Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవాకి ఆనంద్‌ని మార్చే ఐడియా చెప్తుంది. ఇదో వేస్ట్ ప్లాన్ అని దేవా తిట్టడంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఇంటి నుంచి వెళ్లిపోతా అని మిధున అంటుంది. దేవా షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. ఈ ప్లాన్ నాకు మా వదినకు చెప్పడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ నువ్వు వెళ్లిపోతా అన్నావ్ కాబట్టి వెళ్లి మా వదినకు చెప్తా నువ్వు ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ ఉండు అని అంటాడు.

నీ చేతుల్లోనే ఉంది వదినా..

దేవా ప్రమోదిని దగ్గరకు వెళ్తాడు. అన్నయ్యని మార్చి జాబ్‌కి వెళ్లేలా చేస్తే అన్నయ్య మారిపోతాడు నువ్వు సంతోషంగా ఉంటావని దేవా అంటాడు. అది ఈ జన్మలో జరగదు అని ప్రమోదిని అంటుంది. దానికి దేవా అది నీ చేతుల్లోనే ఉంది వదినా అని అంటాడు. పెళ్లి అయినప్పటి నుంచి చెప్తున్నా గొడవ పడుతున్నా అలుగుతున్నా ఆ మనిషి మారడం లేదని దేవుడు చెప్పినా ఆయనలో మార్పు ఉండదు అని ప్రస్తుతానికి మా వాళ్లు నా బిడ్డను పోషిస్తున్నారు. వాళ్లు అటూ ఇటూ అయితే ఇళ్లల్లో పని చేసుకొని నా బిడ్డను పెంచుకోవాలి ఏంటో నా ఖర్మ పెద్దగా చదువుకూడా లేదు జాబ్ చేద్దాం అంటే అని ఏడుస్తుంది. 

నా దగ్గర ఐడియా ఉంది వదినా..

దేవా వదినతో అన్నయ్య జాబ్‌కి వెళ్లాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది మరి నేను చెప్పినట్లు చేస్తావా అని అడుగుతాడు. ఆయనలో మార్పు రావాలి అంటే ఏమైనా చేస్తా అని ప్రమోదిని అంటుంది. దానికి దేవా మీకు జ్వరం వచ్చినట్లు నటించండి. నాన్నని డబ్బులు అడగకుండా తన సొంత డబ్బుతో మిమల్ని తీసుకెళ్లమని చెప్పండి కనీసం మందులు అయినా తీసుకురమ్మని చెప్పమని అంటాడు. ఇంత చిన్న విషయానికి మారుతాడా అని ప్రమోదిని అడుగుతుంది. మారుతాడు వదినా నీ కన్నీరు వాడికి అలవాటు అయిపోయింది కానీ నీకోసం కనీసం 100 రూపాయలు పెట్టి మందులు తీసుకురాలేదని బాధతో మార్పు వస్తుంది అని అంటాడు. ప్రమోదిని చేస్తానని అంటుంది. 

ప్రమోదిని ఆట షురూ..

ఆనంద్ గదిలోకి వచ్చేసరికి ప్రమోదిని దుప్పటి కప్పేసి చలి జ్వరం అని దేవా చెప్పినట్లు నాటకం మొదలు పెడుతుంది. దేవా మిధున చాటుగా చూస్తారు. నువ్వు చెప్పినట్లు ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు చెప్తా అంటాడు. సడెన్‌గా జ్వరం ఏంటి అని ఆనంద్ అడిగితే నాటకం ఆడుతున్నా అని ప్రమోదిని అంటుంది. దాంతో ఆనంత్ అలా కాదు అని ప్రమోదినిని చూసి ఇంత జ్వరం ఉంది హాస్పిటల్‌కి వెళ్లాలి నాన్న కూడా లేరు డబ్బు అడుగుదామంటే అని అంటాడు.

మీ నాన్న డబ్బుతో నేను రాను..

