Seethe Ramudi Katnam Today Episode సుమతి తన మేనత్తని రామ్, ప్రీతిలు తన మేనత్త సుమతి పిల్లలని సీత మహాలక్ష్మి ఫ్యామిలీకి చెప్తారు. విద్యాదేవి సంతోషిస్తే మహాలక్ష్మి గుండెల్లో పిడుగులు పడినట్లు షాక్ అయిపోతుంది. మహాలక్ష్మి కళ్లు తిరిగి పడిపోబోతే జనా, అర్చనలు పట్టుకుంటారు. చలపతి, రేవతిలు నువ్వు సుమతి రక్త సంబంధానివా అని పొంగిపోతారు.
జనార్థన్: నువ్వు నా సుమతి మేనకోడలివా సీత. సుమతి ఇప్పుడు బతికి ఉంటే ఎంత గానో సంతోషించేది.
రామ్: అమ్మ బతికే ఉంది.
జనార్థన్: ఏమన్నావ్ రామ్ మీ అమ్మ బతికే ఉందా.
సీత: అవును మామయ్య మా అత్తమ్మ బతికే ఉంది. ఈ మధ్యనే మా నాన్న వాళ్ల ఇంటికి వచ్చి వెళ్లిందంట.
రేవతి: నువ్వు చెప్పింది నిజమా సీత. సుమతి వదిన బతికే ఉందా.
సీత: కారణం తెలీదు కానీ అత్తయ్య ఎందుకో మనందరికీ దూరంగా వెళ్లిపోయింది. ఒకటి రెండు సార్లు మా నాన్న వాళ్లకి ఫోన్ చేసింది.
జనార్థన్: సుమతి బతికే ఉందా. తను ఎందుకు మన దగ్గరకి రాలేదు. మనకు ఎందుకు దూరంగా ఉంది.
విద్యాదేవి: మనసులో మీ కళ్లెదురుగానే ఉన్నానండి. కానీ మీరు గుర్తు పట్టలేనట్లుంది.
రామ్: ఎక్కడున్నా అమ్మని పట్టుకునే ప్రయత్నం చేస్తానని మామయ్య మాటిచ్చారు నాన్న. మనం కూడా వెతుకుదాం.
సీత: అత్తయ్య ఈ చుట్టు పక్కలే ఉంటుంది. వెతికితే దొరుకుతుంది మామయ్య.
జనార్థన్ మహాలక్ష్మికి తన సంతోషాన్ని చెప్పుకొని ఆనంద పడతాడు. చెప్పలేని సంతోషంగా ఉందని అంటాడు. మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. మహా సుమతి ఫొటో ఎదురుగా నిల్చొంటుంది. అందరూ అక్కడికి వస్తారు.
మహాలక్ష్మి: సారీ సుమతి ఇన్నాళ్లు నువ్వు చనిపోయావు అనుకున్నాను. చాలా కుమిలిపోయాను. నువ్వు బతికే ఉన్నావు అని తెలియక నీ వర్ధంతి కూడా చేయించాను నన్ను క్షమించు. ఇంత కాలం తర్వాత నీ గురించి నిజం తెలిసింది. నిన్ను ఎప్పుడు కలుస్తానా అని ఆత్రుతగా ఉంది. నువ్వు ఎక్కడున్నా త్వరగా మా ముందుకు రావాలి అని మనసారా కోరుతున్నాను సుమతి.
సీత: మనసులో.. మహాలక్ష్మి అత్తయ్య ఏదో నాటకం మొదలు పెట్టినట్లుంది.
విద్యాదేవి: మనసులో.. ఎంత బాగా నటిస్తున్నావు మహాలక్ష్మి. ఈ నటనతోనే నా జీవితం నాశనం చేశావు.
మహాలక్ష్మి: నువ్వు నాకు అప్పగించిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నాను సుమతి. నువ్వు తిరిగి వచ్చి ఇదంతా చూడాలి సుమతి.
అర్చన: మనసులో.. నిజంగానే మహాలక్ష్మి మారిపోయిందా ఏంటి. సుమతిని చంపేస్తా అంది.
విద్యాదేవి: సుమతిని మీరు అంత ఇష్టపడుతుంటే సీతని కూడా అంతే ఇష్టపడాలి.
రేవతి: అవును ఇన్నాళ్లు సీత బయట నుంచి వచ్చిందని సరిగా చూడలేదు. కానీ ఇప్పుడు సీత సుమతి వదిన మేనకోడలు అని తెలిసింది కాబట్టి ఇక ఈ ఇంట్లో సీతకి అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి.
మహాలక్ష్మి: మనసులో.. సుమతి నువ్వు ఎక్కడున్నా నిన్ను ఈ ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వను.
జనార్థన్: ఇక మనం సుమతిని వెతకాలి.
సీత: త్వరలోనే అత్తమ్మని తీసుకొస్తాం.
విద్యాదేవి: నేను ఎక్కడో లేను సీత ఇక్కడే ఉన్నాను. మిమల్ని ఎక్కువ వెతకనివ్వను. తొందరలోనే నా గురించి చెప్పేస్తా.
సీత రామ్‌ని తీసుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇక బావ మరదళ్లు అలా ఉండాలి అని చలపతి అనుకుంటాడు. దాంతో దంచవే మేనత్త కూతురా అంటూ పాటకు సీత, రామ్‌లు డ్యాన్స్ చేసినట్లు చలపతి ఊహించుకుంటాడు. ఇక కింద చలపతి, వాచ్‌మెన్ సాంబ అదే పాటకు డ్యాన్స్ చేస్తారు. మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. సీత, రామ్‌లు ఫ్రెష్ అయి వస్తే చలపతి దంచవే మేనత్త కూతురా అని పాడుతాడు. సీత కూడా డ్యాన్స్ చేస్తుంది. ఆపమని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. విద్యాదేవి అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఈ శుభ సమయంలో సీత, రామ్‌లకు ఫస్ట్ నైట్ చేయమని విద్యాదేవి చెప్తుంది. చలపతి, రేవతిలు విద్యాదేవికి సపోర్ట్ చేస్తారు. జనార్థన్ కూడా ముహూర్తం పెట్టిద్దామా అని అడిగితే మహాలక్ష్మి తాను అదే అనుకుంటున్నానని ముహూర్తం పెట్టిద్దామని అంటుంది. మహా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీతతో రేవతి, విద్యాదేవి ఆటపట్టిస్తారు.
ఇక శివకృష్ణ ఫ్యామిలీ సుమతి కుటుంబం గురించి మాట్లాడుకుంటారు. ఇక సీత తండ్రికి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి చాలా ఇబ్బంది పడుతుంది. ఇకపై ఆమెను ఇంకా ఇబ్బంది పెడతాను అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.