Lakshmi Nivasam Serial Today April 15th Episode: తమను విడిపించింది బసవ వాళ్లు కాదని తెలుసుకున్న లక్ష్మీ, శ్రీనివాస్, తులసి ఆశ్చర్యానికి గురవుతారు. ఇదే సమయంలో తులసిని చూడడం సిద్ధు మిస్ అవుతాడు. ఇంటికి వెళ్లి కోడలు కీర్తికి.. లక్ష్మి, శ్రీనివాస్ క్లాస్ తీసుకుంటారు. మరోవైపు, చిన్నారి ఖుషి గురించి ఆలోచిస్తూ తులసి వేదనకు గురవుతుంది. పాపను చూడాలని సుపర్ణిక ఇంటికి వెళ్తుంది. అటు, జానుతో తన పెళ్లి కోసం శ్రీనివాస్ ఫ్యామిలీపై ఒత్తిడి తెస్తాడు జై. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..

తులసిని అడ్డుకున్న సుపర్ణిక

ఖుషిని చూసేందుకు వచ్చిన తులసిని సుపర్ణిక అడ్డుకుంటుంది. ఇదే సమయంలో కిచెన్‌లో ఉన్న ఖుషి నోరుని భాగ్యం మూసేస్తుంది. ఆమెను భార్గవ్, సుపర్ణిక నానా మాటలు అంటారు. ఒకసారి పాపను చూసి వెళ్తానని అనగా.. సుపర్ణిక కోపంతో ఆమెను వెళ్లగొడుతుంది. ఇంకోసారి పాపను కలవాలని ట్రై చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని భార్గవ్ వార్నింగ్ ఇస్తాడు. శ్రీ తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన నెక్లెస్‌ను తిరిగి వారికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

ఇదే సమయంలో పాప కేకలు విని ఇంట్లోకి తులసి తిరిగి వస్తుంది. దీంతో సుపర్ణిక మళ్లీ ఆమెపై కేకలు వేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటూ వార్నింగ్ ఇస్తుంది. పాపను జాగ్రత్తగా చూసుకోవాలంటూ సుపర్ణికను వేడుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

ఇంటికి తిరిగి వచ్చిన తులసిని ఫ్యామిలీ అంతా ఏం జరిగిందని అడుగుతారు. సుపర్ణిక వాళ్లు పాపను సరిగ్గా చూడడం లేదని వారితో చెబుతుంది. హరీష్, మహేష్ ఇద్దరూ తులసిపై కోపం తెచ్చుకోగా.. లక్ష్మీ, శ్రీనివాస్, బామ్మ అంతా వారిపై కేకలు వేస్తారు. ఖుషిని కనీసం చూడనివ్వలేదని వేదనతో వారికి చెబుతుంది తులసి. డైమండ్ నెక్లెస్ తిరిగి ఇచ్చేశానని చెప్పగా.. హరీష్, మహేష్ కోపం తెచ్చుకుంటారు. దీంతో మనది కాని సొమ్ము కోసం ఎందుకు ఆరాటపడతారంటూ శ్రీనివాస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

జాను ఊహల్లో విశ్వ

మరోవైపు, జాను ఊహలతో విశ్వ సతమతం అవుతుంటాడు. జై పెళ్లి ప్రపోజల్, తన ఫ్రెండ్స్ చెప్పినవన్నీ తలుచుకుంటూ బాధ పడతాడు. ఇదే సమయంలో విశ్వ అమ్మ త్రివేణి అక్కడకు వస్తుంది. ఏం జరిగిందని అడుగుతుంది. ఇదే సమయంలో విశ్వ తండ్రి విజయేంద్ర, తాత అక్కడకు వస్తారు. ఎందుకు డల్‌గా ఉన్నావని అడుగుతారు. 

తన అత్త లక్ష్మి ప్రేమ విషయం విశ్వతో ప్రస్తావిస్తూ ఎవరినైనా ప్రేమిస్తే ఇప్పుడే చెప్పాలని విశ్వతో అంటారు విజయేంద్ర, అతని తండ్రి. దీంతో ఆనందంతో జాను ఇంటికి బయలుదేరుతాడు. 

జాను ఇంటికి జై

విశ్వ జాను ఇంటికి వెళ్లగా.. అప్పటికే అక్కడ జై ఉంటాడు. జానుతో పెళ్లి విషయం గురించి మళ్లీ శ్రీనివాస్ ఫ్యామిలీ వద్ద ప్రస్తావిస్తాడు. అయితే, జాను చదువుకుంటానని చెప్తుందని లక్ష్మి జైతో అంటుంది. జానుకు పెళ్లి ప్రపోజల్ ఇష్టమా? లేదా? అని అడగాలని శ్రీనివాస్‌తో అంటాడు జై. తన ఇద్దరు కూతుళ్లు తన మాట వింటారని.. జైతో అంటాడు శ్రీనివాస్.

మరి జైతో పెళ్లికి జాను ఒప్పుకొంటుందా?, విశ్వ పరిస్థితి ఏంటి?, సిద్ధు, తులసిలు కలుస్తారా?, చిన్నారి ఖుషి భవిష్యత్తు ఏంటి? తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.