మీ నాన్న డబ్బుతో నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా అని అంటే నేను రాను నాకు అంత కంటే అవమానం ఇంకొకటి లేదని అంటుంది. మిధున తొంగి తొంగి చూస్తుంటే మిధున జుట్టు దేవా మీద ఎగురుతూ ఉంటే దేవా డిస్ట్రబ్ అవుతూ మిధుననే చూస్తాడు. ప్రమోదిని జ్వరం అని గోల చేస్తూనే ఆనంద్‌ డబ్బుతోనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అంటుంది. ఇక దేవా మిధున కాలు తొక్కేస్తాడు మిధున అరవడంతో నోరు నొక్కేస్తాడు. నన్ను ఎందుకు టచ్ చేశారని అడుగుతుంది. మరి అరుస్తే వాళ్లు వింటారు కదా అంటాడు.

నన్ను ఈడ్చి తన్నినా ఒక్క రూపాయి లేదు..

ఆనంద్ తన దగ్గర డబ్బు లేదు అని చెప్తాడు. దాంతో ప్రమోదిని హాస్పిటల్‌కి వద్దు ఒక ట్యాబ్లెట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకురండి చాలు అంటుంది. దానికి కూడా ఆనంద్ నన్ను ఈడ్చి తన్నినా ఒక్క రూపాయి లేదు తెలుసా అని అంటాడు. ఇక ప్రమోదిని జ్వరం నన్ను చంపేస్తుంది అండీ దయచేసి ఏదో ఒకటి చేసి తీసుకుండి అంటుంది. ఆనంద్ బయటకు వెళ్తాడు. 

ఇంటిళ్లపాదిని అడిగిన ఆనంద్.. 

ఆనంద్ బయట ఉన్న మిధున దగ్గరకు వెళ్లి మా అమ్మ ఎక్కడ మిధున అని అడుగుతాడు. బాలేదని పడుకున్నారని చెప్తుంది. మిధునని అడగాలి అనుకుంటాడు. మిధున అని మామూలుగా పిలవగానే మిధున ఏంటి అని కసురుకుంటుంది. ఇక దేవా బయట కూర్చొని ఉంటే ఆనంద్ దేవాకి 500 ఉంటే ఇవ్వమని అడుగుతాడు. దాంతో దేవా క్యాష్ లేదురా ఏటీఎమ్‌కి వెళ్లే టైం లేదని అంటాడు. తర్వాత ఆనంద్ శ్రీరంగానికి డబ్బులు అడుగుతాడు. నా దగ్గర ఒక్క రూపాయి లేదని రంగం ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఆనంద్ ముఖం మీదే తలుపు వేసేస్తాడు రంగం. ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనడంతో ఆనంద్ బాధగా బయటకు వెళ్లిపోతాడు. ఇంట్లో ఎవరూ డబ్బు ఇవ్వడం లేదని ఆనంద్ బయటకు వెళ్తాడు. మిధున దేవాతో మనం చెప్పినట్లు అందరికీ చెప్పారు కదా అని అంటుంది. 

అన్న నిన్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది..

పురుషోత్తం ఎమ్మెల్యేగా అయితే ఇచ్చే స్పీచ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇంతలో దేవా ఓ మీడియా వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న రౌడీ అని మీ గురించి రాశాడని అతన్ని చితక్కొడతాడు. అతనికి వార్నింగ్ ఇస్తాడు.  పురుషోత్తంతో అన్న నిన్ను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది అని అంటాడు. పురుషోత్తంతో లాయర్ నీ మీద పాత కేసులు అన్నీ తవ్వుతున్నారు ఇక మీ పని అయిపోయినట్లే అని అంటారు. జడ్జి హరివర్దన్ అతని కూతురిని పెళ్లి చేసుకున్న దేవా మీద పగ తీర్చుకోవడానికి నీ అంతు చూడాలని ఫిక్స్ అయ్యారని దేవా వల్లే మీకు రాజకీయ సమాధికి కారణం అవ్వబోతున్నాడని లాయర్ చెప్తాడు. 

డబ్బు ఇస్తేనే మందులు..

ప్రమోదిని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మందులు తీసుకురావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అని అనుకుంటుంది. ఇక ఆనంద్ మందుల షాపుకి వెళ్లి మందులు అడుగుతాడు. డబ్బు తర్వాత ఇస్తా అంటే షాప్ అతను తిడతారు. ప్రమోదినిని మిధునతో వచ్చి మాట్లాడుతుంది. ప్రమోదిని మిధున దగ్గర నిజం దాచేస్తుంది. బావ జాబ్‌కి వెళ్లకపోవడానికి సగం కారణం మీరే అని మిధున అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!