Satyabhama Today Episode విశాలాక్షి పిల్లల్ని పట్టుకొని బాధ పడుతుంది. మరోజన్మ అంటూ ఉంటే ఆడపిల్లలా పుట్టకూడదని మన వల్లే ఈ నాన్నకి ఈ ఇబ్బందలని సంధ్య అంటుంది. ఇంతలో హర్ష వస్తాడు. అల్లుడి సాయంతో ఈ సమస్య నుంచి బయట పడదామని విశాలాక్షి అంటుంది. 


హర్ష: సమస్య చేయి దాటి పోయినప్పుడు బావ గారి సాయం అడుగుదాం. అంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. బావగారిని ఇబ్బంది పెట్టొద్దు.
సంధ్య: బావగారు దేనికి ఇబ్బందిగా ఫీలవ్వరు.
హర్ష: ఏ నాన్నని విడిపిస్తాను అని నా మీద నమ్మకం లేదా. అంటే నా ఉద్దేశం బావగారికి కూడా వాళ్ల ఇంట్లో వాళ్ల వల్ల ఇబ్బంది ఉంటుందని.
సత్య: అలా అని నీకు బావ చెప్పారా.
హర్ష: లేదు. సరే మనం లాయర్ దగ్గరకు వెళ్దామా. మన ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రకాశ్ అంకుల్ దగ్గరకు. 
సత్య: మనసులో.. మా విడాకుల విషయం నోరు జారేస్తాడా.. ఇరుక్కుపోతామా. 
హర్ష: మనం లాయర్ గారి దగ్గరకు బావగారిని తీసుకెళ్లకూడదు. కొన్ని కొన్ని విషయాలు బావగారికి తెలీకూడదు. ఇలా అంటున్నాను అని ఏం అనుకోవద్దు. 
విశాలాక్షి: అల్లుడు గారిని వదిలేసి ఎలా వెళ్తారురా అడిగితే ఏం చెప్తాం.


ఇంతలో క్రిష్ వచ్చి తనకో చిన్న పని పడిందని వెళ్తానని అంటాడు. ఇక క్రిష్‌ వచ్చేలోపు వచ్చేద్దామని సత్య, హర్ష బయల్దేరుతారు. ఇంతలో నందిని వచ్చి నేను వస్తాను. నన్ను దూరం పెడుతున్నారని అంటుంది. తనకు చాలా బాధగా ఉందని ఫీలవుతుంది. కోడలి కన్నా కూతురికే విలువ ఎక్కువ ఉందని అంటుంది. ఈ ఇంట్లో తోబుట్టువులను సొంత వాళ్లలా చూసుకుంటామని అంటాడు. నందిని తనని తిడతాడు. పట్టించుకోడు అని ప్రేమగా దగ్గరకు వెళ్లినా ఇబ్బంది పెడుతున్నాడు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇక హర్ష సత్య లాయర్ దగ్గరకు వెళ్తారు. 


క్రిష్: మీ అన్న కాళీ గాడు నా చేతిలో చావాల్సినోడు. పోనీలే అని జాలి పడి వదిలేశా. కానీ చావు వాడిని వదల్లే. చేసిన పనికి చనిపోయేలా చేసింది. నాకు మీ మీద కోపం లేదు పగ లేదు. అలా అని ప్రేమ దయ లేదు. మీకు కాళీ చరిత్ర అంతా తెలుసు. నేను అడిగిన దానికి బుద్ధిగా సమాధానం చెప్తే బతికుంటారు. లేదంటే మీ అన్న దగ్గరకు పోతారు. కాళీ గాడు మా మామయ్యను ఎందుకు బెదిరించాడు. అసలేం జరిగింది చెప్పరా. 
రౌడీ: సత్య వదిన చెంప దెబ్బ కొట్టిందని కాళీ పగ పెంచుకున్నాడన్న. ఇరవై లక్షలు ఇస్తావా నీ చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా అని బెదిరించాడన్న. తప్పన్నా అని చెప్పినా నా మాట వినలే. మొన్న రాత్రి సార్ కాల్ చేసి ఓ జాగాకి రమ్మన్నాడు. పైసలు ఇస్తాడని కాళీ వెళ్లాడు. అంతే అన్నా.
క్రిష్: రేయ్ ఒత్తి పుణ్యానికి 20 లక్షలు ఎవరు ఇస్తారురా. ఏదో బ్లాక్ మెయిల్ చేశాడు అదేంటో చెప్పరా.
రౌడీ: నాకు తెలీదన్నా నిజం అన్నా. 
క్రిష్: రేయ్ చెప్తావా పాతి పెట్టమంటావా. 


