జీ తెలుగులో టెలికాస్ట్ అయిన సూపర్ హిట్ సీరియళ్లలో 'వైదేహి పరిణయం' (Vaidehi Parinayam Serial) ఒకటి. అందులో టైటిల్ పాత్రలో అంజన, ఊర్మిళగా కీలక పాత్రలో కరుణ భూషణ్ నటించారు. మరొక కీలక పాత్ర చేసిన కన్నడ నటి పద్మిని దేవనహళ్లి గుర్తుందా? ఆవిడ గుడ్ న్యూస్ షేర్ చేశారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పద్మిని...వాళ్ళింట అడుగు పెట్టింది ఎవరంటే?పద్మిని దేవనహళ్లి (Padmini Devanahalli) భర్త కూడా నటుడే. ఆయన పేరు అజయ్ రాజ్ (Ajay Raj). కన్నడలో సీరియల్స్ చేస్తున్నారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో సైతం నటిస్తున్నారు.
Padmini Devanahalli and Ajay Raj blessed with baby boy: అజయ్ రాజ్, పద్మిని దేవనహళ్లి దంపతులు కొన్ని నెలల క్రితమే పద్మిని ప్రెగ్నెన్సీ న్యూస్ అనౌన్స్ చేశారు. తాజాగా తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ఇంట వారసుడు వచ్చాడని తెలిపారు.
పద్మిని దేవనహళ్లి ఏప్రిల్ 15వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని అజయ్ రాజ్ తెలిపారు. అయితే బిడ్డకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రెగ్నెన్సీ రావడంతో సుమారు ఏడాదిగా నటనకు పద్మిని దేవనహళ్లి దూరంగా ఉన్నారు. బిడ్డ పుట్టాడు కనుక మరొక ఏడాది పాటు మేకప్ వేసుకునే ఆలోచనలో ఆవిడ లేరట. పిల్లాడు కొంచెం పెద్దయిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు పద్మిని దేవనహళ్లి వచ్చే అవకాశాలు ఉన్నాయి.