Ammayi garu Serial Today Episode: రూప పింకీకి ధైర్యం చెప్తుంది. బాధ పడొద్దని అంటుంది. నా కోసం గోపీ ఇంత చేస్తే ఇంటికి వచ్చిన వాడిని అలా మెడ పట్టుకొని గెంటేయడం ఏంటి అని అడుగుతుంది. నాన్నా సైలెంట్ గాఉన్నారంటే పెళ్లి జరిపించరని ఎలా అనుకోవాలి. పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచిస్తుండొచ్చు కదా అంటూ ఓదారుస్తుంది. నాన్నా పిన్ని బాబాయ్‌లో వాళ్లకు లేనిపోనివి కల్పించి చెప్తున్నారు అంటుంది. మరోవైపు గోపీని ఇంటికి తీసుకెళ్లిన రాజు ఇంట్లో నిజం చెప్తాడు.
విరూపాక్షి: ఆ విజయాంబిక దీపక్‌లు అంత పని చేశారా..? అయినా గోపీ పింకీల పెళ్లి జరిపిస్తానని సూర్య మాటిచ్చాడు కదా రాజు.
అప్పలనాయుడు: పెద్దొల్లు మాటిస్తారు అమ్మగారు. కానీ పాటించరు. ఒకవేళ అయ్యగారు మంచిగా పాటించినా అడ్డుపడటానికి ఆ విజయాంబిక వాళ్లు ఉన్నారు కదా..?
మరోవైపు విజయాంబిక.. దీపక్ ఆలోచిస్తుంటారు.
విజయాంబిక: దీపక్ నువ్వు చెప్పినట్టు మన టైం రివర్స్ అవుతున్నట్టు ఉంది. మందారం బతికే ఉంది. అది కూడా మాయం అయిపోయాడు అనుకున్న ఆ రాఘవ దగ్గరే ఉంది. వాళ్లిద్దరూ ప్రాణాలతో ఉన్నా ఇక్కడికి ఎందుకు రాలేదో అనుమానంగా ఉంది.
దీపక్: అవును మమ్మీ అయినా మందారం సిచ్యుయేషన్ చూస్తుంటే..తను లేచే పరిస్తితుల్లో ఉన్నట్టు గానీ.. మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నట్టు గానీ అనిపించడం లేదు మమ్మీ.. ఆ రాజు రూప లేకుండా ఉండి ఉంటే హాస్పిటల్ లోనే లేపేసేవాణ్ని.. ఈలోగా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రా మమ్మీ..
ముత్యాలు: అయినా గోపీ మేము అందరం ఉండగా నువ్వు నేరుగా అక్కడికి ఎందుకు వెళ్లావు.
గోపి: అన్నయ్యా అక్కడే ఉంటాడనుకున్నాను పెద్దమ్మా.. అక్కడికి వెళ్లాక అర్థం అయింది. అన్నయ్యా వదినలు కలిసి లేరని..
ధనాలు: ఇంత జరిగినా నువ్వు ఇంకా పింకీనే పెళ్లి చేసుకుంటావా..?
విరూపాక్ష: ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అనుకోవడంలో తప్పేం ఉంది ధనాలు.
ముత్యాలు: పెళ్లికి ప్రేమ పునాది… ప్రేమ పెళ్లికి సమాధి అన్నారు పెద్దలు. అది మీ విషయంలోనూ రాజు విషయంలోనూ నిజం అయింది కదా అమ్మగారు.
అని ముత్యాలు చెప్పగానే.. రాజు, రూపను గుర్తు చేసుకుంటాడు. తనతో గడిపిన క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుని ఎమోషనల్ అవుతుంటాడు. మరోవైపు పింకి ఏడుస్తూ.. ఇదంతా నువ్వు రాజు విడిపోవడం వల్లే వచ్చిందక్కా అంటుంది. నేను రాజు విడిపోలేదు పింకీ.. విడిగా ఉంటున్నాము అంతే అంటుంది రూప.
విజయాంబిక: మళ్లీ మన పింకీని ఎలా పంపించాలి తమ్ముడు..
చంద్ర: అన్నయ్యా పిల్లల విషయంలో దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి.
విజయాంబిక: చంద్ర తను ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వాలి కదా..? తమ్ముడు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో.. వెళ్లు..
అని చెప్పగానే సూర్యప్రతాప్ వెళ్లిపోతాడు. మరోవైపు గోపీ పింకిల పెళ్లికోసమైనా నువ్వు రూపకు ఫోన్ చేయ్ రాజు అని అప్పలనాయుడు చెప్తాడు. అటువైపు నుంచి పింకీ కోసం రూప రాజుకు ఫోన్ చేస్తుంది. ఇద్దరూ బిజీ వస్తుందని చెప్తారు. ఇంతలో రూప చేయడంతో రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
రూప: చెప్పు రాజు ఫోన్ చేసినట్టు ఉన్నావు.
రాజు: మీరు కూడా ఫోన్ చేసినట్టు ఉన్నారు.. చెప్పండి..
రూప: చెప్పండినా..?
రాజు: అవును..
రూప: నాకోసమే చెశాను అని చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా…
రాజు: మీ కోసమైతే కాదు పింకీ, గోపీల పెళ్లి కోసం చేశాను.
అని రాజు చెప్పగానే.. అప్పుడు మనం భార్యాభర్తలం కాబట్టి చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదు కదా మనం ఎలా చేస్తాం.. కానీ ఈ పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు అంటుంది రూప. ఎలా చేస్తారు అని రాజు అడగ్గానే.. ఎలా చేస్తానో చెప్పాలి అంటే మనిద్దరం ఒకసారి కలవాలి అంటుంది రూప. రాజు సరే అంటాడు. ఇంతలో లోపలికి వచ్చిన సూర్య ప్రతాప్ ఎవరిని కలుస్తావు అంటూ నిలదీస్తాడు. రూప, పింకీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!