క్రిష్ ఎంత అడిగినా రౌడీలు ఇంకేం చెప్పరు. ఇక ఇద్దరు రౌడీలు సత్యని కిడ్నాప్ చేసిన విషయం క్రిష్‌కి చెప్పేద్దాం అంటే మరో రౌడీ వద్దు అంటాడు. ఆ నిజం చెప్తే క్రిష్ చంపేస్తాడని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక హర్ష, సత్య లాయర్ దగ్గరకు వెళ్తారు. లాయర్ సత్యని చూసి విడాకుల కోసం వచ్చిందని అన్నతో వచ్చింది అంటే పుట్టింటి వారికి విడాకుల గురించి తెలిసిపోయిందా అనుకుంటాడు. సత్య తన అన్న గురించి తెలిసిపోతుందేమో అని కంగారు పడుతుంది. లాయర్ విడాకుల గురించి మాట్లాడుతాడు. కానీ హర్షకి అర్థం కాదు. ఇంతలో హర్షకి ఫోన్ రావడంతో బయటకి వెళ్తాడు. ఈ లోపు సత్య లాయర్‌తో ఆ కేసు గురించి మాట్లాడొద్దని అంటుంది. ఇక హర్ష తన తండ్రి పోలీస్ కస్టడీలో ఉన్నారని జరిగింది అంతా లాయర్‌కి చెప్తాడు. దానికి లాయర్ విశ్వనాథాన్నే తిడతాడు. చిన్న విషయాన్ని పెద్దది చేశాడని అంటారు. తాను మాట్లాడుతానని లాయర్ అంటాడు. విశ్వనాథాన్ని విడిపించడం తన బాధ్యత అని చెప్తాడు. ఇక ఫీజ్ అని హర్ష అడిగితే కేసు గెలిచాక ఇంటికి వస్తా భోజనం పెట్టమని మీ అమ్మకి చెప్పు అని అంటాడు. సత్య, హర్ష చాలా సంతోషిస్తారు.


నందిని డల్‌గా ఉంటే విశాలాక్షి భోజనం తీసుకొని వెళ్లి బుజ్జగిస్తుంది. నందినికి మంచి మాటలు చెప్తుంది. నందిని కూడా తాను తగ్గే ఉన్నాను అని అయినా తన మీద కోప్పడుతున్నాడని ఫీలవుతుంది. హర్ష టెన్షన్‌లో ఉన్నాడని ఇలాంటప్పుడే నువ్వు తనని అర్థం చేసుకోవాలని చెప్తుంది. హర్ష చెల్లి కోసం స్వార్థంగా నిన్ను పెళ్లి చేసుకున్నా స్వార్థం లేకుండా నిన్ను ఇష్టపడుతున్నాడని.. కాల్ చేసి నందిని అలిగి తినదేమో దగ్గరుండి తినిపించమని నన్ను పంపాడని చెప్తుంది. హర్షని పెళ్లి చేసుకొని నువ్వు నష్టపోలేదని మంచి వ్యక్తినే పెళ్లిచేసుకున్నావని ముందు ముందు నీకే అర్థమవుతుందని నందినికి తినిపిస్తుంది. ఇక క్రిష్ ఇంటికి వస్తాడు. సత్యని పిలుస్తాడు. సత్యని పిలిస్తే వెళ్తామని అంటే సత్య బయటకు వెళ్లిందని విశాలాక్షి చెప్తుంది. లాయర్ దగ్గరకు వెళ్లిందని అంటే తనకి చెప్పుంటే వెళ్లేవాడిని అంటాడు క్రిష్ దానికి అతని అత్తమ్మ అనుకోకుండా వెళ్లారని కవర్ చేస్తాడు.


క్రిష్:  లేదు బామ్మర్ది కావాలనే నన్ను అవాయిడ్ చేశాడు. ఆ మాత్రం తెలుసుకోలేని పిచ్చోడు కాదు నేను. ఇంతలో హర్ష సత్య వచ్చేస్తారు. ఇద్దరినీ క్రిష్ అనుమానంగా చూస్తాడు. ఇక సత్య తల్లి సత్యతో ప్రకాశ్ అంకుల్ ఏమన్నాడమ్మా అంటే క్రిష్ ఆ బొండాం లాయరా అని అంటాడు. దానికి విశాలాక్షి నీకు తెలుసా బాబు అని అడుగుతుంది. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారని సంధ్య అడుగుతుంది. ఇక హర్ష ఆయనతో మాట్లాడితే మాకు చాలా ధైర్యం చెప్పాడని బెయిల్ మీద రేపు తీసుకొస్తానని చెప్పారని చెప్తారు. ఇక శుభవార్త చెప్పారని విశాలాక్షి అంటుంది. ఇక సత్య, క్రిష్ చెప్పకుండా వచ్చాం బాపు ఏం అంటారో అని సత్య, క్రిష్ బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


 Also Read: సత్యభామ సీరియల్: వియ్యంకుడిని జైలులో ఉంచాలని మహదేవయ్య ప్లాన్.. బామ్మర్దిని అనుమానించిన క్రిష్, నిజం తెలుసుకుంటాడా!