Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లావు మనోహరి అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు అంటూ ఎదురు వస్తుంది భాగీ. వెళ్లిన పని అయినట్టు లేదు. అంటూ ఆరులా మాట్లాడుతుంది భాగీ. దీంతో దూరం నుంచి గమనిస్తున్న గుప్త, ఎదురుగా ఉన్న మనోహరి ఇద్దరూ కూడా ఆరు ఆత్మ భాగీలో దూరింది అనుకుంటారు.


మను: నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు


భాగీ: తప్పుల మీద తప్పులు అంత భయం లేకుండా ఎలా చేస్తున్నావు మను


మను: నేను ఇదంతా నీ మీద కోపంతో చేయలేదు అమర్‌  మీద ప్రేమతో చేశాను.


అని చెప్తూ మనోహరి కిందపడబోతుంటే భాగీ పట్టుకుంటుంది. మనోహరి చేతికి ఉన్న లాకెట్‌ వెలగదు.


మనోహరి: నువ్వు నువ్వే కదా ఇప్పటి దాకా మాట్లాడింది.


భాగీ: నేనే మాట్లాడాను.. ఆరు అక్కా అనుకున్నావా


అని భాగీ చెప్పగానే  మనోహరి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన మనోహరికి అమర్‌ టిఫిన్‌ చేయమని చెప్తాడు. సరేనని చేయి వాష్‌ చేసుకొస్తాను అంటూ అందరినీ టచ్‌ చేస్తుంది. అయినా లాకెట్‌ వెలగదు. టిఫిన్‌ చేసిన తర్వాత తన రూంలోకి వెళ్లిన మనోహరి కోపంగా లాకెట్‌ను విసిరికొడుతుంది. లాకెట్‌ బయట పడుతుంది. అంజు లాకెట్‌ తీసుకుని మనోహరి రూంలోకి వస్తుంది.


అంజు:  ఇది మీదేనా ఆంటీ


మనోహరి: అవును అంజు..


అంజు: అయితే తీసుకోండి ఆంటీ..


మనోహరి తీసుకుంటుంటే అంజు వదలదు.


మనోహరి: వదులు అంజు.. గట్టిగా పట్టుకున్నావేంటి..?


అనగానే అంజు చేతిలో ఉన్న లాకెట్‌ వెలుగుతుంది. మనోహరి షాక్‌ అవుతుంది.


అంజు, ఆరు: వదలమంటావా మను..  నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పటి  నుంచి చూస్తున్న అందర్ని ముట్టుకోవడం దీన్ని చూడటం అంతా గమనించాను ఇక దీని అవసరం నీకు లేదనుకుంటా తీసుకో


అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే మనోహరి ఘోరకు ఫోన్‌ చేస్తుంది.  


మనోహరి: అరుంధతి ఘోర ఆత్మ అంజులో దూరింది.


ఘోర: సరే మనోహరి మంచిది..


మనోహరి: అవును ఘోర ఇప్పుడు ఆత్మను ఎలా బంధిస్తావు. 


ఘోర: నీ పని నువ్వు చేశావు ఇక నా వంతు.. అయినా నువ్వు ఎప్పుడూ ఇలా అడగలేదేం.. ఓహో  నీకు ఇప్పుడు  రెండు మార్గాలు ఉన్నాయి కదూ.. అయినా  నువ్వు నా వైపే ఉన్నావని నమ్మకం ఏంటి..? మనోహరి..


మనోహరి: అది ఘోర నేను చెప్పేది విను..


ఘోర: నేను చెప్పిందే నువ్వు వినాలి మనోహరి..


ఘోర ఎలాగైనా ఆత్మను బంధించకూడదని ఆస్తికలు నదిలో కలపాలని మనోహరి అనుకుంటుంది. అందుకోసం ఈ నిజం అరుంధతికి చెప్పాలని అనుకుంటుంది. మరోవైపు అంజులో దూరిన ఆరు..  అమర్‌ రూంలో ఉన్న తన ఫోటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. తన ఆస్తికలను తీసుకుని చేతితో పట్టుకుని దేవుడా ఈ ఆస్తికలు ఇప్పుడే నదిలో కలవకుండా చేయానుకుంటున్న నా సంకల్పాన్ని నెరవేర్చు అంటూ వేడుకుంటుంది. అటుగా వెళ్తున్న అమర్‌ అంజును చూస్తాడు.


అమర్‌: అంజు.. ( కోపంగా గట్టిగా పిలుస్తాడు)


భాగీ: ఆయన అరుపులా ఉందే.. అంజును పిలుస్తున్నారేంటి..? ( కిచెన్‌ లో ఉన్న భాగీ అనుకుంటుంది.)


అమర్‌: అంజు ఏం చేస్తున్నావు ఇక్కడ.. ఇలా బాధపడతారనే మీ అమ్మ ఫోటో బయట పెట్టకుండా రూంలో పెట్టాను. అయినా కూడా ఇక్కడకి  వచ్చి బాధపడితే ఎలా.. మీరు బాధపడి హెల్త్‌ పాడు చేసుకుంటారనే నా భయం అయినా నువ్వు చెప్పకుండా రూంలోకి ఎందుకు వచ్చావు.


  అంటూ అంజును తిడుతూ ఉంటే వెనక నుంచి భాగీ వస్తుంది. భాగీని చూసిన ఆరు షాక్ అవుతుంది. ఇప్పుడు ఫోటో చూస్తే నిజం తెలిసిపోతుంది అని భయపడుతుంటే అమర్‌ కోపంగా అంజును తీసుకుని రూంలోంచి బయటకు వస్తాడు. భాగీ వచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంది. అమర్‌ విషయం చెప్పగానే సరే లేండి మీరు అంత కోప్పడకండి అంజుకు నేను చెప్తాను అంటూ అంజును చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్తుంది. అంజులో ఉన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!