Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్‌కి 25 లక్షలు ఇవ్వకుండా రామ్ ని ఆపింది సీత అని మహాలక్ష్మీ, అర్చనలు తెలుసుకుంటారు. మిధున గౌతమ్‌కి డైమండ్ నెక్లెస్ అడిగిందని సీతకి ఎలా తెలుసు అని అర్చన అడుగుతుంది. బయట చూసుంటుందని మహాలక్ష్మీ అంటుంది. సీత చెప్పడంతో రామ్ నా చేతిలో చెక్ చింపేశాడని రామ్ పూర్తిగా సీత ట్రాప్లో పడిపోయాడని అంటుంది.

Continues below advertisement


డైమండ్ నెక్లెస్‌ గురించి మిధునతో మాట్లాడి కన్విన్స్ చేయాలి అనుకుంటుంది. వెంటనే మిధునకు కాల్ చేస్తుంది. నువ్వు గౌతమ్ మాట్లాడుకోవడం సీత వినేసిందని రామ్కి కాల్ చేసి చెప్పిందని మిధునలా నటిస్తున్న సీతకే కంప్లైంట్ ఇస్తుంది. గౌతమ్కి మనీ ఇవ్వకుండా రామ్ అడ్డుకున్నాడని చెప్తుంది. గౌతమ్ నాకు నక్లెస్ ఇవ్వకుండా రామ్ ఆపేశాడు అన్న మాట అని చెప్తుంది. 25 లక్షల నెక్లెస్ కోసం ఈగోకి పోవు కదా అంటుంది. దాంతో మిధున రేపు ఎలా అయినా నిశ్చితార్థం జరుగుతుందని చెప్తుంది. పెళ్లి తర్వాత నీకు ఒళ్లంతా బంగారంతో నింపేస్తా అంటుంది. అర్చన మహాలక్ష్మీతో మీ అత్తా కోడళ్లు సూపర్ అంటుంది.


మహాలక్ష్మీ గౌతమ్ దగ్గరకు వెళ్లి సీత మొత్తం చేసిందని చెప్తుంది. మిధునకు సర్ది చెప్పానని మహాలక్ష్మీ అంటుంది. మిధున మొదటి సారి అడిగిన గిఫ్ట్ ఇవ్వడం లేదా అని గౌతమ్ అంటాడు. ఇప్పటికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని మహాలక్ష్మీ చెప్పి సీత నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నిస్తుందని అంటుంది. సీత ఏం చేస్తుందో అని టెన్షన్‌గా ఉందని మహాలక్ష్మీ అంటుంది. రేపు సీతని ఇక్కడికి రాకుండా చేస్తానని గౌతమ్ అంటాడు. ఏం చేస్తావని మహాలక్ష్మీ అడిగితే నేను చూసుకుంటానని అంటాడు. ఏం చేసినా జాగ్రత్త అని మహాలక్ష్మీ చెప్తుంది.  


శివకృష్ణ కిరణ్కి కాల్ చేసి సీత గురించి అడుగుతాడు. సీత మిధునలా సీతలా ఇబ్బంది పడుతుందా అని అడుగుతాడు. సీత బాగానే మ్యానేజ్ చేస్తుందని ఇప్పటి వరకు ఎవరికీ దొరకలేదని అంటారు. రేపు మిధునకు గౌతమ్కి నిశ్చితార్థం అని చెప్తారు. సీత తండ్రి షాక్ అయిపోతారు. పెళ్లి వరకు అంటే రిస్క్ అవుతుంది. నిశ్చితార్థం ఆపాలని సీత తండ్రి అంటాడు. తర్వాత రేవతి సీత కోసం కాఫీ తీసుకెళ్తే సీత గదిలో ఉండదు. సీత కనిపించడం లేదని కిరణ్, రేవతి ఇద్దరూ టెన్షన్ పడతారు. మనతో చెప్పకుండా సీత ఎక్కడికీ వెళ్లదు అని సీతకి కాల్ చేస్తే సీత ఫోన్ పని చేయదు. ఇద్దరూ చాలా టెన్షన్ పడతారు. 


సీతని కొందరు రౌడీలు కిడ్నాప్ చేస్తారు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలని అంటారు. సీత ఫోన్ తీసుకొని పక్కన పడేస్తారు. ఈ రోజు నాకు పనుందిరా నేను వెళ్లాలి అని సీత అంటే నువ్వు నిశ్చితార్థం ఆపకుండా నిన్ను ఆపుతున్నాం అని అంటారు. నేను లేకపోతే నిశ్చితార్థం ఎలా జరుగుతుంది నేనే మిధున అని తెలిసి పోతుందని సీత టెన్షన్ పడుతుంది. ఉదయం మహాలక్ష్మీ ఇంట్లో గౌతమ్ నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతాయి. నిశ్చితార్థం ఆపడానికి సీత వస్తుందని ఏదో ఒకలా ప్లాన్ చేస్తుందని అర్చన అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"