Seethe Raamudi Katnam Today Episode మహాలక్ష్మి భోజనానికి వస్తే తిందామని అందరూ వెయిట్ చేస్తే సీత మాత్రం వడ్డించుకొని తినేస్తుంది. అర్చన వాళ్లు మహా వచ్చే వరకు ఆగమంటే ఆమె గొప్ప ఏంటని ఎందుకు ఆగాలి అని సీత ప్రశ్నిస్తుంది. 


మహాలక్ష్మి: ఏంటే అన్నావ్ ఈ ఇంట్లో నా గొప్ప ఏముంది అనా.. నిన్నా గాక మొన్న వచ్చిన నీకు ఏం తెలుసు నా గురించి. ఇంట్లో అందరి గురించి నేనే కేర్ తీసుకుంటున్నాను. కంపెనీ బాధ్యతలు అన్నీ నేనే చూసుకుంటున్నా.. ఈ ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఈ సమస్య రాకుండా చూసుకుంటా.. అందరూ నన్ను గౌరవిస్తారు. 
చలపతి: మనసులో.. మేం గౌరవించడం లేదు. నువ్వే బలవంతంగా మా దగ్గర నుంచి తీసుకుంటున్నావ్.
మహాలక్ష్మి: నువ్వో పల్లెటూరి మొద్దువి. అసలు  కంపెనీ అనే మాట కూడా నువ్వు విని ఉండవు. అసలు మన కంపెనీ ఎక్కడుందో నీకు తెలుసా.. అందులో ఎంత మంది పనిచేస్తారు. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిస్తే నీకు నా గొప్పతనం అర్థమవుతుంది. 
సీత: ఏంటి అత్తయ్య అంటున్నారు. నాకు ఏమీ తెలీదు అనా.. ఇప్పటి పెద్ద పెద్ద పట్టణాలు అన్ని ఒకప్పటి పల్లెటూరిలో.. మన ఆఫీస్ ఎక్కడ ఉందో నాకు తెలీదా అని అడ్రస్ మొత్తం చెప్తుంది. పాతికి సంవత్సరాల క్రితం మా ఒరిజనల్ అత్తయ్య సుమతి తన నగలు అన్నీ తాకట్టు పెట్టి మామయ్య గారితో కంపెనీని ప్రారంభించారు. అంటూ డిటైల్స్ చెప్తుంది. కంపెనీ ఆదాయం కూడా చెప్తుంది. అందరూ షాక్ అయి లేచి నిల్చొంటారు. ఇవి నాకు తెలిసిన మన బిజినెస్ వివరాలు. ఇంత ఆస్తి కేవలం మా అత్తయ్య పెట్టిన పెట్టుబడి వల్ల మాత్రమే వచ్చింది. ఆరోజు మా అత్తయ్య మామయ్య కష్టపడకపోయి ఉంటే ఈరోజు ఏముండేది కాదు ఇందులో మీ కష్టం ఏముంది. మీ గొప్ప ఏముంది. ఇందతా మా అత్తమ్మ మీకు పెట్టిన భిక్ష. ఈ ఇంటి దేవత మా అత్తమ్మ. 
మహాలక్ష్మి: సీతకు ఇన్ని విషయాలు ఎలా తెలిశాయి. ఎవరు చెప్పారు. నీకు అన్నివిషయాలు తెలుసుకదా జన నువ్వు చెప్పావా.. 
జనార్థన్: నేను చెప్పలేదు మహా. రేవతి చెప్పుంటుంది.
రేవతి: చెప్తే తప్పేముంది వదినా.
మహాలక్ష్మి: అడిగితే చెప్పావా లేక నువ్వే కావాలని చెప్పావా.. 
రేవతి: ఈ ఇంటి కోడలిగా సీత ఈ విషయాలు తెలుసుకోవల్సిన అవసరం ఉంది. కంపెనీ ఎవరు స్టార్ట్‌ చేశారు ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాల్సిన అవసరం ఏముంది. 


