Trinayani Serial Today Episode విక్రాంత్ వల్లభ, తిలోత్తమతో నయని వదిన ఇక్కడే ఉంది మీరు హాస్పిటల్‌లో ఉందని చెప్పి అందరినీ పిచ్చివాళ్లని చేయొద్దని చెప్తాడు. దానికి తిలోత్తమ మరి అర కోటి డబ్బుని ఎందుకు హాస్పిటల్‌లో నయని కట్టిందని అడుగుతుంది. దానికి నయని రెండు నెలలు అయినా కోలుకోను అని చెప్పిన డాక్టర్లు రెండు రోజుల్లోనే నేను కోలుకునేలా చేయడంతో వాళ్ల సేవలను మెచ్చి 8 లక్షలు బోనస్‌గా ఇచ్చానని చెప్తుంది. అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. మంచి పని చేశావ్ అని విశాల్ అంటాడు. 


సుమన: అయితే మా అక్క ఈ అక్కేనా.
విక్రాంత్: ఎలాంటి అనుమానం అక్కర్లేదు.  
నయని: ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అత్తయ్యా. 
విశాల్: ఇవన్నీ పక్కన పెట్టేసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేయాలో ఆలోచించండి. 
హాసిని: ఎవరు మంచి ఐడియా ఇస్తే వాళ్లకి 5 లక్షలు బహుమానం.


నయని విశాల్ బెడ్ రూంలోకి వస్తే వల్లభ వాళ్లు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవడానికి వాళ్ల రూంలో దాక్కొంటాడు. ఇద్దరూ నయని త్రినేత్రి అని మాట్లాడుకుంటారు. పూర్తిగా నీకు నయం అవ్వడం సంతోషంగా ఉందని విశాల్ అంటుంది. ఇక వల్లభ సౌండ్ చేస్తే  ఇద్దరూ వింటారు. ఇక వల్లభ పిల్లిలా అరుస్తాడు. ఇద్దరూ వల్లభని కనిపెట్టేస్తారు. వల్లభ బిక్కు ముఖం వేసుకొని బయటకు వస్తాడు. ఇక విక్రాంత్ నయని ట్రీట్మెంట్ గురించి నయని అంత డబ్బు కట్టడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీని వెనక ఏదో జరుగుతుందని అనిపిస్తుందని అనుకుంటాడు. అవును అని అనుకుంటూ సుమన ఎంట్రీ ఇస్తుంది. విక్రాంత్ సుమనను వెళ్లిపోమని అంటాడు. ఇంతలో దురంధర కూడా వస్తుంది. ఇక సుమన దురంధరతో మా అత్తయ్య ఆస్తి కొట్టేశావు ఆ పాపం నీకు నీ కడుపులో బిడ్డకు తగులుతుందని అంటే దురంధర కన్నీరు పెట్టుకుంటుంది.


విక్రాంత్ దురంధరని ఓదార్చి ఎందుకు వచ్చావ్ అత్తయ్యా అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తావా అని అడగటానికి వచ్చానని చెప్తుంది. మీ ఆయన ఉంటే మా ఆయనకు ఎందుకు పిలుస్తావని అడుగుతుంది. డబ్బు కోసం మిమల్ని పిలుస్తుందని సుమన అంటుంది. దానికి విక్రాంత్ మామయ్యని పిలువు అత్తయ్య ముగ్గురం వెళ్దామని అంటుంది. ఇక రాత్రి గాయత్రీ పాప ఓ చీర పట్టుకొని హాల్‌లోకి వచ్చి ఆ చీరని తలుపు కింద నుంచి దురంధర వాళ్ల గదిలోకి తోయడానికి ప్రయత్నిస్తుంది. తిలోతమ్త, వల్లభ అది చూసి తిలోత్తమ కావాలనే చీర మీద కాలు పెడుతుంది. దాంతో పాప చీర లోపలికి తోయలేకపోతుంది. ఇద్దరినీ చూసి గాయత్రీ పాప నిల్చొంటే వల్లభ పాపతో నువ్వు పెద్దమ్మ అయినా ఇప్పటికి చిన్నపిల్లవే చీర లాగలేవు అనగానే పాప చీర లాగేస్తుంది. తిలోత్తమ కింద పడిపోతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. పాప పడేసిందని తిలోత్తమ చెప్తుంది.


పాప లాగేయడం అంటే ఎవరూ నమ్మరని నయని అంటుంది. నమ్మాలి అని వల్లభ విషయం చెప్తాడు. చీరని చూసి సుమన అది మా అక్కదని చెప్తాడు. ఇక హాసిని అందరూ వచ్చారు కానీ బాబాయ్ పిన్ని రాలేదని అంటుంది. రాత్రి కదా పడుకొని ఉంటారని అనుకుంటారు. వల్లభ డోర్ కొట్టి వాళ్లని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరూ బయటకు వస్తారు. దురంధర బయటకు వచ్చి తలుపు తాళం వేస్తుంది. అందరూ ఆశ్చర్యపడి గదికి తాళం ఎందుకు వేశావని అడుగుతారు. దాంతో అందరూ అనుమానిస్తారు. దానికి తిలోత్తమ నన్ను మోసం చేసి తీసుకున్న ఆస్తి పేపర్లు ఉన్నాయని వాటి కోసం జాగ్రత్తపడినట్లున్నారని అంటుంది. విక్రాంత్ మాత్రం పాప అలా చేసింది అంటే ఏదో లాజిక్ ఉండనే ఉంటుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప, రాజుల బిడ్డని పురిటిలోనే చంపేసిన విజయాంబిక.. ఏళ్లు దాటేసిన కథ, ఎన్నో మలుపులు!