Trinayani Today Episode విక్రాంత్ సుమనను పక్కన కూర్చొపెట్టి తనకు చాలా సంతోషంగా ఉందని, చాలా రోజుల తర్వాత విశాల్ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వాడని చెప్తాడు. పెద్దమ్మ కోసం తపించే తన అన్నకు పెద్దమ్మ పువ్వు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందని అంటాడు. దానికి సుమన పువ్వు ఇస్తే ఏదో ఇంద్రనీలం ఇచ్చినట్లు సంబరపడతారేంటని ప్రశ్నిస్తుంది. అది ఎందుకు ఇస్తారని విక్రాంత్ అడిగితే.. మీ పెద్దమ్మ చచ్చి స్వర్గానికే వెళ్లుంటుంది కదా అంటుంది. దాంతో విక్రాంత్ కోపంగా నిన్ను కొట్టి అక్కడికే పంపిస్తానని సీరియస్ అవుతాడు. మరోవైపు తిలోత్తమ హాల్‌లో ఉంటే గంటలమ్మ వస్తుంది.


తిలోత్తమ: గంటలమ్మ నువ్వు ఇంట్లోకి చొరబడితే వీళ్లు నీ గంట కొట్టేలా ఉన్నారు.
గంటలమ్మ: వెళ్లిపోతాలే.. ముఖ్యమైన విషయం చెప్పి నీకు సాయం చేయాలని వచ్చా. అని తిలోత్తమ చేతిలో విభూది పొడి ఇస్తుంది. గాయత్రీ పాప పడుకొని మంచం కోళ్లకి ఈ విభూదితో బొట్లు పెట్టు. పెడితే మంచం గాల్లో లేచి ప్రయాణం మొదలవుతుంది. పుర్రెలదిబ్బకు చేరుకుంటుంది. అక్కడ రక్త చాముండి విగ్రహం ఉంటుంది.
తిలోత్తమ: గాయత్రీ అక్కడికి వెళ్తే నాకు వచ్చే లాభం ఏంటి.
గంటలమ్మ: ఆ బిడ్డని కాపాడటానికి గాయత్రీదేవి ఆత్మ పుర్రెలదిబ్బకి వస్తుంది. అక్కడికి వెళ్లిన మనుషులే తిరిగి రారు. ఆత్మకి తిరుగు ప్రయాణం రాదు.
తిలోత్తమ: అర్థమైంది గాయత్రీ పాపకి ఏమైనా పర్లేదు కానీ గాయత్రీ అక్కయ్య ఆత్మని తరలించేయాలి. 


ఇంతలో నయని, హాసినిలు నవ్వుకుంటూ వస్తారు. దాంతో తిలోత్తమ గంటలమ్మని సోఫా మీద పడుకో పెట్టి గంటలమ్మకు ముసుగు వేస్తుంది తిలోత్తమ. ఇక అందరూ రావడంతో వల్లభకు చలి జ్వరం అని తిలోత్తమ మాట్లాడుతుంది. గంటలమ్మ కూడా వల్లభలా మాట్లాడుతుంది. ఇక సుమన తిలోత్తమ చేతిలో అరటి ఆకులో ఉన్న విభూది చూస్తుంది. ఏంటని ప్రశ్నిస్తుంది. ప్రసాదం అని పక్కింటావిడ ఇచ్చిందని తిలోత్తమ చెప్తుంది. ఇక హాసిని తన భర్తకు సేవ చేయమని సుమన అంటుంది. అవసరం లేదు అని తిలోత్తమ అందర్ని పంపేస్తుంది.  వెళ్తూ వెళ్తూ నయని, హాసినిలు అది గంటలమ్మ అని గుర్తిస్తారు. ఇక హాసిని కావాలనే ఒక్క సారిగా పతి సేవ చేస్తాను అని అంటుంది. హాసిని పరుగున వచ్చి గంటలమ్మ మీద గెంతుతుంది. తిలోత్తమ చాలా కంగారు పడుతుంది. అందరూ వల్లభ పోయాడా అని పిలుస్తారు. ఇంతలో వల్లభ గాయత్రీ పాపని ఎత్తుకొని ఎంట్రీ ఇస్తాడు. 


విక్రాంత్: బ్రో నువ్వు ఇక్కడున్నారేంటి. 
వల్లభ: ఈ పిల్ల నా షర్ట్ పట్టుకొని హాల్‌లోకి వెళ్దామని సైగలు చేస్తుంటే ఎత్తుకొని వచ్చాను. 
విశాల్: అన్నయ్య మరి ఇక్కడ.
నయని: మీరే చెప్పాలి అత్తయ్య. ఇందాక నుంచి పెద్దబావగారికి చలి జ్వరం అని దుప్పటి కప్పుతూనే ఉన్నారు. కదా.
విశాల్: అమ్మ ఏంటి ఇది ఎవరు అది ఏం జరుగుతుంది. 
సుమన: పెద్ద బావగారిలా మాట్లాడారు కదా.
తిలోత్తమ: అవును నేను కూడా వీడే అనుకున్నారు. మీరు వెళ్లండి నేను నా కొడుకులా మాట్లాడి మ్యానేజ్ చేసిన ఈ దొంగ గాడిద ఎవరో అని నేను చూస్తాను. 


గాయత్రీ పాప దుప్పటిని లాగేస్తుంది. గంటలమ్మ బయటకు వస్తుంది. అందరూ షాక్ అవుతారు. దున్నపోతులా నా మీద పడ్డావని హాసినిని గంటలమ్మ తిడుతుంది. ఇక విశాల్ గంటలమ్మని ఎందుకు దుప్పటి కప్పావని అడుగుతాడు. తిలోత్తమ వల్లభ అనుకొని అలా చేశానని అంటుంది. దానికి తెలీకుండా ఇంత నాటకం జరగదని విక్రాంత్ అంటాడు. దాంతో గంటలమ్మ ఈ ఇంట్లో ఉన్న ఆత్మ ఈరోజు రాత్రికి వెళ్లిపోతుందని అంటుంది. 


విశాల్: ఇంటి నుంచి అమ్మ ఆత్మ ఈరోజు రాత్రి విడిచి వెళ్లుపోతుందని గంటలమ్మ ఎందుకు చెప్పింది. అసలు అమ్మ నన్ను వదిలిపోతుందా. 
నయని: ఇది తేలికగా తీసుకోకూడదు. 
విశాల్: అమ్మ ఆత్మ కనిపిస్తే జాగ్రత్తగా ఉండమని చెప్పు.
నయని: పక్కింటి సరళ ప్రసాదం ఇచ్చిందని చెప్పిన తిలోత్తమ ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోవాలి. ప్రసాదం వాసన రావాలి కానీ రాలేదు అంటే అది ప్రసాదం కాదు. 


ఇక హాసిని గాయత్రీ పాపని చూసి వెళ్తూ వెళ్తూ గాయత్రీ పాపని చూసి పోయి వస్తానే పిల్లా అని ఎందుకు అనిందని హాసిని అడుగుతుంది. దానికి నయని ఓ వైపు గాయత్రీ దేవి ఆత్మని మరోవైపు ఆ ఆత్మ ఉన్నదేహాన్ని కాపాడుకోవాలి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తల్లి పుట్టింటి గురించి తెలుసుకున్న రామ్.. అమ్మమ్మ, మామలను పట్టుకొని ఎమోషనల్..!