Satyabhama Today Episode భైరవి నందినితో మాట్లాడుతుంది. నువ్వు ఆడపిల్లవే కాని నీకు జానతనం లేదే అని అంటుంది. జానతనం అంటే ఏంటి అని నందిని అడిగితే కూతురికి ఇలాంటి విషయాలు చెప్పాల్సి వస్తుంది నా ఖర్మరా బాబు అని భైరవి అనుకుంటూనే.. మగాడిని లొంగదీసుకోవాలి అన్నా మాట వినేలా చేసుకోవాలి అన్నా దూరం దూరం ఉంటే కుదరదు అని కొంచెం జానతనం ఉండొద్దని అంటుంది. ఏదో ఒకటి చేసి అల్లుడిని కొంగున కట్టుకోమని అప్పుడే అల్లుడి ఇళ్లరికానికి ఒప్పుకుంటాడు అంటుంది. ఇంతలో మహదేవయ్య అక్కడికి వస్తాడు. నందిని, భైరవి ఇద్దరూ షాక్ అయి నిల్చుండిపోతారు.


మహదేవయ్య: కూతురికి ఏం పాఠాలు నేర్పిస్తున్నావే. మొగుడిని ఎలా ఇళ్లరికం తెచ్చుకోవాలో చెప్తున్నావా.
నందిని: నాకు అక్కడ ఉండాలి అని లేదు బాపు. పాణం అంతా ఈడనే ఉంది. ఏదో ఒకటి చేసి మీ అల్లుడిని ఇళ్లరికానికి ఒప్పించు బాపు.
మహదేవయ్య: ఇంకొక్కసారి నీ నోటి నుంచి ఆ మాట వస్తే నిన్ను కూడా ఇంటికి రానియ్యను.
భైరవి: అదేంటి అయ్యా అంత మాట అన్నావ్. దానికి ఎంత బాధ ఉంటే ఇలా అడుగుతుంది. 
మహదేవయ్య: నాకు ఎంత అవసరం ఉంటే దీన్ని ఆ ఇంటికి పంపిస్తాను చెప్పు. నాకు నా రాజకీయం ముఖ్యం. జనాలు నన్ను జే కొట్టడం ముఖ్యం. అల్లుడు ఇళ్లరికం వస్తే నలుగురిలో నేను చులకన కానా. 
నందిని: అంటే నా సంతోషం ముఖ్యం కాదా.
మహదేవయ్య: ఈ మహదేవయ్యకి తన సంతోషమే తర్వాతే ఏదైనా. నువ్వు బాపు కోసం ఆ మాత్రం చేయలేవా. నువ్వేంటే దాని దిమాక్ ఖరాబ్ చేస్తున్నావ్. ఎవరు ఎన్ని చెప్పినా నా నిర్ణయం ఇదే.
నందిని: నా నిర్ణయం కూడా విను బాపు. విలువ లేని పుట్టింటిలో నేను ఉండా. పెద్దన్న ఏమో ఎందుకు వచ్చావ్ అంటున్నాడు. నువ్వేమో నా సంతోషంతో పని లేదు అంటున్నాడు. ఇలాంటి ఇంటిలో ఒక్క నిమిషం కూడా నేను ఉండ. 
భైరవి: అయ్యో నందిని.. నందిని..


క్రిష్, సత్య, హర్షలు మాట్లాడుకుంటారు. సరదాగా నవ్వుకుంటారు. ఇక సత్య భోజనాలు వడ్డించి పిలుస్తాను అని అంటుంది. ఇంతలో నందిని సీరియస్‌గా వస్తుంది. హర్షని ఇంటికి వెళ్లిపోదాం అని అంటుంది.  