రామ్: సీత అన్ని విషయాలు ఎలా చెప్పావ్. అందులో చాలా విషయాలు నాకే తెలీవు. నువ్వు ఎలా తెలుసుకున్నావ్.
సీత: మనసు ఉంటే మార్గం ఉంటుంది మామ. 
రామ్: కంపెనీ కోసం మా అమ్మ నగలు ఇచ్చిందని నాకు ఇప్పటి వరకు తెలీదు.
సీత: మీకు తెలీకుండా మీ పిన్ని దాచింది. తెలిస్తే తన మీద మీకు ఎక్కడ గౌరవం తగ్గిపోతుందో అని భయం.
రామ్: అదేం కాదు పిన్ని కూడా ఆఫీస్ కోసం చాలా కష్టపడుతుంది. 
సీత: నాకు ఓ డౌట్ మామ ఆఫీస్‌లో మీ పిన్ని అన్ని సక్రమంగానే చేస్తుందా.. అన్ని మీతో చెప్తుందా.. 
రామ్: నోనో మా పిన్ని చాలా పెర్‌ఫెక్ట్..
సీత: సరే మీ పిన్ని గురించి ఎందుకులే కానీ అత్తమ్మ గురించి మాట్లాడుకుందాం.. మీకు మీ అమ్మగారి గురించి ఏమైనా తెలుసా.. మీ అమ్మమ్మ గారి గురించి తెలుసుకోవాలి అని లేదా..
రామ్: అసలు నాకు అమ్మ గుర్తుంటేగా. అమ్మని మరిపించేలా పిన్ని నన్నూ ప్రీతీని పెంచింది. పిన్నే మా అమ్మ అనుకున్నాం. మా పిన్నిని సవతి తల్లి అనకు. వింటే ఫీలవకు. ఈ ఇంట్లో అమ్మ ప్రస్తావన ఎప్పుడూ వచ్చేది కాదు. నువ్వు వచ్చాకే అమ్మ ఫొటో హాల్‌లోకి వచ్చింది.
సీత: అయితే మీ పిన్ని బాగానే మ్యానేజ్ చేసింది అన్నమాట. అత్తమ్మని కనుమరుగు చేసింది. 
రామ్: అలాంటిది ఏం లేదు. పిన్నికి తను సవతి తల్లి అనిపించుకోవడం ఇష్టంలేదు. పొరపాటున మా అమ్మ గురించి మా నాన్నని అడగకు చాలా పెద్ద గొడవ అవుతుంది. కంపెనీ గురించి తెలుసుకున్నావ్ కదా అలాగే తెలుసుకో. నేను నీకు ఈ విషయంలో ఏం సాయం చేయలేను. మరోవైపు సీత తన అత్త గురించి తెలుసుకుంటాను అనుకుంటుంది. అప్పుడే స్టోర్‌రూంలోని రామ్ తల్లి సుమతికి చెందిన డైరీ కనిపిస్తుంది. 


మహా గ్యాంగ్ అంతా సీత గురించి మాట్లాడుకుంటారు. ఆడిటర్‌, లాయర్‌ ఇంటికి వస్తారు అప్పుడు సీతకు రామ్ ఆస్తి తన పేరు మీద రాసుకుంటున్న సంగతి సీతకి తెలిస్తే ఎలా అని గిరిధర్ అడుగుతాడు. సీతకు అనుమానం వస్తే ఎలా అయినా ఆపేస్తుంది అని అందరూ అడుగుతారు. అయితే సీతను ఆపడానికి తన దగ్గర ప్లాన్ ఉందని మహాలక్ష్మి చెప్తుంది. ఇక సీత రాత్రి పూట తాగే పాలలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలపమని చెప్తుంది. సీత నిద్ర లేచేలోపు రామ్ సంతకాలు తీసుకుందామని మహా చెప్తుంది. ఇక ఆ పనిని ఉష, ప్రీతిలకు చెప్తుంది మహా. రామ్ మారిపోతున్నాడు అని గిరిధర్ మహాకు చెప్తాడు. 


మరోవైపు రామ్ సీత చెప్పిన తన కంపెనీ డిటైల్స్ చెప్పిన సంగతి రామ్ గుర్తుచేసుకుంటాడు. సీతని పొగడాలి అనుకుంటాడు. కానీ సీత రెచ్చిపోతుంది అని మనసులోనే ఉంచుకోవాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి సీత వస్తుంది. తన గురించి ఏం అనుకుంటున్నావో మనసులో అనుకోకుండా బయటకు చెప్పు అని సీత అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ప్రేమ ఎంత మధురం ఫిబ్రవరి 3rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: పెళ్లిలో జ్యోతికి ఘోర అవమానం, హరీష్ కీర్తిని చంపేశాడా?