Satyabhama Today Episode క్రిష్ గదిలోకి రాగానే సత్య ఇదంతా నీ ప్లానే అని నువ్వు నీ ప్లాన్ సక్సెస్ ఫుల్‌గా ఫినీష్ చేశావని సత్య అంటుంది. మొగుడు పెళ్లాల మధ్య దాపరికాలు ఉండొద్దని చెప్పే నువ్వు నా దగ్గర దాచావని అంటుంది. తన పేరు మార్చేందుకే పూజ చేస్తున్నారని ముందే తెలిసి తనకు చెప్పలేదని ఫైర్ అవుతుంది. క్రిష్ ఏం చెప్పాలి అనుకున్నా వినదు.
సత్య: మీ వాళ్లు నా పేరు మార్చుతారు అని నీకు ముందే తెలుసు. నేను ఒప్పుకోను అని నీకు తెలుసు. మీవాళ్లు గొడవ చేస్తారని కూడా నీకు తెలుసు. అప్పుడు కాలర్ ఎగరేస్తూ హీరోలా నువ్వు నా వైపు మాట్లాడితే నేను నీకు ఫిదా అయిపోతాను అని అనుకున్నావ్. అందుకే నీ ప్లాన్ పక్కాగా అమలు చేశావ్.
క్రిష్: దేవుడా.. ఇదెక్కడి పరేషాన్‌రా నా జీవితం నిజంగానే ఆవుపులి కథ లెక్క తయారైంది. దేవుడు నీకు మీదకు అందమైతే ఇచ్చాడు కానీ.. బ్రైన్ మాత్రం క్రిమినల్‌ది ఇచ్చాడు. ఎప్పుడైనా ఏ రోజు అయినా ముక్కు సూటిగా ఆలోచించావా. నా గుండె మీద చేయి వేసి చెప్పు. నా గురించి ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించావా. ఒక్కసారి అయినా తప్పు చేయలేదు ఏమో నిజంగానే చెప్తున్నాడు ఏమో అని నా వైపు ఆలోచించావా. ఎంత సేపు ఒంటి కాలి మీద లేవడమే. ఇంట్లో ఏం జరిగిన ఎవరు ఏమన్నా అంతా నా నాటకం. కత్తి అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ నా మెడకే పెడుతున్నావ్. నేనేం చేయాలి. నా మీద ఇంత విషం నింపుకున్నావా.. తప్పు జరిగిపే నీ పేరు మార్చాల్సింది. నీ పేరు సంపంగి అని పెట్టాలి అనుకున్నా సివంగి అని పెట్టాల్సింది.
మరోవైపు నందిని ఫ్రెండ్స్ వస్తారు. గదిలో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటారు. సంధ్య పరీక్షలకు చదువుతూ ఇబ్బంది పడుతుంది. అడుగుతాను అని సంధ్య వెళ్లబోతే విశాలాక్షి ఆపేస్తుంది. స్నాక్స్ తీసుకొని వెళ్తుంది. ఇంతలో హర్ష, విశ్వానాథం వస్తారు. వాళ్లు ఇబ్బంది పడతారు. విశ్వనాథం కాంప్రమైజ్ అవుతాడు. కానీ హర్ష ఆవేశంగా గదికి వచ్చి పాటలు ఆపేస్తాడు. భార్యతో పాటు తన ఫ్రెండ్స్‌కి కూడా క్లాస్ పీకుతాడు. నందిని ఫ్రెండ్స్ నందినిని రెచ్చగొట్టి వెళ్లిపోతారు. నందిని రగిలిపోతుంది.
సత్య అత్త కోసం కాఫీ తీసుకెళ్తుంది. భైరవి పేరు మార్చుకోలేదు అని తన భర్తని ఎదురించి మాట్లాడినందుకు భైరవి సత్యని తిడుతుంది. సత్య తన ఆత్మాభిమానం అని మాట్లాడుతుంది.
భైరవి: ఈ ఇంట్లో నువ్వే రాణివి అనుకుంటున్నావ్. మీ ఇద్దరూ ఇంకా కలవలేదు. ఆ ముచ్చట మీ మామకు తెలిసిందే అనుకో నరసింహా అవతారం ఎత్తుతాడు. ఎంతకైనా తెగిస్తాడు. ఎప్పటికైనా మారుతావు. మనసు మార్చుతుందని నోరు నొక్కుకుంటున్నాను. మీ మామ ఎవరిమాట వినడు. మీ తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయడు అంత వరకు తెచ్చుకోకు జాగ్రత్త.
మరోవైపు మహదేవయ్య కోడలి మాటలు గుర్తు చేసుకొని కోపంతో ఉంటాడు. భైరవి ఏమైందని అడిగితే తన దగ్గరకు రావొద్దని చెప్తాడు. కోడలు తోక జాడిస్తుంటే కంట్రోల్ చేయలేకపోయాని తిడతాడు. మంచి తనానికి పోయి తన కూతురు జీవితం నాశనం చేశావని అంటుంది. చిన్నా దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడని తిడుతుంది. ఇంతలో నందిని కాల్ చేస్తుంది.
నందిని: ఒక్క మాట చెప్ప బాపు నన్ను తీసుకెళ్లడానికి వస్తావా. నా శవాన్ని తీసుకెళ్లడానికి వస్తావా..
మహదేవయ్య: అంత కష్టం ఏమొచ్చింది బేటా.
నందిని: నువ్వు నన్ను అత్తారింటికి పంపలే.. అష్టకష్టాలు పెట్టే ఇంట్లో పెట్టావ్. అన్నీ చూసుకుంటా అన్నావ్. ఎలా ఉన్నావ్ బిడ్డా అని ఒక్కసారి అయినా కాల్ చేశావా.. సరే మీ పరేషాన్‌లు మీరు చూసుకోండి నేను చస్తా.. ఇక్కడ అందరికి నేను శత్రువుని.. ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు. నా దోస్తులు వస్తే నీ అల్లుడు వాళ్లని తిట్టి పంపాడు. నీ లెక్క ప్రేమతో మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు. నరకంలా ఉంది బాపు. ఏదో ఒకటి చేయు బాపు ఈడ నాతో కావడం లేదు..
భైరవి: నేను చెప్తూనే ఉన్నా నా మాట వినకుండా దాని పెళ్లి చేసి గొంతు కోశావ్.
మహదేవయ్య: నా కూతుర్ని ఏడిపించిన వారి పని పడతా.. మహదేవయ్య అంటే ఏంటో చెప్తా..
విశ్వనాథం ఇంటికి మహదేవయ్య, రుద్ర వస్తారు. కూతుర్ని ఇచ్చిన ఇంటికి తొంగి చూసే అవసరం నాకు రాదు అనుకున్నా కానీ నన్ను రప్పించారు అని అంటాడు. ఇక గన్ తీసి దీంతో చాలా అవసరం ఉందని అంటాడు. నందినిని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.