క్రిష్: ఏయ్ ఎందుకు అంత కోపం ఇది కూడా నీ ఇళ్లే కదా.
నందిని: ఏం కాదు మీ ఇళ్లు. నేను ఇక్కడ పరాయిదాన్ని. ఈ ఇంట్లో అందరూ అదే అంటున్నారు. నేను ఇక్కడికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు పోదామని చూస్తున్నారు. బయల్దేరుతావా లేదా ఇక్కడ నీకు ఎవ్వరూ మర్యాదలు చేయరు.  
క్రిష్: పిచ్చిదానిలా మాట్లాడకు మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం కూర్చో.
నందిని: మెడ పట్టుకొని బయటకు గెంటేదాకా కూర్చొమంటావా. పోతా అన్నప్పుడు ఎందుకు అడ్డం పడుతున్నావ్. పుట్టిళ్లు అంటే చాలా సంతోషపడ్డా. మంచికి చెడుకు తోడు ఉంటుంది అనుకున్నా. కానీ పుట్టిళ్లే కష్టాలు పెడుతుందని ఇప్పుడే తెలుసుకున్నా. 
సత్య: చూడు నందిని అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావ్. ఇక్కడ అందరూ నిన్ను ఇష్టపడ్డవాళ్లే. మామయ్య పొరపాటున ఒక మాట అన్నా అది పెద్దరికంతో అన్నారు అని సరిపెట్టుకోవాలి. ఆవేశంతో ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్దగా ఉంటుంది. బంధాలను తెగ తెంపులు చేసుకోకూడదు. సరి చేసుకోవాలి.
క్రిష్: మనసులో.. నీకు అందరూ అర్థమవుతారు నేను తప్ప. నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఎప్పుడు దగ్గరకు తీసుకుంటావో.
సత్య: నందిని ప్లీజ్.. నీ నిర్ణయం మార్చుకో.
నందిని: నేను మార్చుకోను నాకు ఇక్కడ ఉండాలి అని లేదు. మీరు మంచిగా సంతోషంగా ఉండండి. 
సత్య: నందిని కనీసం భోజనం చేసి అయినా వెళ్లండి.
నందిని: మనసు విరిగాక ముద్ద దిగదు.


నందిని ఇంటికి వచ్చి విశాలాక్షి మీద చిరాకు పడుతుంది. అందరికీ నేనే లోకువ అందరూ నన్ను అనేవాళ్లే అని కోప్పడుతుంది. నందిని మాటలకు ఇంట్లో అందరూ హాల్‌లోకి వచ్చేస్తారు. నిన్ను ఏమీ అనలేదు అని నువ్వు ఈ ఇంటి కోడలివి ఇక్కడ నీ ఇష్టం అని విశాలాక్షి అంటుంది. ఇవన్నీ పైపై మాటలే అని నేను ఒంటరిని నాకు ఎవ్వరూ లేరు అని నందిని ఫీలవుతుంది. 


శాంతమ్మ: చూడమ్మా నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలి అనుకున్నా నిన్ను ఎవరూ ఒంటరిని చేయరు. అభిమానంతో చూసుకుంటారు. నీ మనసులో బాధ ఏంటో చెప్పు అందరూ నీకు తోడుగా ఉంటారు. 
విశ్వనాథం: హర్ష మీరు భోజనం చేశారా..
హర్ష: లేదు.
విశాలాక్షి: చెప్పాలి కదరా నిమిషంలో భోజనం వడ్డిస్తాను. 


నందిని ఆకలి లేదు అని వద్దు అని వెళ్లిపోతే విశాలాక్షి నందిని చేయి పట్టుకొని తీసుకెళ్లి నందిని, హర్షలకు వడ్డిస్తుంది. నందిని తండ్రి మాటలు తలచుకొని పొలమారితే విశాలాక్షి ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. నందిని విశాలాక్షి ప్రేమకు తినను అని వెళ్లిపోతుంది. ఇక క్రిష్ గదిలోకి వచ్చి రెండు బెడ్‌ల మధ్య గీత లేదు అని తెగ వెతుకుతాడు. సత్య వస్తే ఇండియా పాకిస్థాన్ బోర్డర్ ఇక్కడ ఉండాలి కదా కనిపించడం లేదు అని అంటాడు. దానికి సత్య నేనే తీసేశాను అంటుంది. 


