Satyabhama Today Episode: క్రిష్ సత్యని చూస్తాను అని ఇంటికి వెళ్తే వద్దు అని విశ్వనాథం, విశాలాక్షి అడ్డుకుంటారు. జరిగిన సంఘటనలతో సత్య ఇప్పటికే మానసికంగా కృంగిపోయింది అని దానిని ఓదార్చలేక దాని పక్కనే బిక్కు బిక్కు మంటూ కూర్చొన్నామని విశాలాక్షి చెప్తుంది. ఇప్పుడు నువ్వు సత్యకు ఎదురుపడితే అది మాకు ఇక దక్కదు అని విశాలాక్షి ఏడుస్తుంది.
క్రిష్: ఆంటీ నా కళ్లలో నీళ్లు కనిపించడం లేదా.. నా కళ్లలో నిజాయితీ కనిపించడం లేదా.. నా బాధ మీకు అర్థం కావడం లేదు. సార్ ఎందుకు నన్ను మీరు నమ్మడం లేదు..
విశ్వనాథం: ఎందుకు అంటే మేక తోలు కప్పుకున్న పులివిరా నువ్వు ఎలా నమ్మమంటావు.
క్రిష్: నా గుండె నిండా సత్యనే ఉంది సార్.
విశ్వనాథం: కాదు సత్య అంటే ద్వేషం ఉంది. పగ ఉంది. ఎలా అయినా తనని సొంతం చేసుకొని కసి తీసుకోవాలి అనుకున్నావ్.
విశాలాక్షి: ప్రేమించిన వాడు ఎవడూ మనిషి ప్రాణాలు తీయడు. దూరంగా ఉన్నా సరే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అది నీకు తెలీదా. చూడు బాబు మేం చాలా బలహీనులం.. నువ్వు చాలా బలవంతుడివి అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించి ఎమైనా చేస్తావ్. నిన్ను కానీ నీ వాళ్లని కానీ ఎదురించే ధైర్యం కానీ మాకు లేదు బాబు. వెళ్లిపోబాబు.. మా జీవితాల నుంచి వెళ్లిపో.
క్రిష్: సార్ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఇదిగో ఈ కత్తితో నన్ను పొడిచేయండి. అంతేకానీ ఇలాంటి మాటలు అనొద్దు. సత్య నుంచి నన్ను దూరం చేయొద్దు. సార్ ఒక్కసారి సత్యను నన్ను కలవనివ్వండి.
విశాలాక్షి: బాబు నీ తల్లిలాంటిదాన్ని నా బాధని అర్థం చేసుకోబాబు. నా కూతురు జీవితంతో ఆడుకోకు. నాకు కడుపుకోత మిగల్చకు. చిన్న వాడివి అయినా నీ కాళ్లు పట్టుకుంటాను.
సత్య: బయట అమ్మా వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు. సత్య వచ్చే టైంకి క్రిష్ వెళ్లిపోతాడు. ఏంటమ్మ బయట ఎవరితో మాట్లాడుతున్నారు అని సత్య అడుగుతుంది. కూరగాయల వాడితో అంటే అనుమానంతో తలుపు తెరచి చూస్తుంది. ఎవరూ ఉండరు. మరోవైపు మహదేవయ్య మినిస్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతాడు.
మహదేవయ్య: ఆ మినిస్టర్ ఎల్లుండి ముహూర్తం బాగుంది అని చెప్పాడు. నేను ఒప్పుకున్నాను.
భైరవి: ఎందుకు ఒప్పుకున్నావ్. ఇంకా ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు. ఎలక్షన్ అయినాక పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాం కదా..
మహదేవయ్య: క్రిష్: ఆ మినిస్టర్‌ని మన చేతిలో పెట్టుకోవాలి అంటే పూలపళ్లు కార్యక్రమం పెట్టుకోవాలి. అప్పుడే మనం ఏం చెప్తే అది వింటాడు.
దేవా: బాపూ చెప్పేది నిజమే అమ్మ ఆ కార్యక్రమం అయితేనే మన మాట వింటాడు.
మహదేవయ్య: రా చిన్నా రా సమయానికి వచ్చావ్ ఎల్లుండి ఎక్కడికి వెళ్లొద్దు.
క్రిష్: ఎందుకు బాపూ..
నందిని: అన్న ఆ రోజు నీకు నిశ్చితార్థం.. ఇప్పుడే మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడు.
దేవా: ఈ రెండు రోజులు నీ పనులు పక్కన పెట్టి ఇంట్లోనే ఉండు. మినిస్టర్‌తో సంబంధం అంటే మనోలే కాదు పగోలు ఆలోచిస్తూ ఉంటారు.
భైరవి: అరే చిన్నా నీకు మీ బాపూ అంటే ఎంత ఇష్టమో ఆ దేవుడికి కూడా తెలిసినట్లు ఉంది. అందుకే నీ నిశ్చితార్థంతో మీ బాపూ ఎమ్మెల్యే అవుతారు.
