Satyabhama Serial Today Episode:  ఎన్నికల తనకు కానీ తన  వాళ్లకు కానీ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతుంది సత్య. కానీ జయమ్మ చెప్పడంతో క్రిష్‌ సత్యకు సపోర్టుగా నిలబడతాడు. భయపడవద్దని ధైర్యం చెప్తాడు. అయినా కూడా సత్య వినదు.. మనసులో భయంతోనే ఉంటుంది. అన్నింటికి పరిష్కారం తను ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని అనుకుంటుంది. అదే విషయం బయటకు చెబితే క్రిష్‌ కోప్పడతాడు.


క్రిష్‌: నువ్వు ఎన్నికల్లో చేత కాక తప్పుకుంటున్నావు కానీ బాపు మీద నిందలు వేస్తె ఊరుకోను


సత్య: కానీ ఇప్పటికే  నావల్ల ఒక ప్రాణం పోయింది. ముందు ముందు  ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయోనని భయంగా ఉంది. అందుకే పోటీ చేయడానికి ఇష్టం లేదు.


క్రిష్: అంత ధైర్యం లేని దానివి ఎందుకు నిలబడ్డావు.. ముందే పోటీలో ఉండకుండా ఉండాల్సింది.. అయినా ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు..? నువ్వు ఇంత పిరికిదానివి అని అసలు అనుకోలేదు. నువ్వు ఎన్నికల బరిలో ఉండాల్సిందే..?


సత్య:  ఎందుకు క్రిష్ నువ్వు ఇలా చేస్తున్నావు. నేను ఎన్నికల నుంచి తప్పుంటాను అంటున్న కదా అయిన నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు


క్రిష్‌: నువ్వు నిలబడాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలి.. అక్రమాలను ఆడ్డుకోవాలి. న్యాయాన్ని బతికించాలి.


సత్య: నాకు ఎదురించే దమ్ము లేక కాదు. నా వల్ల ఎవరికి ఏం కాకూడదని.. ఆలోచిస్తున్నాను. అంతే కానీ..


క్రిష్‌: అదంతా కాదు సత్య నువ్వు ఓడిపోయాను అని ఒప్పుకో..


సత్య: నేను ఎలా ఒప్పుకుంటాను క్రిష్‌…


క్రిష్‌: మరి గెలిచి చూపించు నీకు దమ్ముంటే


అని క్రిష్ రెచ్చగొట్టడంతో సత్య పూనకం వచ్చిన దానిలా తాను విత్‌ డ్రా చేయడానికి తీసుకొచ్చిన ఫామ్‌ను చింపి పడేస్తుంది. నేను ఎలక్షన్‌ లో నిలబడతాను గెలుస్తాను  అంటుంది. తర్వాత క్రిష్‌ దగ్గరకు వచ్చిన జయమ్మా నీ భార్య అలిగి వెళ్లిపోయింది వెళ్లి బుజ్జగించుకో అని చెప్తుంది. క్రిష్‌.. సత్య దగ్గరకు వెల్లి చాలెంజ్‌ చేస్తాడు. సత్యను ఒదార్చే ప్రయత్నం చేస్తాడు.


సత్య: నేను ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నువ్వు వద్దన్నావు ఇప్పుడు తప్పకుంటా అంటే నువ్వు వద్దంటున్నావు ఎందుకు నాకు అర్థం కావట్లేదు.


క్రిష్‌: ఇప్పుడు నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు


సత్య మాత్రం ఆ మాట వినదు. ఎలాగైనా క్రిష్‌ను మార్చాలుకుంటుంది. అందుకోసం క్రిష్‌తో గొడవకైనా సిద్దపడుతుంది. సత్య క్రిష్‌ను తిడుతుంటే.. సత్యకు విశాలాక్షి ఫోన్ చేస్తుంది.


విశాలాక్షి: మేమందరం మా మనసు మార్చుకున్నాం. అందరం నీకు సపోర్టుగా నిలవాలని అనుకుంటున్నాం. నీ నామినేషన్ ఫామ్ లో సంతకం చేస్తాము సత్య.  


అంటూ విశాలాక్షి చెప్పగానే.. విశాలాక్షి మాటలకు సత్య హ్యాపీగా ఫీలవుతుంది. ఆనందంతో క్రిష్‌ను హగ్‌ చేసుకుని అతనిపై ముద్దుల వర్షం కురిపిస్తుంది.   


సత్య: మా పుట్టింటి వాళ్ళు సపోర్ట్ గా నిలుస్తున్నారు చాలా సంతోషంగా ఉంది.


క్రిష్‌: అయినా సరే నీకు ఇంకా ఇద్దరి సపోర్టు కావాలి.


సత్య: ఆ ఇద్దరిని కూడా సంపాదించుకుంటాను. ఎలా సంపాదించుకోవాలో నా దగ్గర ఒక ప్లాన్‌ ఉంది.


అని సత్య చెప్తుంటే.. క్రిష్‌ మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఏం  చేయాలో చెప్పండి అంటూ జయమ్మను సలహా అడుగుతుంది సత్య. అయితే ఆ భైరవిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆలోచించాలని అనుకుంటూ ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేస్తారు. తమ ప్లాన్‌ ప్రకారం భైరవిని మన వైపు తిప్పుకోవాలని డిసైడ్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!