Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప మళ్లీ ఇంటికి రాకూడదు జైల్లోనే ఉండాలని పారిజాతం అంటుంది. పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని జ్యోత్స్న తాతతో అంటే నేను ఎక్కడికి రాను అని అని చెప్పి పక్కకు వెళ్లి కూర్చొంటారు. పారు ఏడుస్తూ దీపది ఎంత రాతి గుండె ఆ బులెట్ నాకు తగిలినా బాగున్ను అంటుంది. దాంతో సుమిత్ర మనలో ఎవరికి గాయం అయినా ఇలాగే పరిస్థితి ఉంటుందని అంటుంది. 

జ్యోత్స్న: దాన్ని వదలను మమ్మీ. తన కూతురి జోలికి వస్తే భర్తని కూడా వదలను అన్నది కదా నాది సేమ్ నా తండ్రి జోలికి వస్తే ఎవరినీ వదలను. దానికి బెయిల్ కూడా రాకుండా చేస్తా. గ్రానీ నువ్వు మమ్మీని చూసుకో నాకు బయట చిన్ని పని ఉంది అది చూసుకొని ఎస్‌ఐ గారితో మాట్లాడి వస్తాను. తాత దగ్గరకు వెళ్లి తన ప్లాన్ చెప్తుంది.శివన్నారాయణ: సరే అమ్మ నువ్వే కలువు నేను ఫోన్‌లో మాట్లాడుతా.పారిజాతం: జ్యోత్స్న ఇదంతా నిజమేనా. నేను చూస్తుంది అంతా నిజమేనా. జ్యోత్స్న: దశరథ నా కన్న తండ్రి కాకపోవచ్చు కానీ అతను నాకు పంచిన ప్రేమ కాదు. అనవసరంగా అది నాకు ఓ అవకాశం ఇచ్చింది. ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది నువ్వు నోటికి సీల్ వేసుకో చాలు. దీప అయితే బయటకు రాదు.పారిజాతం: దీన్ని చూస్తే నాకే భయంగా ఉంది. దీప: ఏవండీ దశరథ్ గారికి ఎలా ఉంది.కానిస్టేబుల్: నీకు బయటకు వచ్చే రాత ఉంటే ఆయన బతుకుతారు.కాంచన: మా అన్నయ్యకి ఏం కాకూడదు మా అన్నయ్య బతకాలి. అనసూయ: చెల్లమ్మా నువ్వు ఇలా బాధ పడే బదులు ఒక్క సారి మీ వదినకు కాల్ చేసి మాట్లాడు.

కార్తీక్ జరిగింది చెప్పిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం లేదు అని అంటుంది. మీ పిన్నికి ఫోన్ చేయ్ అని అనసూయ ఫోన్ ఇస్తుంది. కాంచన ఫోన్ చేస్తుంది. శివన్నారాయణ చూసి ఎవరు అని అడుగుతుంది. కాంచన అని చెప్పడంతో ఎవరూ మాట్లాడొద్దు కాల్ కట్ చేయమని అంటారు. ఎందుకు కాల్ చేసిందో ఏంటో నువ్వే అడుగు అని సుమిత్రకు ఫోన్‌ ఇస్తుంది. నీ కోడలు చేయాలి అనుకున్నది ఇంకా జరగలేదులే అని సుమిత్ర అంటుంది. మేం ఎప్పుడూ ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు మాట ఇచ్చిన వాళ్లు మోసం చేసినా భరించాం. ఇంకెప్పుడూ మాతో మాట్లాడొద్దు నన్ను వదిన అని పిలవొద్దు మీరంతా కలిసి నా భర్త ప్రాణాల మీదకు తెచ్చారు అని అంటుంది. 

పారిజాతం ఫోన్ తీసుకొని నువ్వు అసలు మా ఇంటి ఆడపడుచువేనా ఒట్టప్పుడు తెగ తిరుగుతావ్ ఇప్పుడు మీ అన్న చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇంత వరకు కళ్లు తెరవలేదు అని ఏడుస్తుంది. అన్నయ్య చస్తే ఆస్తి మొత్తం నీకే వస్తుంది అనుకున్నవా అని అంటుంది. ఇక శివన్నారాయణ ఫోన్ తీసుకొని ఎప్పుడూ ఆస్తి ఏనా మా పరువు తీశారు ఇప్పుడు మా ప్రాణాలు కూడా తీయాలి అనుకున్నారు. తండ్రిగా నాది ఒక్కటే కోరికమ్మా జీవితంలో ఎప్పుడూ నువ్వు నాకు కనిపించకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. కాంచన షాక్ అయిపోతుంది. కాంచన తల బాదుకొని ఏడుస్తుంది. కన్నతండ్రే అసహ్యించుకుంటే నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తుంది. అనసూయ కాంచనని ఓదార్చుతుంది.

కావేరి కాంచనకు పరామర్శకి వస్తుంది. వెనకాలే శ్రీధర్ వస్తాడు. కాంచన వాళ్లని దెప్పిపొడుస్తాడు. ఇంతలో కార్తీక్ వచ్చి మేం ఏడిస్తే ఓదార్చాలి అని చూస్తున్నావ్ రావొద్దు అంటే వస్తున్నావేంటి అని కార్తీక్ అంటాడు. తోడ బుట్టిన అన్నయ్య చావుబతుకుల మధ్య ఉంటే మీ అమ్మ చూడటానికి వెళ్లిందా అని అంటాడు. నీ కోడలు మర్డర్ కేసులో ఇరుక్కుంది. హాస్పిటల్‌లో తెలిసిన వాళ్లని అడిగాను దశరథ్‌ బావ బతకడం కష్టం అని చెప్పారు అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. బావకి ఏమైనా అయితే దీపకి ఉరి శిక్ష అని అంటాడు. దీప వల్ల ఏం జరగలేదని నేను నమ్ముతున్నా అని కార్తీక్ అంటాడు. మన బంగారం మనకు మంచిదే కానీ అవతల వాళ్లకి కాదు అని శ్రీధర్ అంటాడు. వాళ్ల ఫ్యామిలీ లాయర్ ఎలాంటి వాడో అందరికీ తెలుసు కదా అంటాడు. అందరూ భయపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!