క్రిష్: ఏంటి బాపూ ఇది ఎంత సేపు మీ రాజకీయాలు ఏనా.. నా ఇష్టాలు ఏంటీ అని సోచాయించరా..
దేవా: ఏంటి చిన్నా నీకు మినిస్టర్ కూతురుకి లగ్గం అని మొన్నే అనుకున్నాంకదా.
క్రిష్: మీరు అనుకుంటే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాలి కదా.. నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి అంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా.
దేవా: చిన్నా ఏం మాట్లాడుతున్నావ్ రా.. మినిస్టర్ కూతురితో పెళ్లి అని బాపూ మాట ఇచ్చాడు. ఇప్పుడు ఇలా అంటే ఏంటి అర్థం..
క్రిష్: ఇష్టం లేదు అని అర్థం అన్న.. ఆ మినిస్టర్ తన కూతురుకి ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నాడు. మరి మీరు ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోసం నన్ను వాడికి అమ్మేస్తున్నారు.
మహదేవయ్య: చిన్నా..
క్రిష్: నిజమే కదా బాపూ లేకపోతే నువ్వు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావ్ చెప్పు. లేకపోతే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని నాకు ఒక్కరైనా అడిగారా.. నన్ను అడగకుండా మీరు మాటిస్తే ఇప్పుడు ఎలా కుదురుతుంది. అయినా మీరు ఆలోచించాల్సింది ఎమ్మెల్యే సీటు కోసం కాదు నా ప్రేమ గురించి. నేను నాకు తెలీకుండానే ఒక తప్పు చేశా. నేను ప్రేమించిన అమ్మాయి నా వల్ల చావు అంచుల వరకు పోయింది. అందుకే వాళ్ల నాన్న నన్ను నమ్మడం లేదు. అందుకుని..
దేవా: అందుకని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.
క్రిష్: బాపూ పెద్దమనిషిగా వాళ్ల ఇంటికి వెళ్లి నేను నిజాయితీగా ప్రేమించాను అని చెప్పి వాళ్ల నాన్నని పెళ్లికి ఒప్పించాలి.
దేవా: ఎవరూ ఎక్కడికి వెళ్లేది లేదు. అయిందేదో అయింది ఆ అమ్మాయిని మర్చిపోయి మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకో.
క్రిష్: కావాలి అంటే నా ప్రాణాలు ఇవ్వమని చెప్పినా ఇస్తా.. నేను సత్యని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. నేను ఒకసారి డిసైడ్ అయ్యాక ఎవరి మాట వినను అని మీ అందరికీ బాగా తెలుసు. నేను ప్రాణాలతో ఉండాలో వద్దో మీరే డిసైడ్ చేయండి.
మహదేవయ్య: భైరవి గొంతు పట్టి.. వాడు ఇష్టమొచ్చినట్లు తిరుగుతుంటే అది తెలుసుకోకుండా ఏం మాట్లాడాం అని నేను నిన్ను అడిగానా.. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చిన్నా మనసు మారాలి. ఆ పెళ్లికి ఒప్పుకోవాలి. అది తల్లిగా నువ్వే చేయాలి..
సత్య: సంధ్య నేను చేయని తప్పునకు నా కుటుంబం మొత్తం కష్టపడుతుంది. ఆ ఆలోచన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
విశాలాక్షి: ఏవండీ మాధవ్‌కి నయం అయ్యాక వాళ్లు మనసు మార్చుకుంటారేమో మాట్లాడండి.
విశ్వనాథం: ఏం మాట్లాడమంటావ్.. మన వల్లే కదా విశాలాక్షి మాధవ్ తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. జరగకూడదనిది ఏదైనా జరిగి ఉండుంటే ఆ పాపం మన మెడకు చుట్టుకునేది. కాదు అంటావా.. ఇక వీడు మన ఇంటి ముందు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు కదా వదిలిపెట్టడం లేదు కదా..
హర్ష: దానికి ఒక్కటే పరిష్కారం నాన్న. ఈ సమస్యని అందరూ కొద్ది రోజులు మర్చిపోవాలి అంటే సత్యని కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా దాచేయాలి. పెద్దమ్మ వాళ్ల ఊరు పంపించాలి. లేదంటే ఆ రౌడీ గాడు మనల్ని వదలడు.
సత్య: నేను ఒప్పుకోను నాన్న. అది పారిపోవడమే అవుతుంది.
విశాలాక్షి: సత్య, సంధ్యలు రెడీ అవుతారులే.
సత్య: ఎవరికో భయపడి నేను దాక్కొవాలా.. సరే మీ ఇష్టప్రకారమే పెద్దమ్మ ఊరు వెళ్తాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.