Satyabhama Today Episode కాళీ అంతు చూడాలని క్రిష్‌కి విషయం తెలీకూడదు అని సత్య అనుకుంటుంది. క్రిష్‌కి తెలీకుండా పుట్టింటికి వెళ్లాలని అనుకుంటుంది. ఇక మహదేవయ్య అందరిని పిలిచినా సత్య రాకపోవడంతో క్రిష్ సత్యకి కాల్ చేస్తాడు. సత్య వెళ్తుంది. ఇక మహదేవయ్య మీడియా వాళ్లు వస్తున్నారు అని అందరిని ఇంటిలోనే ఉండమని అంటాడు. 


క్రిష్‌: బాపు ఇప్పుడు ఈ పేపరోళ్లని పిలిచి ఏం చెప్పాలి అనుకుంటున్నావ్.
మహదేవయ్య: బయట మందిల చక్కర్లు కొడుతున్న రూమర్లు శుభం కార్డు వేద్దామని.
భైరవి: రూమర్లు ఏంటి అయ్యా.
మహదేవయ్య: పేదింటి నుంచి వచ్చిన నా కోడలు అత్తింటిలో సంతోషంగా లేదు అంట. పేదింటికి పోయిన నా కూతురిని అక్కడ అత్తింటిలో అష్టకష్టాలు పెడుతున్నారు అంట. కేవలం ఎలక్షన్ స్టంట్ కోసమే ఈ మహదేవయ్య పెళ్లిళ్లు చేసిండంట. 
క్రిష్: అని ఎవరు అన్నారు.
మహదేవయ్య: మంది మాట.
రుద్ర: వాళ్లు పిచ్చోళ్లు బాపు.
మహదేవయ్య: వాళ్లు పిచ్చోళ్లే కావొచ్చు కానీ ఓటర్లు. ఆ నింద తొలగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా నా కోడలు, కూతురి మీద ఉంది. వాళ్లు చెప్పే మాటలే జనంలో నా పరువు పెరిగి లెక్కచేస్తాయి.
భైరవి: మనసులో.. ఆ నందిని అత్తింటి గురించి ఎప్పుడు మంచిగా చెప్పాలే..
రుద్ర: మనసులో.. ఈ సత్య క్రిష్‌ని ఎప్పుడు పొగడాలి.
మహదేవయ్య: పేపరోళ్లు వచ్చినప్పుడు మన వాళ్లతో పాటు కూతురు అల్లుడు కూడా ఉండాలి.
భైరవి: అలాగే పిలుస్తాను అయ్యా.
సత్య: మీడియా మీటింగ్ ఎన్ని గంటలకు అత్తయ్య.
భైరవి: నువ్వేమైనా ప్రైమ్‌ మినిస్టర్‌వా ఇంట్లోనే ఉంటావ్ కదా ఎప్పుడైతే నీకు ఎందుకు.
క్రిష్: అడిగితే చక్కగా చెప్పొచ్చు కదా అమ్మ.
మహదేవయ్య: మీటింగ్ రెండింటికి. రుద్ర ఆ ఏర్పాట్లు చూసుకో. 


విశ్వనాథం: సత్య అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అంటే కోడలు ఇంట్లో ఉండకూడదురా. నువ్వే ఎక్కడికో తీసుకెళ్లు.
హర్ష: సడెన్‌గా నేను ఇప్పుడు బయటకు తీసుకెళ్తే లేనిపోని అనుమానాలు వస్తాయి.
విశ్వనాథం: అలా అని ఇంట్లో ఉంచలేం కదా. 
నందిని: మా అమ్మ ఫోన్ చేసింది. మనల్ని ఇంటికి రమ్మని చెప్పింది. ఇవాళ మీడియా వాళ్లు వస్తున్నారు అంట. తన బిడ్డ కాపురం ఎలా ఉందో అందరికీ చెప్పాలి అనుకుంటుంది అంట.
హర్ష: మంచి విషయమే కదా ఇద్దరం వెళ్దాం.
నందిని: నువ్వు వెళ్లు. నేను రాను. ఎందుకు రాలేదు అంటే బామ్మకు బాలేదు. దగ్గరుండి సేవలు చేస్తున్నాను అని చెప్పు. నా నా పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేదు. వాళ్లకి వాళ్ల బిడ్డ కంటే రాజకీయాలే ఎక్కువ అయినప్పుడు నేను ఎందుకు వెళ్లాలి.
విశాలాక్షి: తప్పమ్మా అలా అనకూడదు. ఏవో నాలుగు మాటలు అంటారు పట్టించుకోకూడదు. నువ్వు ఇక్కడ ఉన్నావ్ కాబట్టి నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. నిన్ను చూడటానికి వస్తున్నారు అదంతా ప్రేమే కదా. అంటూ హర్ష, విశ్వనాథం, విశాలాక్షిలు నందినిని ఒప్పిస్తారు. ఇక మహదేవయ్య బయట ఫొటో ఫొజులు ప్రాక్టీస్ చేస్తుంది. రుద్ర వింతగా చూస్తాడు. ఏంటి బాపు కొత్తగా దండాలు ప్రాక్టీస్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. 