క్రిష్: గీత పెట్టి తప్పు చేశాను అనిపించి తీసేశావా. 
సత్య: కాదు గీత లేకపోయినా పర్లేదు నువ్వు తప్పు చేయవు అనిపించింది. అల్లరి చిల్లరగా మాట్లాడుతావు కానీ నువ్వు అల్లరివాడివి కాదు అని తెలిసింది. ఆడవాళ్లు అంటే ఎంత గౌరవమో తెలిసింది. గీత ఉండటంలో అర్థం లేదు అనిపించింది.
క్రిష్: ప్రేమించడం కష్టమనుకున్నా కానీ నమ్మకం సంపాదించుకోవడం కష్టమని ఇప్పుడే తెలిసింది.
సత్య: నమ్మకం సంపాదించుకోవడం కంటే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. 
క్రిష్: మనసులో.. ఎంత కష్టమైనా సరే ఈ సారి నమ్మకం నిలబెట్టుకోవడం మనకు అంత కష్టం కాదు.  అయినా ఈడ దాక వచ్చిన తర్వాత మంచాల మధ్య దూరం ఎందుకు చూడు ఎంత ఫీలవుతున్నాయ్.
సత్య: చూడు మాస్టారూ చెరిగి పోయింది గీత మాత్రమే. మన జీవితాల మధ్య గీత ఇంకా అలాగే ఉంది. నువ్వు చేసిన తప్పులకు నేను వేసిన శిక్ష ఎక్కువనిపించిది. నువ్వేంటో తెలిశాక నేను మారాలేమో అనిపించింది. మనం కలిసి ఉండే ఈ కొద్ది రోజులు మంచిగా ఫ్రెండ్లీగా ఉందామనుకుంటున్నా. 


దానిదేముంది అలాగే అంటూ క్రిష్ సత్య దగ్గరకు వెళ్లి భుజం మీద చేయి వేస్తాడు. సత్య చేయి తీసేస్తుంది. ఇక సత్య క్రిష్‌తో మనం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అని భార్యభర్తలం కాదు అని అంటుంది. క్రిష్ సరిపెట్టుకుంటా అని అంటాడు. ఇక క్రిష్ సత్యతో నేను ఏంటో తెలిశాక కూడా ఎందుకు దూరంగా పెడుతున్నావ్ అని అంటాడు. మన బంధం గురించి ఆలోచించు అని అంటాడు. దానికి సత్య మన బంధానికి ఇంకా మూడు నెలలే ఉందని అంతవరకే ఆలోచించు అని అంటుంది. క్రిష్ తన ప్రేమే నీ మనసు మార్చేలా చేస్తుందని నీ మనసులో గీత చెరిపేస్తుందని మనం సంతోషంగా ఉంటామని క్రిష్ అనుకుంటాడు. 


మరోవైపు నందిని తండ్రి మాటల్ని తలచుకొని ఏడుస్తుంది. హర్ష గదిలోకి వస్తాడు. నందినిని చూసి దగ్గర కూర్చొని ఓదార్చాలని చూస్తాడు. నందిని కస్సుబుస్సులాడుతుంది. నీ సమస్య ఏంటి అని నందినిని హర్ష అడుగుతాడు. దీంతో నందిని నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నా జీవితం ఇలా అయ్యిందని అంటుంది. ఇక తన కుటుంబం నందినిని ఎంత అభిమానిస్తుందో చెప్తాడు. నందిని మాత్రం నువ్వే నన్ను పట్టించుకోవని తిడతావని నందిని చెప్తుంది. ఇక పద్ధతి గల కోడలిగా మారమని అందరూ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అంటాడు. నందిని ఆలోచనలో పడుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: వివేక్ తన బాబాయ్ అని లక్ష్మితో చెప్పిన లక్కీ.. జాను దగ్గర ముసుగులో లక్ష్మి, మిత్ర చూసేస్తాడా!