Satyabhama Today Episode: సత్య(Satya)తో కలిసి బోనం ఎత్తుకుని అమ్మవారి గుడికి వెళ్తున్న క్రిష్‌కు బాబీ ఫోన్ చేస్తాడు. గుడి బయట ఎవరో తనను కొడుతున్నారని చెప్పగానే క్రిష్‌(Krish) పరుగుపరుగునా అక్కడికి వెళ్లి వారందరినీ చితక్కొడతాడు. అదే సమయంలో గుడిలో సత్యను చంపేందుకు రుద్ర మారువేషంలో ఉన్న మనుషులు పెడతాడు.  ఈ విషయం గ్రహించిన క్రిష్‌....వెంటనే సత్యను కాపాడేందుకు మళ్లీ గుడిలోపలకి పరుగెడతాడు. సత్యను చండానికి  వచ్చిన కిరాయి మూకలు ఒక్కొక్కరినీ మట్టుబెడతాడు. రుద్ర(Rudhra) మనుషులను పెట్టాడని తెలియని మహదేవయ్య సైతం కత్తితో గుడిలోకి వచ్చిన ఒకరిని పట్టుకుని వెంటాడతాడు. మరోవైపు సత్య నీరసంతో కళ్లుతిరిగి పడుతూ లేస్తూ బోనం ఎత్తుకుని నడుస్తుంటుంది. క్రిష్‌ తోడురాగా  ఎట్టకేలక అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. దీంతో మహదేవయ్య భార్య కోపంతో రగిలిపోతుంది. సత్య తన పవిత్రతను నిరూపించుకోవడంతో అందరూ ఆనందపడతారు. సత్య క్రిష్‌తో తనను మామయ్య దగ్గరకు తీసుకెళ్లమని కోరుతుంది.

 

సత్య: గెలిచినందుకు మిడిసిపడటం లేదు మామయ్య.. నన్ను దూరం ఉంచిన నా వాళ్ల దగ్గరకు తిరిగి దగ్గర చేసే అవకాశం దొరికిందని సంతోషపడుతున్నాను.

 

మహదేవయ్య: అరే...మనమీద దాడి చేసిన వాళ్ల ఎవరో తెలుసుకోండిరా...

 

రుద్ర: నేను చూసుకుంటాను బాపు వాళ్ల సంగతి

 

మహదేవయ్య: అవసరం లేదు....చిన్నాగాడు చూసుకుంటాడు లే

 

 

రెండున నిద్రమాత్రలు వేసినా సత్య ఏమాత్రం పడిపోకుండా బోనం ఎత్తుకుని గుడికి రావడంపై పనిమనిషితోపాటు భైరవి చర్చించుకుంటుండగా అక్కడి వచ్చిన ఆమె కూతురు నందిని ఆగ్రహం వ్యక్తంచేస్తుంది. నువ్వు మార్గమధ్యలో సత్యకు మచ్చిగ ఇచ్చినప్పుడే అనుమానం వచ్చిందని అందరి ముందు నువ్వే ఈ పనిచేసావని చెబితే నీ పరువుపోతుందని ఊరుకున్నానన  మండిపడుతుంది. మీకోసం గతంలో ఇంతకన్నా చాలా పనులు చేశానని భైరవీ అనడంతో....అందుకే మాకు బుద్ధి వచ్చి మేమంతా మారిపోయామని నందిని చెబుతుంది. ఇప్పటికైనా నువ్వు కూడా మారి సత్య మంచితనాన్ని అర్థం చేసుకోమంటూ బుద్ధి చెప్పి వెళ్లిపోతుంది.

 

బోనాల ఉత్సవం ముగియడంతో విశ్వనాథం(Viswanatham) కటుుంబం వారి ఇంటికి తిరిగివస్తారు.పెళ్లికార్డు ఇవ్వడానకి వచ్చిన మైత్రీని  అందరూ పలకరిస్తారు.  ఆమెతో కొంచెం చనువుగా మాట్లాడిన భర్త హర్షపై నందిని రుసరుసలాడిపోతుంది. కార్డు డిజైన్ బాగుందని విశ్వనాథం అనడంతో హర్ష సెలక్ట్‌ చేశాడని మైత్రీ చెబుతుంది. దీంతో నందినికి కోపం మరింత కోపంతో రగిలిపోయి ఇంట్లోకి వెళ్లిపోతుంది. దీంతో మైత్రీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పెళ్లి పనుల్లో సాయం చేయాల్సిందిగా  మైత్రీ కోరడంతో హర్ష సరేనంటాడు. మగపెళ్లివారికిి తొలి పత్రిక ఇవ్వడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లాలని ఆమె కోరడంతో హర్ష ఒప్పుకుంటాడు.

 

గుడి నుంచి వచ్చిన తర్వాత సత్య గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. భోజనం సమయానికి కిందకు రాకపోడంతో క్రిష్ సత్య ఎక్కడని ప్రశ్నించగా...బామ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఇంట్లో తన గురించి, తన బాబోగులు పట్టించుకునేవారే లేరని క్రిష్‌కు క్లాస్‌ పీకడంతో  ఇవాల్టీ ఏపిసోడ్ ముగుస్తుంది.