Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ దీప బంగారు గాజులు పట్టుకొని చూస్తూ ఇంటికి తిరిగి వచ్చాక ఇద్దామని అనుకున్నాను అని కానీ నీ మాటలు విన్నాక ఇక నువ్వు రావు అనిపిస్తుందని ఇప్పుడే వీటిని నీకు ఇచ్చేస్తా.. బహుశా మనం కలవడం ఇదే చివరి సారి అవుతుందేమో అని కార్తీక్ అనుకుంటూ గాజులు, ఫోన్‌ని బ్యాగ్‌లో పెట్టి దీప ఉన్నఇంటికి వెళ్తాడు. అక్కడ దీప ఇంటికి తాళం వేసి ఉండటం చూసి దీప వెళ్లిపోయింటుందని అనుకుంటాడు. పక్కింటి ఆవిడను అడుగుతాడు. దీప వెళ్లిపోయిందని మళ్లీ రానని చెప్పిందని ఆవిడ చెప్తుంది. 


ఇక కార్తీక్‌కి తన తల్లి కాల్ చేసి షాపింగ్‌కి వెళ్లాలి రమ్మని పిలుస్తుంది. దాంతో కార్తీక్ తనకు ఇష్టం లేకుండా పెళ్లి ఫిక్స్ చేసేశారని ఇప్పుడు దీప కోసం ముత్యాలమ్మ గూడెం వెళ్లాల లేక తన అత్త దగ్గరకు వెళ్లి విషయం చెప్పాలా అని ఆలోచిస్తాడు. ఇక ఎవరి గురించి ఆలోచించకుండా సుమిత్రకు నిజం చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేస్తా అని లేదంటే కాళ్లు పట్టుకుంటా అని వెళ్తాడు. 


శోభ: దీప అంటే నిప్పు. ఇంటికి ఉన్న పై కప్పు అన్నారు. తప్పు చేయదు అని నా మొగుడిని కొట్టారు. ఇప్పుడేమైంది అత్తయ్య. మళ్లీ కత్తి పీట మహారాణి గారు ప్రియుడి ఇంటికే చేరారంట. 
అనసూయ: అది ఆ ఇంటికి చేరితే నీకు ఏంటి.
శోభ: ఏమో ఆ కార్తీక్ అన్నమాటే నిజమేమో అని. 
అనసూయ: ఆ మాట వాడు అన్నందుకే ఒకటి తగిలింది. నీకు అయితే నా చేయో నీ చెంపో రెండింటిలో ఏదో ఒకటి పడిపోయే అంత వరకు తగులుతూనే ఉంటాయి.
శోభ: అందరితో తన్నించుకోవడమే నా పనా.
నర్శింహ: ఏంటే మీ గొడవ.
శోభ: ఆ అక్రమ సంతానం నాకు వద్దు.
అనసూయ: ఏయ్ తల తిక్కలదానా. చెప్తుంటే అర్థం కావడం లేదా. వీడు ఇంటికి వెళ్లి చేసిన పనికి మళ్లీ ఎక్కడ పిల్లని ఎత్తుకుపోతాడేమో అని అది కార్తీక్ పంచకు చేరింది. నీ మొగుడికి కూతుర్ని తెచ్చుకోవడం చేత కావడం లేదు. నా మనవరాలిని తీసుకొచ్చి నిన్ను అమ్మని చేసే బాధ్యత నాది. ఓరేయ్ నర్శి నువ్వు ఇప్పుడు కంగారు పడకు. బిడ్డను ఎప్పుడు తీసుకురావాలో నేను చెప్తా. ఇప్పుడది బిడ్డ జోలికి మనం రాము అని అనుకోవాలి. ఈసారి భయపెట్టి వదిలేయడం కాదు వెళ్తే బిడ్డతో రావాలి. దానికి ఏం చేయాలో చెప్తా నువ్వు కాస్త ఆగు. ఆ ఇంట్లో మనకు ఎవరైనా సాయం చేసేవాళ్లు ఉంటే బాగున్ను. అలాంటి వాళ్లు ఎవరు ఉన్నారు. 


జ్యోత్స్న: మనకు ఇంకా ఏం తెలీనట్లు దీపని ఇంకా అక్కడే ఉంచితే ఏం జరుగుతుందో నాకు తెలుసు గ్రానీ. నీకున్న తెలివి అనుభవాన్ని వాడాల్సిన టైం వచ్చింది. నిన్ను దీప ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా నువ్వు మళ్లీ దీపతోనే ఇంట్లోకి రావాలి.
పారిజాతం: నా టాలెంట్ ఏంటో చూపిస్తాను పద. 
 
సుమిత్ర పూజ చేస్తుంటే వెనుక నుంచి శౌర్య వచ్చి కళ్లు మూస్తుంది. నీ కోసం వచ్చేశాం అని శౌర్య చెప్తుంది. సుమిత్రను దీప దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక జ్యోత్స్న పారిజాతం చూసి మనం కష్టపడకుండానే దీప వచ్చేసిందని తన తల్లిమీద ప్రేమతో కాకుండా వేరే ప్రేమ కోసం వచ్చిందని జ్యోత్స్న అంటుంది. ఇక సుమిత్ర దీపతో తన కూతురికి గురువారం నిశ్చితార్థం అని ఈసారి జ్యోత్స్న పెళ్లి అయ్యే వరకు ఇక్కడే ఉండమని అంటుంది. ఇంతలో కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. శౌర్య కార్తీక్ దగ్గరకు పరుగులు తీస్తుంది. కార్తీక్ ప్రేమతో శౌర్యని ముద్దు పెట్టుకుంటాడు. జ్యోత్స్న పారుతో కార్తీక్ ముందు వాళ్లని పంపి తర్వాత తాను వచ్చాడని అసలు ప్రాబ్లమ్ ఇప్పుడే మొదలైందని జ్యోత్స్న అంటుంది. 


