Brahmamudi Serial Today Episode: డిన్నర్‌కు వెళ్లిన రాజ్, కావ్య ను సర్‌ప్రైజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తాడు. రెస్టారెంట్‌ మేనేజర్‌ కు చెప్పి అన్ని అరైంజ్‌మెంట్స్‌ చేస్తాడు. తర్వాత వచ్చి ఏమీ తెలియనట్టు కావ్య దగ్గర కూర్చుని మాట్లాడుతుంటాడు. ఇంతలో మేనేజర్‌ వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు స్వరాజ్‌ తన శ్రీమతితో వచ్చాడని చెప్పి అన్నా చెళ్లెల పాటలు, సిస్టర్‌ బర్తుడే కేకు ఇస్తూ అంతా కామెడీ చేస్తాడు. దీంతో కావ్య నవ్వుతూ రాజ్‌ను ఆటపట్టిస్తుంది. రాజ్‌ రెస్టారెంట్‌ మేనేజర్‌ను తిడతాడు.


కావ్య: ఏంటండి ఇది లేక లేక మీరు నన్ను రెస్టారెంట్‌కు తీసుకొస్తే రాక రాక నేను డిన్నర్‌కు వస్తే ఇలా జరుగుతుంది.


రాజ్: అంతా నా కర్మ అరేయ్‌ ఆ ఫుడైనా సరిగ్గా పంపిస్తావా? ఇదైనా మ్యూజిక్‌ వేయకుండా తీసుకురా?


తర్వాత ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వెళ్తుంటారు.


కావ్య: ఎంటి అలా ఉన్నారు.


రాజ్: నా ప్లాన్‌ అంతా వాడు  పాడు చేశాడు రాస్కెల్‌.. అందుకే ఇరిటేటింగ్‌ గా ఉంది.


కావ్య: మూడ్‌ బాగాలేనప్పుడు మంచి పాటలు వింటే అదే ప్రశాంతంగా ఉంచుతుంది. ఉండండి నేను పాటలు పెడతాను.


 కావ్య పాటలు పెట్టగానే అందులో కూడా సిస్టర్‌ సెంటిమెంట్‌ పాట వస్తుంది.


రాజ్: ఏయ్‌ నువ్వు కావాలని పెట్టావు కదా?


కావ్య: నేనెందుకు అలా  పెడతాను. సమయం సందర్భం మనకు తెలుసు. దానికేం తెలుసు. ఉండండి ఇప్పుడే మారుస్తాను. ఇప్పుడు చూడండి.


      మళ్లీ బ్రదర్‌ సెంటిమెంట్‌ సాంగ్‌ వస్తుంది.


రాజ్‌: నువ్వే ఏదో గాంబ్లింగ్‌ చేస్తున్నావు.


కావ్య: అయ్యో నాకేం తెలియదండి. రాక రాక మనం బయటకు వస్తే విధి కూడా మనల్ని వెక్కిరిస్తున్నట్లు ఉంది. కారు ఎందుకు ఆపారు. కొంపదీసి నన్ను దిగిపోయి నడుచుకుంటూ రమ్మంటారా ఏంటి?


రాజ్: అంత రాక్షసుణ్ని ఏమీ కాదు.


 అంటూ రాజ్‌ కారు ఆగిపోయిందని ఇప్పుడెలా అని నా ఫోన్‌ చార్జింగ్‌ అయిపోయిందని కావ్యను ఫోన్‌ అడిగితే తాను తీసుకురాలేదని ఇంట్లో పెట్టానని చెప్పడంతో రాజ్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు. ఇంతలో వర్షం వస్తుంది. ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్తారు.


కావ్య: ఎవరైనా ఉన్నారా లోపల. దెయ్యాలు భూతాలు ఉంటే రాకండి. మా ఆయన గర్జిస్తే మీరు గుండె ఆగి చస్తారు.


రాజ్: ఆలెరెడీ చచ్చిపోయినోల్లే దెయ్యాలు అవుతారు.


కావ్య: లాజిక్కేనండి..


రాజ్: ఎవరూ లేనటున్నారు. లోపలికి వెళ్దాం పద


కావ్య: చెయ్యి వణుకుతుందండి


రాజ్: అవునా నేను పట్టుకుంటానులే


కావ్య: వణికేది నా చెయ్యి కాదు మీ చెయ్యే.. ఎవరైనా ఉన్నారా?


 అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లగానే ఒక రూం మొత్తం చాలా కలర్‌పుల్‌గా డెకరేట్‌ చేసి ఉంటుంది.  


కావ్య: ఇక్కడ ఇన్ని క్యాండిల్స్‌ ఉన్నాయి ఎవరైనా చేతబడి చేస్తున్నారా? ఏంటి


రాజ్: చేతబడి లేదు. చెట్టుకింద బడి లేదు నువ్వు ఆగు.. ఏయ్‌ ఇక్కడేదో శారీ ఉంది వెళ్లి మార్చుకుని రాపో


కావ్య: ఏవండి ఇది ఎవరిదో నండి..


రాజ్‌: కొత్తదిలా ఉంది. వెళ్లి మార్చుకుని రాపో


   అనగానే కావ్య వెళ్లబోతుంటే తెరచాటు నుంచి ఎవరో వెళ్లినట్లు కనిపిస్తుంది. కావ్య భయపడుతుంది. దెయ్యం సినిమాలు చూసి నువ్విలా మారిపోయావని రాజ్‌ తిడతాడు. కావ్య వెళ్లి శారీ మార్చుకుంటుంది. తెరచాటు నుంచి శారీ మార్చుకుంటున్న కావ్యను  చూసిన రాజ్‌ రొమాంటిక్‌గా ఫీలవుతాడు. మరోవైపు రాజ్, కావ్య శోభనం కోసం అంతా రెడీ చేసిన అపర్ణ, ఇందిరాదేవి ఎదురుచూస్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   


ALSO READ: ఆగిపోయిన నాగశౌర్య సినిమా - దర్శకుడు, నిర్మాతకు మధ్య మనస్పర్థలు, ఫల్మ్‌ ఛాంబర్‌కు బడ్జెట్‌ వివాదం