Karthika Deepam 2 Serial Today January 13th: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : టిఫిన్ బండి తగులబెట్టించిన జ్యోత్స్న - నిజం తెలుసుకున్న కార్తీక్
Karthika Deepam 2 Today Episode: కిరాయి రౌడీలను పంపించి జ్యోత్స్న దీప టిఫిన్ బండి తగులబెట్టించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Karthika Deepam 2 Serial Today Episode: జ్యోత్స్న పంపించిన రౌడీలు రాత్రిపూట దీప టిఫిన్ బండి దగ్గరకు వచ్చి నిప్పంటిస్తారు. అదే విషయం జ్యోత్స్నకు చెప్పడానికి కాల్ చేస్తారు. బండి కాలిపోవడం చూడాలని జ్యోత్స్న అడగ్గానే వీడియో కాల్ చేసి చూపిస్తాడు రౌడీ. బండి కాలిపోవడం చూసిన జ్యోత్స్న హ్యాపీగా ఫీలవుతుంది. దీపను తిట్టుకుంటూ ఎవరిని ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు దీప అని మనసులో అనుకుంటుంది. ఇంతలో నిద్ర లేచిన దీప బండి కాలిపోవడం చూసి పరుగు వస్తుంది. దీపను వీడియో కాల్ లో చూసిన జ్యోత్స్న రౌడీలను పారిపోండని చెప్తుంది. రౌడీలు పారిపోతుంటే.. దీప కార్తీక్‌ను పిలుస్తుంది. నిద్ర లేచి వచ్చిన కార్తీక్ రౌడీను పట్టుకుంటాడు. కొడుతుంటే ఇంతలో రౌడీ ఫోన్ రింగ్ అవుతుంటే.. ఆ ఫోన్ తీసుకుని చూస్తాడు. అందులో జ్యోత్స్న నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. కార్తీక్ లిఫ్ట్ చేయగానే.. జ్యోత్స్న అరేయ్ ఏమైందిరా అంటుంది. ఇంతలో రౌడీ ఫోన్ లాక్కుని పారిపోతాడు.
దీప: మనం కొత్తగా మొదలుపెట్టిన జీవితం ఎలా బాడిద అయిపోయిందో చూడండి బాబు.. అన్నం పెడుతున్న అమ్మ అనుకున్నాం.. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. అన్నీ కాలిపోయాయి బాబు.. వాళ్లు ఎవరో తెలిసిందా కార్తీక్ బాబు.
అనసూయ: వాళ్లు ఎవరో చెప్పు కార్తీక్ వాళ్ల అంతు చూద్దాం.
కార్తీక్: ఆరోజు టిఫిన్ చేసి డబ్బు ఇవ్వనని గొడవ చేశాడు కదా.. వాడే ఈ పని చేసింది.
దీప: వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి ఈ మంటల్లోనే వేసి తగులబెట్టేద్దాం బాబు.
దీంతో ఊరు పేరు లేని రౌడీ అని వాడిని పట్టుకోవడం కష్టం అంటాడు కార్తీక్. బండిని చూస్తూ దీప బాధపడుతుంది. తర్వాత దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. అందరూ దీపను ఓదారుస్తారు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది.
జ్యోత్స్న: బావ.. రాత్రి టిఫిన్ సెంటర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. మొత్తం కాలిపోయిందంట కదా
కార్తీక్: కాలిపోలేదు.. కాల్చేశారు.. కావాలనే పగబట్టి.. నేరుగా ఏం చేయలేక.. బండిని కాల్చేశారు
జ్యోత్స్న: ఇంతకీ ఎవరు బావ వాళ్లు పట్టుకున్నావా..?
కార్తీక్: కాస్తలో మిస్ అయ్యారు లేకపోతే కథ వేరుగా ఉండేది.
అని కార్తీక్ చెప్పగానే దీప మీద జాలి చూపిస్తున్న దీప ఏడుస్తుందా అని అడుగుతుంది. ఇంతలో దీప అక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చునేందుకు కాలిపోయింది బండే కదా.. మేము కాదు కదా..? బండి మీద కాకపోతే బల్లమీద పెట్టుకుంటాం అంటుంది. దీప మాటలకు జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో ఓనరు వస్తాడు.
ఓనరు: పోరాడే మనిషికి ఉండాల్సిన లక్షణం ఇది కదా.. బండి కాలిపోతే బాధపడతారని, ఆధారం లేక అద్దె కట్టలేక వెళ్లిపోతారని అనుకున్నాను. నాకు కూడా నీలాంటి కూతురు ఉంటే బాగుండు.. అయినా నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి. ఇదిగో కార్తీక్ నీ ఫోన్ తీసుకో..
కార్తీక్: డబ్బులు ఇవ్వలేదు కదా
ఓనరు: మీరంటే ఏంటో ఈ మధ్యనే తెలిసింది. నేను తప్పు చేశానని అనిపించింది. అందుకే ఫోన్ ఇస్తున్నాను తీసుకో ..
అంటూ ఓనరు మాట్లాడటంతో జ్యోత్స్న మరింత రగిలిపోతుంది. ఇంతలో ఓనరు వెళ్లిపోతుంటే ఆయన్ని కార్తీక్ మెచ్చుకుంటాడు. దీంతో జ్యోత్స్న కూడా నేను సాయం చేయడానికే వచ్చాను కదా అంటుంది. చేసిన సాయం చాలు ఇక వెళ్లు అంటాడు కార్తీక్. నేనేం సాయం చేశాను అని జ్యోత్స్న అడగ్గానే… టిఫిన్ సెంటర్ తగులబెట్టావ్ కదా. నిన్ను చూస్తేంటే రక్తం మరిగిపోతోంది. లాగిపెట్టి కొట్టాలనుంది అని మనసులో అనుకుంటాడు కార్తీక్. బయటకు మాత్రం.. మా చావు మేం చస్తాం.. మా బతుకు మేం బతుకుతాం ఇక నువ్వు వెళ్లు అంటూ కోప్పడతాడు కార్తీక్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!