కార్తీక్: దీప మీకోసం నేను మీ ఇంటికి వెళ్లాను. తాళం వేయడంతో మీ ఊరు వెళ్లారు అనుకున్నా. అర్థం చేసుకొని తిరిగి వచ్చినందుకు థ్యాంక్స్.
దీప: ఇంతకీ మీరు నా కోసం ఎందుకు వెళ్లారు బాబు. 
కార్తీక్: బంగారం గాజులు, ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. అప్పుగా తీర్చమని అంటాడు. అంత కోపం బాధలోనూ నిజాయితీని వదులుకోలేదు అంటే మిమల్ని మించిన నమ్మకమైన మనిషి ఎవరు ఉంటారు చెప్పండి. 
దీప: నేను ఇంటికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి బాబు. అవన్నీ మీకు చెప్పలేను కానీ అందులో ఒక కారణం అయితే మీకు జ్యోత్స్నకు జరగబోయే పెళ్లి బాబు. గురువారమే నిశ్చితార్థం అని సుమిత్రమ్మ గారు చెప్పారు. 
కార్తీక్: అది జరగదు లెండి. నిశ్చితార్థం జరగడం లేదు దీప. ఎందుకంటే జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తను కేవలం నా మరదలు మాత్రమే. తనని భార్యగా చూడలేను. 
దీప: ఈ విషయం మీ అమ్మగారికి నాన్న గారికి తెలుసా.
కార్తీక్: ఇంకా ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేను మా మామయ్య అత్తయ్యతో చెప్పడానికి వచ్చా. 
దీప: ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కార్తీక్ బాబు. వేరే ఎవర్ని అయినా ప్రేమించారా. పోనీ ఎవర్ని అయినా పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చారా.
కార్తీక్: లేదు దీప. 
దీప: జ్యోత్స్న మీకు నచ్చకపోవడానికి కారణం ఏంటి. తను స్వయాన మీ మరదలు. తను పుట్టక ముందే మీరు భార్యభర్తలని నిర్ణయించారు. తప్పు చేస్తున్నారు కార్తీక్ బాబు. ఇదే గనుక చేస్తే ఇది మీరు చేసిన మూడో తప్పు అవుతుంది. నా తండ్రి చావుకి మీరు కారణం కాదు. కానీ  నాకు నిజం తెలియకపోవడం వల్ల నింద మీరు మోశారు. ఇది మీ మొదటి తప్పు. నా బిడ్డని కాపాడటానికి ఏ కారణం లేనట్లు నేను తండ్రిని అని చెప్పారు. పాప వినలేదు అని అర్థమైంది కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను. ఇది మీ రెండో తప్పు. జ్యోత్స్న చిన్నప్పటి నుంచి మీ మరదలు. మీ మేనకోడలే కదా. ఇన్నాళ్లలో ఒక్కసారి ఈ విషయం ఎందుకు చెప్పలేదు బాబు. మీ కారణాలు మీకు ఉంటాయి బాబు. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం నాకు మిమల్ని అడిగే అర్హత లేదు కానీ అడుగుతున్నాను. ఎందుకు అంటే నాతో అలా అడిగించే పరిస్థితి తీసుకొచ్చారు. నేను భార్యగా చనిపోయాను. మనిషిగా మీరు చంపేశారు. ఇప్పుడు నా కూతురికి తల్లిగా నేను చనిపోకుండా ఉండాలి అంటే మీరు ఈ పెళ్లి చేసుకోవాలి. మీరు ఎవరి కోసం బతుకుతున్నారో నాకు తెలీదు. కానీ జ్యోత్స్న మాత్రం మీకోసమే బతుకుతుంది. ఈ పెళ్లి ఆగిపోతే మీరు కారణం చెప్పాలి. నచ్చలేదు అన్న మాట సరిపోదు బాబు. మీ దగ్గర ఇంకేమైనా కారణం ఉందా. 
కార్తీక్: కారణం లేదు దీప.
దీప: మీరు చెప్పకుండా కారణం వాళ్లకి తెలుస్తుంది బాబు. మీరు హాస్పిటల్‌లో ఏ కారణం చెప్పారో అదే వాళ్లకి తెలుస్తుంది. అప్పుడు మీరు ఈ పెళ్లి ఎందుకు వద్దు అంటున్నారో వాళ్లకి అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్తా అంటారు. కానీ అది చెప్పడం కష్టం. మీరు చేయని తప్పునకే అర్థమయ్యేలా చెప్పడానికి సంవత్సరం పట్టింది. ఇప్పుడు మీరు అన్న మాట ఎందుకు అన్నారో చెప్పడానికి వివరించినా అవతలి వాళ్లకి అర్థం కాదు. అదే నిజం అనుకుంటే నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటి. మీరు చేస్తున్న పనికి నేను కూడా సమాధానం లేని ప్రశ్నలా మిగిలిపోయేలా ఉన్నాను. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తల్లి పుట్టింటి గురించి తెలుసుకున్న రామ్.. అమ్మమ్మ, మామలను పట్టుకొని ఎమోషనల్..!