Seethe Ramudi Katnam Serial Today Episode అర్చన, మహాలక్ష్మీలు సీతతో గౌతమ్‌ గురించి మంచిగా ఎలా చెప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సీత చాటుగా ఇద్దరు అత్తల మాటలు వింటుంది. మిమల్ని ఇంకా టెన్షన్ పెడతాను అనుకొని సీత మిధునలా మహాలక్ష్మీకి కాల్ చేస్తుంది. గౌతమ్ మంచోడు అని సీతతో ఎప్పుడు చెప్పిస్తారని అంటుంది. మహాలక్ష్మీ రెండు రోజులు టైం అడుగుతుంది. 

మిధున: నేను గౌతమ్ గురించి రకరకాలుగా వింటున్నా. వెంటనే మీరు సీతతో సర్టిఫికేట్ ఇప్పించకపోతే నా మనసు మారిపోతుంది. మహాలక్ష్మీ: అలా అనొద్దు మిధున రెండు రోజుల్లో సీతతో చెప్పిస్తా. నేనే నీకు కాల్ చేస్తాను ఉంటాను. ఇది వరకు మిధున కాల్ చేస్తే సంతోషంగా ఉండేది. ఇప్పుడు మిధున కాల్ చేస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది.అర్చన: మరి అలాంటి కోడలు అవసరమా మహా.మహాలక్ష్మీ: అవసరమే ఎలా అయినా సీతని ఒప్పించి సీతతో సర్టిఫికేట్ ఇప్పిస్తా. అర్చన: ఏమో మహా నువ్వు మాత్రం మిధున కోసం ఎన్నో మెట్లు దిగుతున్నావ్. మహాలక్ష్మీ: మిధున లాంటి కోడలి కోసం ఎంత దిగినా తక్కువ కాదు అర్చన. వన్స్ అది నా కోడలు అయితే చాలు. ఆ తర్వాత చక్రం నా చేతిలో ఉంటుంది. సీత: ఆ చక్రం ఎప్పటికీ మీ చేతికి రాదు అత్త మీ బలహీనతే నా బలం. సీత దెబ్బ  అంటే అబ్బ అనిపిస్తా. రామ్ గదిలో బెడ్ మీద దొర్లుతూ.. ఈ గది నాది ఈ గాలి నాది.. ఈ పరుపు నాది. రామ్: ఏయ్ సీత. నా రూంలోకి వచ్చావేంటి.సీత: ఇది మన రూం మామ. మన పడకగది.రామ్: నీ వేషాలు నా దగ్గర కాదు ఈ రకంగా దగ్గర అవ్వాలి అనుకుంటున్నావా. మన మధ్య చాలా దూరం ఉంది. 

సీత కావాలనే రామ్ మీద మీదకు వెళ్లి నేను ఇష్టం లేదా ప్రేమ లేదా అని అడుగుతుంది. మనల్ని కలుపుతా అని మీ పిన్ని తీసుకొచ్చింది. రామ్ సీతని బయటకు వెళ్లిపోమంటాడు. సీతని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. ముఖం మీద డోర్ వేసేస్తాడు. నీతోనే నన్ను గదిలోకి రప్పించేలా చేస్తా అని అంటుంది. అందరూ భోజనాలు చేస్తుంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చలపతి సీత కిడ్నాప్ గురించి మాట్లాడుతుంటే అందరూ నోరు మూయిస్తారు. ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు అని అంటారు.  

సీత తన గదిలోకి వెళ్లి మిధునలా రామ్‌కి కాల్ చేస్తుంది. ఈ టైంలో మిధున కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటాడు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశావ్ అని రామ్ అడిగితే నువ్వు గుర్తొచ్చి చేశానని అంటుంది. పెళ్లి చేసుకున్న సీతని దూరం పెట్టావ్.. పెళ్లి చేసుకుంటా అన్న నన్నూ దూరం పెట్టావ్ ఇంకా ఏం బాగుంటావ్‌లే అని మాట్లాడుతుంది. దానికి రామ్ నేను సోలోగా హ్యాపీగా ఉండగలను అంటాడు. నువ్వు ఓకే అంటే గౌతమ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసి నీతో పెళ్లికి రెడీ అవుతా అంటుంది. నాకు సీత చాలు అంటాడు. సీతకి నువ్వు అంటే ఇష్టంలేదని మిధున అంటుంది. నిజంగా సీతకి నువ్వు అంటే ఇష్టం ఉంటే ఫ్రూవ్ చేయ్ అంటుంది. దాంతో రామ్ ఇప్పుడే నిరూపిస్తా అని సీత గదిలోకి వెళ్తాడు. సీత పడుకున్నట్లు నటిస్తే వెళ్లి సీతని లేపుతాడు. సీతని తన గదిలోకి పిలుస్తాడు. డ్రామా చేశానని అలా నెట్టేస్తే ఎలా రియాక్ట్ అవుతావా అని యాక్ట్ చేశానని సీతతో చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!