Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ కేసు విచారణ కొనసాగుతుంది. పీపీ విజయాంబికను బోనులోకి పిలుస్తారు. బోనులోకి వెళ్లిన విజయాంబిక వీడియోలో ఉన్నది నిజమే అని మేం చూసేసరికి ఆ రాధిక కాపాడండి అని వచ్చిందని వెనకాలే నా తమ్ముడు అర్థనగ్నంగా వచ్చాడని రాధిక అలా చెప్తేనే మాకు తెలిసింది అని సూర్యప్రతాప్‌ని ఇరికించేసి మా తమ్ముడు మంచోడు అంటుంది.
జడ్జిగారితో కట్టుకున్న భార్య తప్పు చేస్తేనే పెద్ద శిక్ష వేశాడని విరూపాక్షి గురించి చెప్తుంది. నా తమ్ముడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే నా తమ్ముడి భార్య విరూపాక్షిని అడగండి అని అంటుంది. విరూపాక్షి చాలా కంగారు పడుతుంది. విరూపాక్షిని బోనులోకి పిలుస్తారు. విరూపాక్షి జడ్జి గారితో నేను సూర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు దూరంగా ఉన్నామని చెప్తుంది. పీపీ విరూపాక్షితో మీ ఆయన రాసలీలల మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. దాంతో విరూపాక్షి కోపంతో లాయర్ అవతారంలో కోర్టులో ఉన్నారు కాబట్టి ఏం అనలేకపోతున్నా ఇదే మాట బయట అనుంటే అని జడ్జిని క్షమాపణ అడుగుతుంది. నింద నిరూపణ అవకుండా ఆయన్ని అలా అనడంతో కోపం వచ్చిందని అంటుంది.
పీపీ జడ్జితో రాధికను వీళ్లే ఏదో చేసుంటారు అందుకే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తీర్పు ఇవ్వమని అంటారు. రాజు, రూపలు జడ్జితో రాధిక నిజం చెప్తానని చెప్పిందని డబ్బు కోసమే ఇదంతా చేసిందని రాధిక వచ్చే వరకు ఆగమని ఒక్క రోజు గడువు ఇవ్వమని కోరుతారు. రాజు, రూప, విరూపాక్షి, చంద్ర అందరూ జడ్జిని బతిమాలుతారు. జీవన్ రాధిక కారు తగల బెట్టి కారు కాలిపోవడం వీడియో తీస్తాడు. ఇక జడ్జి కేసు రేపటికి వాయిదా వేస్తారు. సూర్యప్రతాప్‌ని జైలుకి తీసుకెళ్తారు. మిమల్ని మేం బయటకు తీసుకొస్తామని రాజు అంటారు. అందరి ఫోన్లకు అప్పుడే ఓ మెసేజ్ వస్తుంది. అందరూ ఫోన్లు ఆన్ చేసి చూస్తారు.
బ్రేకింగ్ న్యూస్ అంటూ రాధికను చంపేసిన సూర్యప్రతాప్ అని వార్త వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దానికి సూర్యప్రతాప్ రాధికను వదలను అన్నీ వాయిస్ మెసేజ్ జోడిస్తారు. అందరూ వీడియో చూసి బిత్తరపోతారు. నేను రాధికను చంపడం ఏంటి నేను పోలీస్ స్టేషన్‌లో ఉన్నాను కదా అంటారు. మీడియా సూర్యప్రతాప్‌ని చుట్టుముట్టేస్తారు. ఎవరో కావాలనే ఇలా చేశారు వాళ్ల గురించి మేం తెలుసుకుంటామని రూప తండ్రికి ధైర్యం చెప్తుంది. సూర్యప్రతాప్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిపోతారు. అంతా నేను చూసుకుంటానని రాజు అంటే నేను వస్తానని రూప అంటుంది. రాజు వద్దని అంటాడు. విజయాంబిక, దీపక్‌లు ఇదంతా జీవనే చేసుంటాడని మనల్ని కూడా చంపేస్తాడని భయపడతారు. మనం బతకాలి అంటే రాజుకి విషయం చెప్పాలి అని ఇదంతా జీవనే చేసుంటాడని విజయాంబిక అంటుంది.
జీవన్ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో రూప, రాజులు జీవన్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకొని నిలదీస్తారు. నాకేం తెలీదు అని జీవన్ అంటాడు. సూర్యప్రతాప్ చంపాడని వీడియోలో క్లారిటీగా ఉంది కదా మరి నన్ను అంటారేంటి అని అడుగుతాడు. జీవన్‌కి రాజు కొట్టి నిలదీస్తాడు. కోర్టుకి వచ్చి నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!