానే కాఫీ ఇచ్చావేంటి


అపర్ణ: ముందు తాగండి చెప్తాను


సుభాష్‌: చాలా తియ్యగా ఉంది షుగర్‌ ఎక్కువైంది అపర్ణ..


అపర్ణ: ఇప్పుడు నేనే చెప్పేది అంతకన్నా తియ్యగా ఉంటుంది. మన రాజ్‌ మారిపోయాడండి


సుభాష్‌: వాడు ఎప్పుడూ మారిపోతూనే ఉంటాడు కదా..? కొత్తగా మారడం ఏంటి..?


అని సుభాష్‌ ప్రశ్నించగానే అది కాదండి అంటూ రాజ్‌, కావ్యతో నడుచుకుంటున్న విధానం మొత్తం చెప్తుంది. సుభాష్‌ హ్యాపీగా ఫీలవుతాడు. దూరం నుంచి వింటున్న కావ్య సంతోషంగా వెళ్లిపోతుంది.   రాజ్‌ కు ఆఫీసు నుంచి ఫోన్‌ చేసి రేపు బ్యాంకర్లు ఆఫీసుకు వస్తున్నారని చెప్తారు. నేను చూసుకుంటానులే అని ఫోన్‌ కట్‌ చేసి నిజం మొత్తం కళావతికి చెప్పాలి అని రూంలోకి వెళ్తాడు రాజ్‌. రాజ్‌ను చూసిన కావ్య హ్యాపీగీ ఫీలవుతుంది. ఇంతలో రాజ్ నీకో విషయం చెప్పాలి అనగానే తనకు ప్రపోజ్‌ చేస్తాడేమోనని కావ్య టెన్షన్‌ పడుతుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!