Guppedanta Manasu  Serial Today Episode: శైలేంద్ర తన బినామీలతో కలిసి మనును రౌండప్‌ చేసి బెదిరిస్తాడు. అసలు ఎవరు నువ్వు కాలేజీ కోసం యాభై కోట్లు ఎందుకిచ్చావని అడుగుతాడు. నీకు కాలేజీకి ఎంటి సంబంధం అంటూ నిలదీస్తాడు. దీంతో కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదని మను చెప్పడంతో శైలేంద్ర మరింత ఇరిటేట్‌ అయి మరెందుకు యాభై కోట్ల చెక్కు ఇచ్చావు అని కోపంగా అడుగుతాడు.


శైలేంద్ర: కాలేజీ కష్టాల్లో ఉంటే నీకేంటి? నష్టాల్లో ఉంటే నీకేంటి? పోనీ నా ఫ్యామిలీకి నువ్వేమైనా చుట్టమా? వసుధారకు ఏమైనా చుట్టమా? కాదు కదా? మొత్తం ప్లాన్‌ అంత పాడు చేశావు. లేదంటే ఈ పాటికే వసుధార ఎండీ సీట్‌ లోంచి దిగిపోయేది.


మను: అలా జరగకూడదనే ఇలా చేశాను.


శైలేంద్ర: ఎయ్‌ ఎవడ్రా నువ్వు వాళ్లకు ఆశ చూపించి చెక్‌ చింపేశావు. అసలు మనిషివేనా నువ్వు.  పాపం తగులుతుంది నీకు


మను: పాప పుణ్యాల సంగతి దేవుడెరుగు బాసు. కానీ నువ్వలా మాట్లాడుతుంటేనే చాలా విడ్డూరంగా ఉంది. నేను చాలా మందిని చూశాను కానీ నీలాంటి దుర్మార్గుడిని మాత్రం చూడలేదు.


శైలేంద్ర: అవున్రా నేను దుర్మార్గుడినే ఇక ముందు కూడా దుర్మార్గాలు చేస్తూనే ఉంటాను. ఇక ముందు కూడా కాలేజీని ముంచేస్తాను. నువ్వేమైనా ఆపుతావా?


  అనగానే నీ దుర్మార్గాలకు చరమగీతం పాడుతా అని మను వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. ఎవడెవడో వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు అని ఇప్పుడు ఆ వసుధార పని చూడాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు కాలేజీ హాల్‌ల్లో రిషి ఫోటో పెట్టి కాలేజీ స్టాఫ్‌, స్టూడెంట్స్‌ నివాళి అర్పించబోతుంటే వసుధార వచ్చి వాళ్లను తిట్టి రిషి సార్‌ ఎక్కడో ఒకచోట బతికే ఉన్నారని మీరిలా చేయడం కరెక్ట్‌ కాదని వారిస్తుంది. అయితే మీ మీద మాకు గౌరవం ఉందని కానీ రిషి సార్‌ ఇంకా బతికి ఉన్నాడని మీరింకా భ్రమలో ఉన్నారని  పిచ్చిగా మాట్లాడితే మేము నమ్మలేమని అందరూ చెప్తారు. పిచ్చి వసుధార వాళ్లను రెచ్చగొట్టింది నేనే వాళ్లు నీ మాట అసలు వినరు అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. ఇంతలో అక్కడికి మహేంద్ర, అనుపమ, మను వస్తారు. రిషి ఫోటోకు దండ వేయబోతున్న ఎంప్లాయిని ఆపుతాడు మను.


మను: ఎండీ గారికి ఇష్టం లేకుండా ఇలా చేయడం ఏంటి? ఇది పద్దతి కాదు కదా?


ఎంప్లాయి: పద్దతి కాదు అని మాకు తెలుసు సార్‌ కానీ తప్పదు కదా?


మను: ఇది మీ ఆలోచనేనా? లేక ఎవరైనా చెప్పారా?


ఎంప్లాయి: ఎవరో చెబితే మేమెందకు చేస్తాము సార్‌. మేమే అందరం కలిసి ఏర్పాటు చేశాము.


మను: మీరు చెప్తుంది అబద్దం.


  అంటూ స్టాఫ్‌, స్టూడెంట్స్‌ అందరూ క్లాస్‌కు వెళ్లండి అని చెప్పగానే అందరూ వెళ్తారు.  ఇంతలో మను మేనేజర్‌ వచ్చి సార్‌ మీ క్యాబిన్‌ రెడీ అయింది అని చెప్పగానే మను వెళ్లిపోతాడు. వీడేంట్రా బాబు నాకు శనిలా దాపరించాడు అని మనసులో అనుకుంటాడు.


వసుధార: నేను చెప్తుంటే మీరు పట్టించుకోలేదు. కానీ ఆ మను మనసులో ఏదో కుట్ర ఉంది మామయ్య.  క్యాబిన్‌ నే ఏర్పాటు చేయించుకున్నారు. అసలు ఎవర్ని అడిగి చేయించుకున్నారు. ఎందుకు చేయించుకున్నారు.


మహేంద్ర: అమ్మా తను క్యాబిన్‌ ఎందుకు ఏర్పాటు చేయించుకున్నాడో తెలియదు కానీ నీకు మాత్రం మంచే చేశాడు కదా? నీకు ఇష్టం లేని సంతాపసభని ఆపేశాడు కదమ్మా


వసుధార: మామయ్యా ఆ మను టెక్నిక్‌ అదే ఎవరూ మాట అనకుండా మంచి చేస్తాడు. తర్వాత తన ప్లాన్‌ తను చేసుకుంటూ పోతాడు. తను అనుకున్నదే చేయాలనుకుంటాడు.


  అనగానే అలా ఎలా అనుకుంటావని మహేంద్ర, అనుపమ అంటారు. ఇంతలో అటెండర్‌ వచ్చి బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేశారని మినిష్టర్‌ కూడా వచ్చారని చెప్పడంతో వసుధార షాక్‌ అవుతుంది. ముగ్గురూ కలిసి మీటింగ్‌ హాల్‌ లోకి వెళ్తారు. మినిష్టర్‌ను ఎందుకు మీటింగ్‌ ఏర్పాటు చేశారని వసుధార అడుగుతుంది. ఎండీ పర్మిషన్‌ లేకుండా మీటింగ్‌ ఎవరు అరైంజ్‌ చేశారని శైలేంద్ర అడుగుతాడు. మను చేశారని మినిస్టర్‌ చెప్తాడు. ఇంతలో మను వస్తాడు. మను కాలేజీ బోర్డు డైరెక్టర్‌ గా ఉండాలనుకుంటున్నాడని మినిస్టర్ చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. కాలేజీలో సమస్యల పరిష్కారం కోసమే నేను ఈ పదవి అడుగుతున్నానని చెప్తాడు మను. కాలేజీ ఎదుగుదలను చూడలేని కొంతమంది గుంటనక్కలు కాలేజీ పతనానికి పాల్పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్తాడు. ఆ గుంట నక్క శైలేంద్ర అని మనుకు అర్థం అయినట్లుంది అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?