Satyabhama Today Episode ఇద్దరు కొడుకుల్ని ఒకేలా చూడాలని రుద్ర తల్లి మీద అరుస్తాడు. చిన్నా ఏం చేసినా ఎవరూ ఏం అడగరని ఈ రోజు నుంచి తాను కూడా తనకి నచ్చినట్లు చేస్తానని అడిగే హక్కు ఎవరికీ లేదని రుద్ర అంటాడు. దాంతో మహదేవయ్య రుద్రని ఏంట్రా మాటలు జోరుగా వస్తున్నాయి అని అడుగుతాడు


రుద్ర: మరేంటి బాపు నువ్వు ఎంత అవమానించినా పెంపుడు పిల్ల లెక్క నీ దగ్గర పడున్నాను. వాడేమో నీ నెత్తినెక్కి ఆడుతున్నాడు. అయినా వాడినే ముద్దు చేస్తావ్. నాకు బాధగా ఉండదా.
భైరవి; రామ్మా పుట్టింటి నుంచి అలిసిపోయి వచ్చావ్. ఉడుకుడుకుగా వడ్డిస్తా. నా నాయనని విడిపించుకుంటా అని నీ మొగుడిని ఎగరేసుకుపోయావ్ కదా. పోయిన పడి ఏమైంది బిడ్డా. ఆ పెద్ద మనిషిని ఇంటి దగ్గర దింపి వచ్చారా.
రుద్ర: ఆయన బయటకు వచ్చే పనే లేదు. పీకల్లోతు వరకు మునిగిపోయాడు.
సత్య: తప్పు చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతారేమో. ఏ తప్పు చేయని మా నాన్న ఏ మచ్చా లేకుండా బయటకు వస్తారు.
రుద్ర: అంటే ఏంటి.
క్రిష్‌: మా అన్నకి ఏదీ ఒకసారి చెప్తే దిమాక్‌లోకి పోదు. చూడన్న ఒక్క మాట అంటే నీకు ఎంత కాలుతుందో ఎటుది మనిషికి అంతే కాలుతుందని గుర్తు పెట్టుకో.
భైరవి: రేయ్ ఈ ఇంటి పద్ధతి నీకు బాగా తెలుసు. ఇప్పటివరకు ఎవరం మీ బాపు మాటకి ఎదురు చెప్పలేదు. ఆయన చెప్పింది కాదు అన్నది లేదు. నీ పెళ్లాం ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుటి నుంచి ఆ ధౌర్భాగ్యం షురూ అయింది. చూడు మీ బాపు ఎంత బాధ పడుతున్నాడో.  
క్రిష్: హనీమూన్లో ఉన్నప్పుడు నేను మిమల్ని కాపాడటానికి ఇదే పని చేయగానే నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు సత్య తన తండ్రి కోసం తాపత్రయ పడుతుంది. దానికి ఎందుకు ఈ రచ్చ బండ పంచాయితీలు.
మహదేవయ్య: అంటే ఏంటిరా నేను ఇక్కడ రచ్చబండ చేస్తున్నానా  ఈ ఇంటి పరువు కోసం ఆలోచించడం తప్పా.
సత్య: మామయ్య నా పుట్టింటి పరువుకి అత్తింటి పరువుకు సంబంధం లేదు. పెళ్లి అయిన అమ్మాయికి పుట్టింటి బంధం తెంచుకోమని చెప్పడం పాపం. అవసరాలకు తగ్గట్టు రంగులు మార్చడం మాకు చేతకాదు. ఈ ఇంటి వాతావరణం వేరు ఆ ఇంటి వాతావరణం వేరు. మీరు ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేసుకుంటారు. కానీ మా పరిస్థితి అలా కాదు చిన్న గాలి వానకు కూడా ఎగిరి పడతాము. మీలా మొండిగా తెగించి ఉండలేం. 


సత్య మాటలకు మహదేవయ్య లేచి వెళ్లిపోతాడు. భైరవి మామని అర్థం చేసుకోమని కోడలిలా ప్రవర్తించమని నచ్చినట్లు ప్రవర్తించొద్దని అంటుంది. సత్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. విశాలాక్షి భోజనం అందరికీ వడ్డిస్తుంది. సంధ్య వచ్చి తల్లికి వడ్డించి బాధ పడుతున్న తల్లిని ఓదార్చి ప్రేమగా తినిపిస్తుంది. ఇక నందిని భోజనానికి వస్తుంది. హర్షని పిలవమని విశాలాక్షి నందినికి చెప్తుంది. భర్తతో కలిసి భర్త కలిసి ఉండాలి అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని చెప్తుంది. భర్త గొప్పతనం అందరూ నందినికి చెప్తారు. సరే అని నందిని హర్షని పిలవడానికి వెళ్తుంది. లాయర్‌తో మాట్లాడుతున్న హర్షని నందిని పిలవడానికి వెళ్తే హర్ష నందినిని తిట్టి వెళ్లమని పంపేస్తాడు. నందిని ఏడుస్తూ బయటకు వస్తుంది. అత్తయ్యకు హర్ష తిట్టిన విషయం చెప్పి అలిగి తినకుండా వెళ్లిపోతుంది. 


మరోవైపు సత్య డల్ గా ఉంటే క్రిష్‌ వచ్చి సత్యని నవ్వించడానికి మరో ఇద్దరు పనివాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. చున్నీని చీరలా క్రిష్‌ కట్టుకోవడంతో సత్య నవ్వేస్తుంది. ఇక క్రిష్‌తో తన బాధ చెప్తుంది. దానికి క్రిష్‌ సత్యతో నువ్వు నాతో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్తాడు. ఇక సత్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భైరవి, మహదేవయ్యలు తమ గదిలో మాట్లాడుకుంటారు. అటుగా వెళ్లిన క్రిష్ ఆ మాటలు వింటాడు. పెద్దొడి కంటే నీకు చిన్నోడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అని భైరవి అంటుంది. చిన్న తన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అని అందుకే తన అంటే ప్రేమ అని అంటాడు. ఇక భైరవి నీవల్లే చిన్నా నీ మాట వినకుండా తయారవుతున్నాడని అంటుంది. పెళ్లాం కొంగు పట్టుకొని తిరిగుతున్నాడని అంటుంది. దాంతో మహదేవయ్య పెళ్లి అయిన కొత్తలో ఎవరైనా అంతే అంటాడు. చిన్నాకి తనంటే ప్రాణమని తన కోసం ఏమైనా చేస్తాడని మహదేవయ్య అంటాడు. దాంతో భైరవి సత్యని రేపు వెళ్లకుండా ఆపితే చాలు నీ చిన్న కొడుకుకు నువ్వంటే ప్రేమ అని ఒప్పుకుంటా అంటుంది. సత్యని రేపు కోర్టుకి వెళ్లకుండా ఆపితే చాలు వాడికి నీ మీద ప్రేమ ఉందని భైరవి అంటుంది. దాంతో మహదేవయ్య సత్య ఆపకపోతే జీవితాంతం వాడితో మాట్లాడను అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మికి షాక్ మీద షాక్ ఇచ్చిన సీత.. నిజంగానే మహా మారిపోయిందా.. సుమతిని వెతకమన్న జనార్థన్!