రుద్ర: ఏమనుకోను అంటే ఒక మాట చెప్తా బాబు. ప్రెస్ వాళ్లు వచ్చినప్పుడు ఎప్పటిలా గండు పిల్లి ముఖం పెట్టుకోకుండా నవ్వుతూ ఉండాలే. ఆ ఫొటోలు పబ్లిక్‌లోకి పోతాయి.
మహదేవయ్య: నువ్వు సలహా ఇచ్చినట్లు లేదురా పాత కక్షలు పెట్టుకొని తిడుతున్నట్లు ఉంది. 
రుద్ర: నాకు ఓ డౌట్ బాపు నువ్వు కోరుకున్నప్పుడే ఎలక్షన్ వస్తాయి అన్నావు కదా ఏమైనా ప్లాన్ చేశావా.
మహదేవయ్య: సీక్రెట్ అంటే సీక్రెట్‌గానే ఉండాలి. ఈ ఇంటి వారసుడు వచ్చేలోపు వాడి తాత ఎమ్మెల్యే అవుతాడు. రాసిపెట్టుకో.
రుద్ర: మనసులో.. ప్రతి దానికి వారసుడితోనే ముడిపెడతాడు. పిచ్చోడు.. బాపు మీడియా మీటింగ్‌కి ఆడోళ్లు ఎందుకు.
మహదేవయ్య: మన వైపు ఎవరూ చూడరు. అదే ఆడోళ్లు మన వెంట ఉంటే వాళ్లు మాట్లాడితే రాష్టమంతా చూస్తారు.. సెంటిమెంట్ వర్క్‌అవుట్ అవుతుంది.  


సత్య మీటింగ్‌కి రెడీ అయి ఉంటుందని క్రిష్ అనుకొని గదికి వెళ్లి చూస్తాడు. అక్కడ సత్య కనిపించదు. క్రిష్ కంగారు పడతాడు. భైరవి వచ్చి సత్యని రమ్మని చెప్తుంది. మీడియా వాళ్లు వచ్చే టైం అయిందని సత్య ఎక్కడికి వెళ్లిందని అనుకుంటాడు. క్రిష్ బయటకు వెళ్లి పనివాడిని అడిగితే సత్య హడావుడిగా బయటకు వెళ్లిందని అంటాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందని అంటాడు. మరోవైపు మహదేవయ్య సంధ్యని క్లాస్‌కి వెళ్లమని అంటాడు. సంధ్య వెళ్తుండగా కాళీ డోర్‌కి ఎదురుగా నిల్చొంటాడు. సంధ్య భయంతో తండ్రిని పిలుస్తుంది. 


కాళీ: ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నువ్వే తెగిస్తే ఒక్క పెళ్లి కానివాడిని నేను ఎంతకు తెగించాలి. బుద్ధిగా నా మాట వింటే ఒక్కడినే పోతా లేదు అని నకరాలు చేస్తే నీ చిన్న కూతుర్ని చంకలెట్టుకొని పోతా. పది లక్షలతో పోయేదాన్ని ఇరవై లక్షల వరకు తెచ్చుకున్నావ్. అయినా నీకు బుద్ధి రాలేదు. పైసలు ఇస్తావా పిల్లని ఇస్తావా.
విశ్వనాథం: రేయ్ నేను పైసలు ఇవ్వను పిల్లను ఇవ్వను.
కాళీ: అయితే లాభంలో లేదు పిల్లని ఎత్తుకుపోవాల్సిందే. ఆ పిరికి వాడి వెనక పడకు నాతో వచ్చేయ్. విశ్వనాథం చాకు పట్టుకుంటే.. నీ దగ్గర కత్తి ఉంటే నా దగ్గర కత్తిలాంటి నీ పెద్ద కూతురి వీడియో ఉంది బయట పెట్టమంటావా.
సత్య: పెట్టరా చూద్దాం.. ఏంట్రా బెదిరింపులు ఆపి. నీ దగ్గర ఉన్న ఆ వీడియో ఏంటో నాకు చూపించు తర్వాత డీల్ మాట్లాడుకుందాం.
కాళీ: ఆ వీడియో చూశావ్ అనుకో సిగ్గుతో చచ్చిపోతావ్.
సత్య: అయినా పర్లేదు చూపించు. 
కాళీ: వీడియో బయట పెట్టాను అంటే నీ పరువు పోతుంది. 
సత్య: అయినా పర్లేదు చూపించు. 
కాళీ: మొత్తం ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటారు.
సత్య: అయినా పర్లేదు చూపించు.
కాళీ: ఇంకోసారి ఆలోచించు.. సత్య చెంప దెబ్బ కొడుతుంది. ఒక్కసారి కొట్టినందుకే ఇక్కడి వరకు తెచ్చుకున్నావ్ మళ్లీ కొట్టావ్ నిన్నువదలను.
సత్య: రేయ్ నువ్వు వీడియో చూపించే వరకు కొడుతూనే ఉంటా.. వీడియో చూపిస్తే ఇప్పుడే ఇక్కడే నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తా. ఎక్కడరా వీడియో.. నీ దగ్గర ఎలాంటి వీడియో లేదు కదా.. నువ్వు ఒక్కసారి నా చెల్లి జోలికి వచ్చి క్రిష్‌ చేతిలో దెబ్బలు తిన్నావ్. బుద్ధిరాలేదు. ఈ విషయం ఇప్పుడు క్రిష్‌కి తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో తెలుసా నిన్ను ఇక్కడే సమాధి చేస్తాడు.
కాళీ: నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నా చావు గురించి కాదు సత్య నీ కాపురం గురించి. నిన్ను కిడ్నాప్ చేసి ఒక రాత్రి అంతా నాతో ఉంచుకున్నాను అని నేను క్రిష్‌కి చెప్తే ఊరుకుంటాడు అనుకున్నావా. నిన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: ఈటీవీలో ఒకేరోజు రెండు సీరియ‌ల్స్ ప్రారంభం.. టెలికాస్ట్‌ టైమింగ్స్ ఏంటంటే?