Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య సుబ్బు దంపతులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు.


సుబ్బు: మీరు మంచితనంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని మాకు తెలుసు, మీరు ఏ పని చేసినా మేము మీకు అండగా ఉంటాము. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాము అంటాడు.


పద్దు : పిల్లలు బలవంతం చేశారు అందుకే రాక తప్పలేదు అంటుంది .


ఇక టైం అవటంతో అందరూ సూర్యని హరీష్ ని పీటల మీద కూర్చోబెడతారు.


సుగుణ: హరీష్ కి మా పెద్దమ్మాయి మా పెద్దలుడు కాళ్లు కడుగుతారు అని చెప్తుంది. మా అబ్బాయికి పద్దు గారు ఉన్నారు కదా వాళ్లు కాళ్లు కడుగుతారు అని చెప్తుంది.


సుబ్బు దంపతులు: మాక్కూడా ఆయమ్మి కూతురు లాంటిదే మేము కాళ్లు కడగటానికి సిద్ధం అంటారు.


ఇంతలో హరీష్ తల్లి పేచీ పెడుతుంది. జ్యోతి కి పెళ్లి అయ్యి నాలుగు ఏళ్లయింది ఇంకా పిల్లలు లేరు అలాంటి ఆమెతో కాళ్లు కడిగిస్తే ఆ దరిద్రం నా కొడుక్కి అంటుకుంటుంది అంటుంది.


యాదగిరి: ఏవో చిన్న మనస్పర్ధలు వల్ల మేము దూరంగా ఉన్నాము అందుకే పిల్లలు లేరు, నిజానికి తనని పెళ్లి చేసుకున్నాక నాకు బాగా కలిసి వచ్చింది అంటాడు.


మీ అదృష్టాన్ని మీ దగ్గర పెట్టుకోండి అంటుంది హరీష్ తల్లి. బాధతో జ్యోతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆర్య ఆపుతాడు.


ఆర్య : తనకి పిల్లలు లేకపోవచ్చు కానీ చెల్లెల్ని సొంత పిల్లల్లా పెంచింది. కాళ్లు కడగటానికి ఆమె కన్నా ఎక్కువ అర్హత ఎవరికి లేదు అంటాడు. అయినా హరీష్ తల్లి పేచీ పెట్టబోతుంటే హరీష్ మీ అమ్మకి అర్థమైనట్లు చెప్పు అని వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడుతాడు.


హరీష్: భయపడుతూ ఇప్పుడు ఎవరి కాళ్లు కడిగితే ఏంటి అంటూ తల్లిని మందలిస్తాడు.


ఇక కాళ్లు కడిగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ సీన్ చూపించడానికి అనుని పిల్లలిద్దరూ బయటికి తీసుకు వస్తారు.


అను: ఆర్య సార్ మంచి మనసుకి అంతా కలిసే వస్తుంది. అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడం, మా అమ్మ నాన్న కాళ్లు కడగటం అంత విధిరాత అనుకుంటుంది.


మరోవైపు మాన్సీ కూడా అలాగే అనుకుంటుంది.


ఛాయాదేవి: ఇదంతా అనుకోకుండా జరుగుతుందా లేదంటే ప్లాన్ ప్రకారం జరుగుతుందా అని అనుమానం గా అడుగుతుంది.


మాన్సీ: అక్కడ జరిగేది జరగనివ్వండి, మనం చేయాల్సింది మనం చేద్దాం అంటుంది.


ఆ తర్వాత కీర్తి హరీష్ ని వెతుక్కుంటూ మండపంలోకి వస్తుంది. యాదగిరి దగ్గరికి వెళ్లి హరీష్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతని దగ్గరికి వెళుతుంది.


హరీష్: ఈ పెళ్లి జరిగితే నాకు బోల్డంత డబ్బు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి అని ఫ్రెండ్స్ తో చెప్తూ ఆనంద పడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కీర్తిని చూసి కంగారు పడతాడు.


కీర్తిని చూసిన ఫ్రెండ్స్ అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కీర్తిని నిలదీస్తాడు హరీష్.


కీర్తి: నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నావు అంటుంది.


హరీష్: నేను ఫ్రెండ్లీగా తిరిగాను నువ్వు లవ్ అనుకుంటే నేనేం చేసేది అంటాడు.


కీర్తి: అబద్దాలు ఆడకు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని మర్యాదగా ఈ పెళ్లి ఆపుతావా లేదంటే మండపంలోకి వెళ్లి అందరికీ నిజం చెప్పమంటావా అంటుంది.


నిజం చెప్తావా అంటూ కీర్తి మీద చేయి చేసుకుంటాడు హరీష్. అయితే కీర్తి తూలి గోడ మీద పడుతుంది. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉండగా స్పృహ తప్పి పడిపోతుంది. టెన్షన్ పడిన హరీష్ ఆమెని మంచం కింద దాచేస్తాడు.


మరోవైపు ఆర్య గురించి తల్లికి చెప్పాలనుకుంటుంది ఉష కానీ పెళ్లి హడావిడి లో ఉన్న సుగుణ ఆమె మాటలు వినిపించుకునే పరిస్థితిలో ఉండదు. పెళ్ళికొడుకుల్ని మండపానికి రమ్మని చెప్తున్నారు పదా బావగారికి, సూర్యకి చెబుదాము అని ఉష అని తీసుకొని హరీష్ రూమ్ కి వెళ్తుంది.


టెన్షన్ గా ఉన్న హరీష్ ని చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. తర్వాత టేబుల్ మీద ఉన్న బాక్స్ ని అనుమానంగా చూస్తుంది.


హరీష్: కంగారుపడుతూ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.


సుగుణ: అది సూర్య కోసం పంపించిన డ్రస్సు ఇక్కడుందేంటి అంటుంది.


హరీష్: పొరపాటున ఇక్కడికి తెచ్చేసి ఉంటారు అని చెప్పి ఆ బాక్స్ ని బ్యాగ్ లో పెట్టి సుగుణకి ఇచ్చేస్తాడు అయితే ఆ బాక్స్ మీద రక్తపు మరకలు ఉండడం గమనించడు.


ఆ బట్టలు తీసుకెళ్లి సూర్యకిచ్చి ఉష ని రెడీ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సుగుణ.


ఆర్య: కంగారుగా ఉన్న ఉష ని చూసి నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు.


ఉష: నేను బాగానే ఉన్నాను మీరు రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత జెండే ఆర్య కి ఫోన్ చేసి డిఎన్ఏ టెస్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం కనిపించట్లేదు అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.



Also Read: పూనమ్‌ పాండే చనిపోలేదా? - ఇదంతా పబ్లిసిటీ స్టంటా! నటి మృతిపై నెటిజన్ల రియాక్షన్‌